Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
ఇద్దరితో ఒకే సారి డేటింగ్ చేయడం వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాలు
అవును డబుల్ డేటింగ్ వల్ల ప్రమాదకర పరిణామాలున్నాయి.ఇంతకీ అసలు డబుల్ డేటింగ్ అంటే ఏమిటి??ఒకే సమయంలో ఒకరితో కాకుండా ఇద్దరితో డేటింగ్ చెయ్యడాన్ని డబుల్ డేటింగ్ అంటారు.
ఇది అనైతికం కాదు ఎందుకంటే ఇద్దరికీ మన ఎంపిక గురించి చెప్తాము కాబట్టి అని కొందరంటే మరికొందరేమో సమాజానికి ఇది మంచి ఉదాహరణ కాదు అని అంటారు. డబుల్ డేటింగ్ వల్ల ఇద్దరినీ పరీక్షించి అందులో ఊకరిని ఎంచుకోవడం సులభం అవుతుంది అనేవారున్నారు.
డబుల్ డేటింగ్ చేసే కొంతమందేమో ఈ విషయాన్ని ఇద్దరి దగ్గరా దాచిపెట్టి ఒకరు లేదా ఇద్దరి హృదయాలనీ గాయపరుస్తారు.అసలు ఈ డబుల్ డేటింగ్ వల్ల కలిగే ప్రమాదకర పరిణామాలేమిటో చూద్దాము.

మీరు వరివద్ద నమ్మకం కోల్పోవచ్చు:
అవును,మీరు తమతో పాటు ఇంకొకరిని డేట్ చేస్తున్నారని తెలిస్తే మీ డేటింగ్ భాగస్వామి హృదయం దెబ్బతింటుంది.వారు మిమ్మల్ని నమ్మడం మానేసినా ఆశ్చర్యం లేదు.

మీతో డేటింగ్ కి ఎవరూ ముందుకి రాకపోవచ్చు:
మీరు డబుల్ డేటింగ్ చేసినా మీ భాగస్వాములిద్దరూ మీకు "యెస్" చెప్పకపోతే కనుక మీరు దానిని ఈజీ గా తీసుకోవచ్చు. కానీ అసలు మీతో డేట్ చెయ్యడానికి భవిష్యత్తులో ఎవరూ ముందుకి రాకపోతేనో??డబుల్ డేటింగ్‌లో ఉన్న తలనెప్పి ఇది. మిమ్మల్ని హృదయం లేని వారిగా భావించే అవకాశం ఉంది.

మీరు మోసగాడు/మోసగత్తె అనిపించవచ్చు:
డబుల్ డేటింగ్ చేసే మగవారిని స్త్రీలు మోసగాళ్ళుగా భావిస్తారు.డబుల్ డేటింగ్ చేసే మగవారు తమతో డేటింగ్ కి వస్తే స్త్రీలు అది అవమానకరంగా భావిస్తారు.

మీరు అవకాశవాదిగా కనిపిస్తారు:
డబుల్ డేటింగ్ చేసే ఆడవారిని మగవారు అవకాశవాదులుగా ముద్ర వేస్తారు.అటువంటి స్త్రీలు కేవలం డబ్బు,హోదాకే ప్రాముఖ్యతనిస్తారని పురుషులనుకుంటారు.

మీ మానసిక ఆరోగ్యం మీద సందేహం కలుగవచ్చు:
చాలా మంది డబుల్ డేటింగుని మానసిక రుగ్మతగా భావిస్తారు.డబుల్ డేటింగ్ చేసేవారు ఎదుర్కునే మరొక సమస్య ఇది.

మీ శత్రువులు పుకార్లు లేవదీస్తారు:
డబుల్ డేటింగ్ ఇంకా నైతికంగా చాలా దేశాల్లో ఆమోదం పొందలేదు. దీనిని అదనుగా తీసుకుని మీ శత్రువులు డబుల్ డేటింగ్‌లో ఉన్న మీ వ్యక్తిత్వం గురించి చెడుగా ప్రచారం చేస్తారు.

మీకు సమాజంలో విలువ ఇవ్వరు:
డబుల్ డేటింగ్ చేసే మిమ్మల్ని ఏ మాత్రం వ్యక్తిగత విలువలు, ప్రమాణాలు లేనివారిగా మీ తోటి ఉద్యోగస్తులు, పరిచయస్తులు భావించే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications