Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
పొడవాటి అమ్మాయిలకే అబ్బాయిలు ఎట్రాక్ట్ అవడానికి కారణమేంటి ?
చాలామందిని చూసే ఉంటాం. పొడుగ్గా ఉండే అమ్మాయిలను చూస్తే.. అబ్బాయిలు తెగ ఎట్రాక్ట్ అయిపోతారు. అంటే.. పొట్టిగా ఉన్న అమ్మాయిలను ఇష్టపడరని కాదు. వాళ్లను ఇష్టపడతారు.. కానీ.. అబ్బాయిలు ఎక్కువగా పొడవుగా ఉన్న అమ్మాయిలకే ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. ఎందుకు ? అనేదానిపై అధ్యయనాలు కూడా జరిగాయట.
కానీ సర్వేలన్నీ.. ఫలితాలను వేరేలా వెల్లడించాయి. చాలామంది అబ్బాయిలు పొట్టిగా ఉండే అమ్మాయిలనే పెళ్లిచేసుకున్నట్లు ఈ సర్వేల్లో తేలింది. కేవలం 17 శాతం మంది అబ్బాయిలు మాత్రమే.. పొడవాటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారట.
పొడవుగా ఉండే అమ్మాయిలు డ్రెస్సింగ్ స్టైల్స్ బాగా నప్పుతాయి. ఫాలో అవుతారు. అలాగే పొడవుగా ఉండే అమ్మాయి భార్య అయితే.. పుట్టే పిల్లలు పొడవుగా ఉంటారని అబ్బాయిలు ఆలోచిస్తారట. అబ్బాయిలు పొడవాటి అమ్మాయిలను ఇష్టపడటానికి ఇది ఒక కారణమని తెలుస్తోంది. అంతేకాదు.. అబ్బాయిలు ఎక్కువగా పొడవాటి అమ్మాయిలకే ఎట్రాక్ట్ అవడానికి మరికొన్ని రీజన్స్ చెబుతున్నారు. అవేంటో చూద్దామా..

కాన్ఫిడెంట్
పొట్టిగా ఉన్న అమ్మాయిలు కూడా కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. అయితే.. పొడవాటి అమ్మాయిల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత ఎక్కువగా ఉంటాయట. వాళ్ల బాడీ ల్యాంగ్వేజ్.. వాళ్లని ప్రతి క్షణం కాన్ఫిడెన్స్ తో కనిపించేలా చేస్తుందట.

పొడవాటి కాళ్లు
సాధారణంగా పొడవుగా ఉండే అమ్మాయిలకు పొడవాటి కాళ్లు ఉంటాయి. అందుకే అబ్బాయిలు పొడవాటి అమ్మాయిలంటే క్రేజీగా ఫీలవుతారు. పొడుగు కాళ్లు.. శృంగారానికి సింబల్. అందుకే.. మగవాళ్లు పొడుగు కాళ్లకు పడిపోతారు.

గుర్తింపు
ఎంత మందిలో ఉన్న పొడుగు కాళ్లు, పొడవుగా ఉండే అమ్మాయిలు.. అబ్బాయిల కళ్లకు చిక్కుతారు. వెంటనే ఎట్రాక్ట్ అవుతారు. అందుకే.. అబ్బాయిలకు పొడవాటి అమ్మాయిలంటే ఇష్టం.

సూపర్ మోడల్స్
సూపర్ మోడల్స్ అందరూ.. పొడవుగానే ఉంటారు. పొడవుగా ఉండే వాళ్ల పర్సనాలిటీ చాలా ఎట్రాక్టివ్ గా ఉండటమే.. అబ్బాయిలకు క్రేజీగా అనిపించడానికి కారణం. అందుకే అబ్బాయిలు పొడుగ్గా ఉంటే చాలు.. ఆ అమ్మాయి మోడల్ అని మురిసిపోతారు.

స్కర్ట్ ధరించినప్పుడు
పొడవుగా ఉండే అమ్మాయిలు స్కర్ట్ వేసుకుంటే.. చాలా అబ్బాయిలు ఫ్లాట్ అయిపోవాల్సిందే. పొడవాటి కాళ్ల అందం చూసి.. పడిపోతారు. అందుకే పొడుగుకాళ్ల సుందరిపైనే అబ్బాయిల చూపంతా ఉంటుంది.

బ్యూటిఫుల్ బాడీ
పొడవుగా ఉండే అమ్మాయిల బాడీ షేప్ చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుంది. హైట్ కి తగ్గట్టు పర్సనాలిటీ ఉండటం వల్ల ఎలాంటి డ్రెస్ వేసినా.. అందంగా కనిపిస్తారు.

రిలేషన్ లో హైట్
హైట్ గా ఉండే అమ్మాయిలు ఎక్కువ మార్కులు సంపాదించేస్తారు. అయితే రిలేషన్ విషయానికి వస్తే.. హైట్ మాత్రమే.. కపుల్స్ మధ్య ప్రేమ పుట్టించదు. ప్రేమ, అర్థం చేసుకునే తత్వం, విలువలు, గౌరవం తెలిసిన అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.



Click it and Unblock the Notifications