Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ప్రేమ నిజమైనదో కాదో తెలుసుకోవడానికి ఒక చెక్ లిస్ట్ ...!
లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్..ప్రేమ పేరు చెబితేనే ఈ మధ్య మీరు పులకించిపోతున్నారా? లేక చాలాకాలం నుండి లవ్ లో ఉన్నారా? రెండూ మంచివే..కానీ ఆ ప్రేమ పెళ్లి పీటలెక్కితేనే ఆనందం. మరి మీ ప్రేమ ఆ దారిలో సాగుతోందా? మీరు లవ్ లో ఉన్నారు. అనతి పేరెత్తగానే మీ కళ్లల్లో వెలుగు, ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. అతనితో ఉన్నప్పుడు గంటలు నిముషాల్లా గడిచిపోతాయి.
నిజమే కదూ..! ఓకే తర్వాతేంటి? మీ రిలేషన్ షిప్ పెళ్లి దారిలోకి తీసుకెళ్తున్నారా? లేదా ప్రేమ విషయంలో సీరియస్ నెస్ లేకపోతే మీ ప్రేమ పెళ్లి వరకూ వచ్చే అవకాశాలు తక్కువే... ఒక వేళ పెళ్లి వరకూ వచ్చినా..అలాంటి పెళ్లిళ్లు ఎక్కువ కాలం కొనసాగవు కూడా..మరేం చేద్దాం.. ఇద్దరూ రిలేషన్ షిప్ లో సీరియస్ గా ఉన్నారా ? లేదా ? ఎలా తెలుస్తుంది.

ప్రేమ పెళ్లి విషయంలో ఈ చెక్ లిస్ట్ ని ఒక సారి గమనిస్తే చాలు...మీరేస్టేజ్ లో ఉన్నారో, మీ లవ్ ఎంత సీరియస్సో తెలిసిపోతుంది. మీ ఇద్దరిలో ఎవరు సీరియస్ గా ఉన్నారు? ఎవరు లేరు అన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

మీట్ కావాల్సిందే: మీరిద్దరూ ఎక్కువగా కలిసే ఉంటారు. ఒక వేళ రోజూ కలవడం వీలుకాకపోతే ఇద్దరికీ వీలైన ప్రతి సందర్భంలోనూ కలుస్తూనే ఉంటారు. కలిసిన ప్రతి సారి ప్రపంచాన్ని మర్చిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. కలవడానికి దొరికిన ఏ ఒక్క ఛాన్స్ ని కూడా మీరు వదులుకోరు. మీ ఇద్దరి విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరుగుతోందా? చూసుకోండి.

ఫోన్ చేయాల్సిందే: ఇద్దరికీ ఒకరికొకరు సమయం కేటాయించడం కుదరని పక్షంలో ఎంత బిజీగా షెడ్యూలున్నా సరే రోజుకు కనీసం రెండు మూడు సార్లైనా ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటున్నారా? అయితే మీ రిలేషన్ గాడిలో పడ్డట్టే...

నా ఉడ్ బీ: మీ ఇద్దరూ ఒకరి ఫ్రెండ్స్ కి ఇంకొకరిని ఏమని పరిచయం చేస్తున్నారు? తను నా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేక ఉడ్ బీ అంటూనా? లేదా నా ఫ్రెండ్ అని మాత్రమేనా?ఒక వేళ ఫ్రెండ్ అంటూ పరిచయం చేస్తుంటే మీరు మీ రిలేషన్ ని ఇతరుల నుంచి దాచి ఉంచాలనుకుంటున్నారు. ఇలాంటివి సీరియస్ గా లేని ప్రేమల్లోనే ఎక్కువగా జరుగుతాయి. ఇతరులకు చెప్పకపోవడానికి మీకేదైనా నిర్ధిష్టకారణం ఉంటే తప్ప, మిగిలిన సందర్భాల్లో 'వుడ్ బీ' అని పరిచయం చేస్తేనే సీరియస్ అని అర్ధం..

నో సీక్రెట్స్: మీ ఇద్దరికీ ఒకరి పాస్ వర్డ్ లు మరొకరికి తెలుసా? ఇద్దరి మద్యా ఎలాంటి విషయాల్లోనూ గోప్యత లేదా? అయితే మీ రిలేషన్ షిప్ సీరియస్ గా ఉందని అర్ధం. ఒకరికొకరు ఎలాంటి రహస్యాలు ఉంచుకోకుండా అన్ని విషయాలు చెప్పే స్వేచ్ఛను కూడా ఇస్తున్నారా గమనించండి.

ఆర్థిక పరిస్థితి: మీ ఇద్దరికీ ఒకరి ఆర్థిక పరిస్థితి మరొకరికి తెలుసు. ఆర్థికపరమైన నిర్ణయాలు ఇద్దరూ కలిసే తీసుకుంటారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఒకరి అప్పులు, ఖర్చులు, ఆదాయాలు, పిఎఫ్, ఇన్సూరెన్స్ వంటి విషయాలన్నీ ఇంకొకరికి తెలుసు.

ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు: కేవలం మీ ఇద్దరికీ సంబంధించిన విషయాలలోనే కాకుండా కుటుంబాలు, ఫ్రెండ్స్, మనీ మ్యాటర్స్ ఇలా ఏవైనా సరే మీ ఇద్దరూ కలిసే నిర్ణయం తీసుకుంటారు. ఒకరి నిర్ణయాలు ఇంకొకరికి నచ్చకపోతే ఇద్దరూ కలిసి కూర్చొని దాని గురించి మాట్లాడుకుని నిర్ణయానికి వస్తారు, చాలా చిన్న విషయం నుంచి పెద్ద విషయాల వరకూ దేనికైనా ఇది వర్థిస్తుంది.



Click it and Unblock the Notifications