Latest Updates
-
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్! -
ఉదయం 5 గంటలకు నిద్రలేస్తేనే సక్సెస్ వస్తుందా?.. ప్రముఖ న్యూరోసైంటిస్ట్ చెబుతున్న సంచలన నిజాలివే!
మీ భాగస్వామి నమ్మకస్తుడని తెలిపే లక్షణాలు..!!
ఏ రిలేషన్ లో అయినా.. పునాది నమ్మకం. ఇద్దరి మధ్య నమ్మకం ఉన్నప్పుడే.. వాళ్ల రిలేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సంబంధం బలపడటానికి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది.కొన్నిసార్లు మగవాళ్లు నమ్మకంగా ఉన్నారా లేదా అనే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. ఇలాంటి అనుమానాలు.. వాళ్ల సంబంధంపై ప్రభావం చూపుతాయి.
ముఖ్యంగా భార్యలను మోసం చేసిన భర్తల స్టోరీలు విన్నప్పుడు ఇలాంటి డౌట్స్ మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే కొన్ని లక్షణాలు మీ భర్తలో గుర్తించినట్టైతే.. అతను నమ్మకస్తుడే అని గుర్తించాలి. మీ భర్త మిమ్మల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నారని తెలిపే కొన్ని సంకేతాలు.. అతనిపై నమ్మకాన్ని కుదురుస్తాయి.
మీ భర్త నమ్మకస్తుడే అనిపించే ఈ లక్షణాలను మీరు మీ భర్తలో గమనిస్తే.. ఇక ఎప్పటికీ అతనితో జీవితాన్ని వదులుకోలేరు. చాలా మంచి వ్యక్తిగా, గొప్ప భర్తగా మీ భాగస్వామిని నమ్మవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే.. మీ భర్త నమ్మకస్తుడే అని తెలిపే లక్షణాలేంటో తెలుసుకుందాం..

గతంలో చీట్ చేసిన సంఘటనలు లేకపోవడం
ఒక వ్యక్తి గతం ఆధారంగా.. ఆ వ్యక్తిని అంచనా వేయలేం. అతను గతంలో ఎప్పుడూ మోసం చేయకపోతే.. ఇప్పుడు మోసం చేస్తాడని కాదు. ఇప్పటికీ ఇంకా మీకు అయోమయంగా ఉంటే.. అతని గత సంబంధాలు తెలుసుకోండి. అలాగే.. అతని నిజాయితీని ఒక్కసారి గ్రహించండి.

వెతికే కళ్లు లేకపోవడం
సాధారణంగా చాలా మంది అబ్బాయిలు.. భార్యను కాకుండా.. పక్కన ఉండే అమ్మాయిలను చూస్తూ ఉంటారు. ఇది హ్యుమన్ నేచర్. కానీ మీ భాగస్వామి ఇతర మహిళలపై ఇలాంటి ఇంట్రెస్ట్ చూపించడం లేదంటే.. అతను ఖచ్చితంగా నమ్మకస్తుడని గుర్తించాలి.

స్నేహితులకు తెలుసు
అబ్బాయి నమ్మకస్తుడు అయితే.. మీ గురించి అతని స్నేహితులందరికీ మీరు కలవక ముందే చెప్పి ఉంటారు. దీనివల్ల వాళ్లు మిమ్మల్ని గుర్తించగలుగుతారు. ఒకవేళ వాళ్ల ఆశ్చర్యంగా మిమ్మల్ని చూశారంటే.. మీ భాగస్వామి మీతో ఏదో దాచాడని ఆందోళన పడాల్సి వస్తుంది.

ప్రతి విషయంలో నిజాయితీగా ఉండటం
గతం గురించి మీతో చాలా క్లియర్ మాట్లాడటం, అన్ని విషయాలు మీతో చర్చిస్తున్నారంటే.. అతను చాలా నిజాయితీగా ఉన్నాడని గుర్తించాలి. కాబట్టి.. అతను మీతో ఏ విషయాలు దాచడం లేదు.. మీరు అతన్ని నమ్మవచ్చని సూచిస్తుంది.

తన ఫోన్
మీ భాగస్వామి నమ్మకస్తుడు అయితే.. అతని ఫోన్ చూసినప్పుడు, కంప్యూటర్ చూసినప్పుడు ఏమాత్రం ఫీలవడు, భయపడడు, ఇబ్బందిపడడు. ఇది అతను మీతో ఏ విషయాన్ని దాచడం లేదని సూచిస్తుంది.

ఫ్రెండ్స్ రిలేషన్స్
కొన్ని సార్లు భాగస్వామి ఫ్రెండ్స్ రిలేషన్స్ చాలా ఇబ్బందిపెడతాయి. కానీ.. మీ పార్ట్ నర్ ఫ్రెండ్స్ అందరూ.. చాలా నిజాయితీగా రిలేషన్స్ లో ఉన్నారంటే.. మీరు కూడా లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే.. వాళ్ల వల్ల మీ భాగస్వామి చీట్ చేసే అవకాశం ఉండదు.

మాయం అవడు
ఎల్లప్పుడూ.. మీ బాయ్ ఫ్రెండ్ ని గమనించడం చాలా కష్టం. కానీ.. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా, ఫోన్ మాట్లాడినా మీతో చెప్పడం, మీ పక్కనే ఉండటం వంటి లక్షణాలన్నీ.. మీ భాగస్వామి నిజాయితీని, నమ్మకాన్ని సూచిస్తాయి.



Click it and Unblock the Notifications