Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
ఆమె మీకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని తెలిపే సంకేతాలు..!!
చాలామంది అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేస్తుంటారు. చాలా బెస్ట్ ఫ్రెండ్ కానీ.. లవర్ కాదు అని చెబుతూ ఉంటారు. వాళ్ల కోసం చాలా కేర్ తీసుకుంటారు. ఇష్టపడతారు. అయితే అది పెళ్లి చేసుకునేంత ప్రేమ కాదు.. ఫ్రెండ్ షిప్ అన్నమాటలు మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఇవన్నీ ఎక్కువగా సినిమాల్లో చూస్తుంటాం.
కానీ వాళ్ల మీద ఎఫెక్షన్, ఎటాచ్ మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకీ పెరుగుతూ ఉంటుంది. వాళ్లు లేకుండా.. జీవించడం కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్ షిప్ లిమిట్స్ దాటిపోయింది అని తెలిపే లక్షణాలు కొన్ని ఉంటాయి. అప్పుడే మీకు అనిపిస్తుంది.. తానే మీ సోల్ మేట్ ఏమో అని. ఇలా ఆమె మీకు స్నేహితురాలి కంటే ఎక్కువ అని తెలిపే సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకోండి..

రోజూ మాట్లాడటం
రోజూ ఫోన్లో మాట్లాడటం అలవాటుగా మారడం. మాట్లాడకుండా ఉండలేకపోవడం. అలా మాట్లాడటాన్ని చాలా ఇష్టంగా ఫీలవుతారు.

సీక్రెట్స్
మీకు సంబంధించిన ఎలాంటి సీక్రెట్ అయినా.. తనతో పంచుకోవడానికి వెనకాడరు. ప్రతి ఒక్క విషయాన్నీ తనతో పంచుకుంటారు.

ప్రొటెక్షన్
తనకు రక్షణ కల్పించడం మీ బాధ్యతగా భావిస్తారు. ఇలాంటి సంకేతం.. తను మీకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని తెలుపుతుంది.

స్వార్థం
మీరు మరొక అమ్మాయితో స్పెండ్ చేస్తుంటే.. ఆమె సహించలేకపోవడం. తాను దూరమవుతున్నట్టు ఫీలవడం. ఇలాంటి సంకేతాలు ఆమె మీకు ఫ్రెండ్ కంటే ఎక్కువ అని తెలుపుతుంది.

మీ ప్రాబ్లమ్స్
మీ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటుంది. మీ మూడ్ బాగోలేదంటే.. మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది.

మీపై నమ్మకం
ఆమె ఫ్రెండ్స్ మీ గురించి.. చెడుగా చెప్పినా.. మీతో స్నేహంగా ఉండటం, మిమ్మల్ని నమ్మడం, మీకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వంటి సంకేతాలు.. ఆమె మీకు ఫ్రెండ్ కంటే ఎక్కువని తెలుపుతాయి.

లంచ్
ఇద్దరూ కలిసి రెగ్యులర్ గా లంచ్ చేయడం.. అలాంటి మధుర క్షణాలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం.. మీకు ఆమె ఫ్రెండ్ కంటే ఎక్కువని తెలుపుతాయి.



Click it and Unblock the Notifications