Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
రిలేషన్ బ్రేకప్ అవడానికి అసలు కారణాలేంటో తెలుసా ?
ఎంతో అన్యోన్యంగా, ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేని వాళ్లు కూడా అనుకోని పరిణామంలో విడిపోయి ఉంటారు. రిలేషన్ నుంచి బయటకు వచ్చిన వాళ్లు చాలా డిషరెంట్ గా మారిపోతారు. వాళ్లు చాలా స్ట్రాంగ్ గా మారిపోతారు. రిలేషన్ వర్కవుట్ కానప్పుడు మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ..వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి ఇద్దరూ కారణమవుతారు.
రిలేషన్ ముగిసిపోవడానికి అసలు కారణాలేంటో అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం. దీనివల్ల ప్రేమలో అనవసర ఆందోళనలు, సమస్యలను దూరంగా పెట్టవచ్చు. రిలేషన్ బ్రేక్ అవడానికి కారణమయ్యే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం.

నమ్మకంపై సమస్యలు
ఏ చిన్న అనుమానమైనా.. మీపై చెరగని ముద్ర వేస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్య నమ్మకం చాలా అవసరం. అది ఏ ఒక్కరి పోగొట్టుకున్నా.. వాళ్ల రిలేషన్ కలకాలం ఉండలేదు. నమ్మకం అనేది సమస్యగా మారినప్పుడు.. మీ రిలేషన్ కూడా బలహీనమవుతుంది.
డిమాండ్ చేయడం
మరీ ఎక్కువగా కంట్రోల్ చేయడం, డిమాండ్ చేయడం వంటి లక్షణాలను ఎవరూ ఎక్కువ కాలం భరించలేరు. ముఖ్యంగా ఇది రిలేషన్ లో ఉండకూడదు. కమాండింగ్, డిమాండింగ్ నేచర్ రిలేషన్ ని నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఫైనాన్స్ విషయంలో
మీ భాగస్వామి తన కోసం ఖర్చుచేసుకోవడానికి సరిగా అనుమతించకపోవడం, అతిగా కంట్రోల్ చేయడం సరైన ఆలోచన కాదు. దీనివల్ల మీ రిలేషన్ పై వ్యతిరేకత పెరుగుతుంది. వాళ్లలో స్వతంత్రత కోల్పోయామన్న ఫీలింగ్ పెరుగుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలో మరీ ఎక్కువగా కట్టడి చేయకూడదు.
ఇగో
రిలేషన్ ని నాశనం చేసేవాటిల్లో అహం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. రిలేషన్ లో కాంప్రమైజ్ అవడం కంటే.. ఇగోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా కామన్ గా కనిపిస్తున్న సమస్య. కాబట్టి మీ రిలేషన్ ఇగో అనేది సమస్య కాకుండా.. జాగ్రత్త పడటం అవసరం.

గౌరవించకపోవడం
ఒకరినొకరు కామెడీ చేసుకోవడం కామన్. బావుంటుంది. కానీ.. శారీరక హింస అనేది భరించలేనిది. అలాగే మీ భాగస్వామిని గౌరవించడం చాలా ముఖ్యమైన అలవాటు. గౌరవం కోల్పోయినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి. కాబట్టి.. సమయానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ.. మీ భాగస్వామిని గౌరవించండి.



Click it and Unblock the Notifications
