For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగ‌స్వామిని ఉడికించ‌డానికి 10 చిలిపి ప‌నులు..మ‌రింత ప్రేమ‌ను పొందేందుకే!

రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌వారు ఎక్కువ‌గా దేని గురించి ప‌రిత‌పిస్తారు. ప్రేమ‌, కేరింగ్‌, భ‌ద్ర‌త‌, న‌మ్మ‌కం, క‌మిట్‌మెంట్‌... ఇవ‌న్నీ ఎక్కువ కాలం పాటు ఒక సంబంధాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌వు. ఒక‌రి మీద ఒక‌రికున్న ప

By Sujeeth Kumar
|

రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌వారు ఎక్కువ‌గా దేని గురించి ప‌రిత‌పిస్తారు. ప్రేమ‌, కేరింగ్‌, భ‌ద్ర‌త‌, న‌మ్మ‌కం, క‌మిట్‌మెంట్‌... ఇవ‌న్నీ ఎక్కువ కాలం పాటు ఒక సంబంధాన్ని నిల‌బెట్ట‌గ‌ల‌వు. ఒక‌రి మీద ఒక‌రికున్న ప్రేమ‌, న‌మ్మ‌కం, క‌మిట్‌మెంట్లే భాగ‌స్వాములిద్ద‌రినీ ఎక్కువ కాలంపాటు నిలిపి ఉంచ‌గ‌ల‌వు. ఇలాంటి పునాదులే ఏదైనా సంబంధాన్ని గ‌ట్టిగా ప‌ట్టి నిల‌ప‌గ‌ల‌వు.

ఎక్కువ సార్లు ప్రేమ బంధాన్ని దృఢ‌ప‌ర్చ‌గ‌ల‌దు. ఐతే ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న ఉత్సాహం లేక‌పోతే రిలేష‌న్‌షిప్ బోరింగ్‌గా అవుతుంది. ప్రేమ ఒక్క‌టి ఉంటే స‌రిపోతుంది అని అంటారు. కానీ అన్ని సంద‌ర్భాల్లో అది నిజం కాక‌పోవ‌చ్చు.

 naughty ways to irritate your partner

క‌ష్ట‌కాలంలో జీవిత‌పు ద‌శ‌ల‌ను దాటుకొని అనుబంధం పెర‌గాల‌న్నా, నిల‌బ‌డాల‌న్నా భాగ‌స్వాములిద్ద‌రి కృషి కీల‌కం. రిలేష‌న్‌షిప్‌లో స్పార్క్‌ను నిల‌బెట్టుకోవ‌డం చాలా ముఖ్యం.

అలాంటి స్పార్క్ లేక‌పోతే లైఫ్ చాలా స్త‌బ్దుగా సాగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే అప్పుడ‌ప్పుడు మీ పార్ట‌న‌ర్‌ను ఇరిటేట్ చేయ‌డ‌మే మార్గం.

ఏంటి ఇలా అంటున్నారేమిటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? నిజానికి ఇలా చిరాకు పుట్టిస్తేనే ఒక‌రికొక‌రు మ‌రింత చేరువ‌వుతారు. ఇలా చేయ‌డం వ‌ల్లే ఒక‌రితో ఒక‌రు సంభాషించ‌గ‌లుగుతారు.

స్మార్క్‌, ఉత్సాహం అనేది నిండి రిలేష‌న్‌షిప్ లైవ్లీగా త‌యార‌వుతుంది. కాస్తంత బాధ‌పెట్టినా స‌రే మ‌రేమీ ఫ‌ర్వాలేదు.

ఇవాళ మేము ఇరిటేట్ చేసే కొన్ని చిట్కాల‌ను చెప్ప‌బోతున్నాం. ఇవి చేసేందుకు మీ వంతుగా కొంచెం కృషి అవ‌స‌రం.

ఐతే స‌రైన స‌మ‌యంలో వీటి ప్ర‌యోగం కూడా ముఖ్య‌మే. అవ‌త‌లివారు మూడ్ కూడా చూడ‌డం అవ‌స‌రం.

