Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
మీరు ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డారని తెలిపే లవ్ సిగ్నల్స్..!!
పడ్డానండీ ప్రేమలో మరీ అంటూ.. రాగాలు తీయకపోయినా.. కొంతమంది ఆ సంకేతాలను గుర్తించలేకపోతారు. తమలో ఆలోచనలు, అభిప్రాయాలు, అభిరుచులు, సరదాలు అన్నింటిలో మార్పులు కనిపిస్తాయి. ఇష్టాయిష్టాలు మార్పులు వస్తాయి. కానీ.. అవన్నీ ప్రేమలో పడినట్టు తెలిపే సంకేతాలుగా గుర్తించలేకపోతారు.
తాము ఎంతగానో ఇష్టపడే అబ్బాయి లేదా అమ్మాయిని ఫ్రెండ్ అనే చెబుతారు. కానీ.. వాళ్లపై ఉన్న ప్రేమను గుర్తించలేకపోవడం, బయటపెట్టలేకపోవడం కొంతమంది వీక్ నెస్. అయితే.. మీరు ప్రేమలో పడ్డారని తెలిపే లవ్ సిగ్నల్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి మరి..

భవిష్యత్
భవిష్యత్ గురించి ఆలోచించడం మొదలుపెట్టడం, ఆ ఫ్యూచర్ లో మీ భాగస్వామిని ఊహించకుకోవడం వంటి సంకేతాలు మీరు ప్రేమలో ఉన్నారని తెలుపుతాయి.

మిస్ అవడం
మీరు ఎక్కువగా ఇష్టపడేవ్యక్తితో చాలా సమయం గడపాలని భావిస్తారు. అలాగే.. అతను లేదా ఆమె దూరంగా ఉన్నప్పుడు ప్రతి నిమిషాన్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగడం, ఎల్లప్పుడూ మిస్ అవుతున్నట్టు భావిస్తుంటే.. ఖచ్చితంగా మీరు ప్రేమలో ఉన్నట్టే.

సమయం గడపడం
ఎక్కువ సమయం మీ భాగస్వామితోనే గడపాలని భావిస్తారు. ఏమాత్రం సమయం దొరికినా.. మీరు ఇష్టపడే వ్యక్తితో స్పెండ్ చేయాలని భావిస్తున్నారంటే మీరు ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది.

గతంలోని రిలేషన్స్
గతంలో ఎవరినైనా ఇష్టపడినా, డేటింగ్ చేసినా.. వాళ్లతో కాంటాక్ట్ లో ఉండటానికి, వాళ్లతో గడపడానికి ఇష్టపడటం లేదంటే.. మీరు ఎవరితోనో ప్రేమలో ఉన్నారని గుర్తించండి.

ప్రాధాన్యతలు మారడం
మీకు ఇష్టమైన పనులు, మీకు నచ్చే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించి, మీరు ఇష్టపడే వ్యక్తి ఇష్టాయిష్టాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే.. మీరు ఖచ్చితంగా ప్రేమలో ఉన్నారని గుర్తించండి.

గుర్తురావడం
ఏ పనిచేస్తున్నా, ఎక్కడ ఉన్నా అనుక్షణం వాళ్ల గురించే ఆలోచిస్తున్నారంటే.. మీరు ప్రేమలో ఉన్నారని సంకేతం.

ఏదైనా మాట్లాడటానికి
మీకు నచ్చిన వ్యక్తితో.. ఏదైనా మాట్లాడటానికి ఇష్టపడతారు, అలాగే.. ఎలాంటి విషయం గురించి మాట్లాడటానికైనా.. అనుకూలంగా భావిస్తున్నారంటే.. మీరు ప్రేమలో ఉన్నారని సంకేతం. మీ ఆలోచనలు, ఫీలింగ్స్ ని ఈజీగా షేర్ చేసుకోగలుగుతారు.

వాళ్లపై నమ్మకం
వాళ్లతో గడుపుతూ ఉంటే.. మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకోగలిగారని నమ్మకం కుదరడం. రోజురోజుకీ మీలో మార్పులు, మీరొక గొప్ప వ్యక్తిగా మారడానికి తనే కారణం అని భావిస్తున్నారంటే.. మీరు అతనితో లేదా ఆమెతో ప్రేమలో ఉన్నారని గ్రహించాలి.

వాళ్లు లేకుండా ఉండలేమని భావించడం
మీరు అమితంగా ఇష్టపడే వ్యక్తి లేకుండా బతకడం చాలా కష్టమని మీరు భావిస్తున్నారు లేదా అలా ఊహించుకోలేకపోతున్నారంటే.. మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తితో ప్రేమలో ఉన్నారని తెలుపుతుంది.



Click it and Unblock the Notifications