1. మాట‌ విన‌కండి

1. మాట‌ విన‌కండి

మీ భాగ‌స్వామి మీతో మాట్టాడాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు మాట విన‌కండి. ఇది మీ భాగ‌స్వామిని మ‌రింతగా బాధ‌పెట్టి మీ చూపును వారి వైపున‌కు మ‌ర‌ల్చేందుకు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మ‌రో విధంగా వాళ్ల మాట వినన్న‌ట్టే ఉంటూ త‌ల అడ్డంగా ఊపుతూ, ఏదో పాట పాడుకుంటూ ఉండి వాళ్ల‌ను ఉడికించండి.

2. స‌గం స‌గం ప‌ని

2. స‌గం స‌గం ప‌ని

మామూలు ప‌నులే చేయాల్సినంత బాగా చేయ‌కుండా ఉండండి. ఆ త‌ర్వాత ఎదుటివారి నుంచి మెచ్చుకోలును ఆశించండి. వాళ్లు ఏమీ అన‌క‌పోతే త‌గిన ప్ర‌శంస కూడా లేద‌ని ఏడుపు మొహం పెట్టండి. దీంతో మీ భాగ‌స్వామి మీ గురించి ప‌ట్టించుకోవ‌డం మొద‌లుపెడ‌తాడు.

3. పెంపుడు జంతువుల‌తో...

3. పెంపుడు జంతువుల‌తో...

మీ ద‌గ్గ‌ర ఏ పెంపుడు కుక్కో, పిల్లో ఉంద‌నుకోండి. దాంతో మీ పార్ట‌న‌ర్‌ను ఇరిటేట్ చేయ‌వ‌చ్చు. మీరు ఎలాగూ కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. దాన్ని అతిక్ర‌మించేసేయండి. మీ కుక్క పిల్ల‌ను ఇంట్లోకి రానిచ్చే అల‌వాటు లేక‌పోతే దాన్ని ఈ సారికి రానిచ్చి మీ పార్ట‌న‌ర్‌ను చిరాకు పెట్టించేలా చేయండి. అదేవిధంగా పిల్లిని బెడ్‌పైనికి రానీయ‌కుండా ఉంచుకుంటే దాన్ని ఈ సారి బెడ్ పైకి తీసుకురండి. ఐతే ఈ సంద‌ర్భంలో మూగ జీవాల‌ను క‌ష్ట‌పెట్ట‌వ‌ద్దు.

4. ఆరోప‌ణ‌లు చేసేయండి

4. ఆరోప‌ణ‌లు చేసేయండి

ఒక్కోసారి స్నేహితులు, బంధువుల మ‌ధ్య ఉన్న‌ప్పుడు మీ పైన కొన్ని త‌ప్పుడు ఆరోప‌ణ‌లు లాంటివి చేస్తుంటారు మీ భాగ‌స్వామి. ఉదాహ‌ర‌ణ‌కు వంట అస్స‌లు బాగో చేయ‌దు అనో, పిల్ల‌ల్ని అస‌లు ప‌ట్టించుకోదు అనో లాంటివి చెబుతుంటారు. ఇలాంటి స‌మ‌యంలో మీరు అత‌డిపై దూకి అత‌డి ప‌రువు పోయేలా చేసేయండి. ఐతే ఇది శ్రుతి మించ‌రాదు సుమా!

5. సంగీతంతో హోరెత్తించండి

5. సంగీతంతో హోరెత్తించండి

ప‌డుకునేట‌ప్పుడు, చ‌దివేట‌ప్పుడు, ధ్యానం చేసేట‌ప్పుడు పెద్ద శ‌బ్దాల‌తో కూడిన సంగీతాన్ని అస్స‌లు స‌హించ‌లేం. మీ భాగస్వామి ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ఇలాంటి ప‌నులు చేయ‌ద‌ల్చుకుంటే అప్పుడు పెద్ద సౌండ్‌తో సంగీతాన్ని పెట్టండి. దీంతో వాళ్ల‌కు చిరాకు పుట్టించండి. సౌండ్ త‌గ్గించ‌మ‌ని అడిగితే నా ఇష్టం నాకెప్పుడు కావాలంటే అప్పుడు పాట‌లు వింటా అంటూ ఉడికించండి. ముసలివాళ్ల మాదిరిగా చేయ‌కండి అని పై నుంచి అద‌మాయించండి. మీ వారికి ఇష్టం లేని పాట‌లు పెడితే ఇంకా బోన‌స్ పాయింట్లే.

6. గురక పెట్టండి

6. గురక పెట్టండి

మీరు నిజంగా గుర‌క పెట్ట‌గ‌లిగితే భేష్‌! గుర‌క పెట్ట‌లేక‌పోయినా అలా వ‌స్తున్న‌ట్టు న‌టించి మీ భాగ‌స్వామి నిద్ర‌ను చెడ్డ‌గొట్టే ప్ర‌యత్నంచేయండి. చిరాకు ప‌డితే ఈ విష‌యంలో మీరేమీ చేయ‌లేన‌ని జాలిగా ముఖం పెట్టండి.

7. స‌మాధానం చెప్ప‌కుండా గొణ‌గండి..

7. స‌మాధానం చెప్ప‌కుండా గొణ‌గండి..

మీ భాగ‌స్వామి మిమ్మ‌ల్నేదైనా అడిగితే మీరు వినీ విన‌న‌ట్టే ఉండండి. మాట్లాడ‌కుండా అత‌డికి అర్థం కాకుండా గొణ‌గండి. మంద్ర‌స్థాయిలో స‌మాధానం చెప్పండి. నాకేమీ విన‌ప‌డ‌టం లేదు అని అత‌డు అంటే న‌న్నేం చేయ‌మంటారు మీకు చెవుడు ఉంటే అని చెప్పి చిరాకు క‌లిగించండి.

8. వ‌స్తువుల‌తో ఆట‌

8. వ‌స్తువుల‌తో ఆట‌

కావాల‌ని ఏవైనా వ‌స్తువును దాచిపెట్టండి. దాని కోసం వెతుకుతున్న‌ట్టుగా న‌టించి... మీ భాగ‌స్వామిని వెత‌క‌మ‌ని చెప్పండి. బాగా వెతక‌గా వెత‌క‌గా దొర‌కని స‌మ‌యంలో అత‌డి ముందు వ‌స్తువును తీసి చూపించండి. త‌న వ‌ల్లే వ‌స్తువు ఎక్క‌డో ప‌డిపోయింద‌ని హంగామా చేస్తే ఆట‌లో మీరే విజేత‌.

9. టీ చేసుకొని ఇవ్వ‌కండి

9. టీ చేసుకొని ఇవ్వ‌కండి

మీ కోసం ఘుమ‌ఘుమ‌లాడే టీ చేసుకోండి. ఆ మాట‌కొస్తే ఏదైనా డ్రింక్ ఫ‌ర్వాలేదు. మీ భాగ‌స్వామికి క‌నిపించేలా, అత‌డ్ని ఊరించేలా తాగండి. కొంచెం కూడా జాలి లేకుండా ఇవ్వ‌కుండా ఉంటే అప్పుడు మీ వాడికి లోప‌లే ఉడికిపోతుంది.

10.ప్లేట్ లోంచి ఆహారం తీసేసుకోండి

10.ప్లేట్ లోంచి ఆహారం తీసేసుకోండి

చాలా మందివారు తినే కంచంలో ఆహారాన్ని ఎదుటి వ్యక్తి తీసుకోవ‌డాన్ని ఇష్ట‌ప‌డ‌రు. ఈ సారి అత‌డి ప‌ర్మిష‌న్ లేకుండా అత‌డి ప్లేట్‌లోంచి ప‌దార్థాల‌ను తీసుకొని తినేసేయండి. అత‌డికి ఇష్ట‌మైన దాన్ని తీసుకుంటే మ‌రింత చిరాకు పెట్టించి ఉడికించిన‌వార‌వుతారు.

English summary

naughty ways to irritate your partner | how to irritate your partner in good spirit

For a relationship to grow and sustain itself through the turbulent times and the tough phases of life, both the partners must put in constant effort. Keeping the spark in your relationship is very important. There are certain fun ways one can try to irritate the other half.!
Desktop Bottom Promotion