For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్య నీతి : ఇటువంటి వ్యక్తులకు మీ జీవితంలో కానీ..మీ ఇంట్లో కానీ ఎట్టి పరిస్థితిలో చోటు ఇవ్వకండి

By R Vishnu Vardhan Reddy
|

ఇటువంటి వ్యక్తులకు మీరు మీ జీవితం లో ఎప్పుడు గాని ఆతిధ్యం ఇవ్వకండి :

మనం చాలా సార్లు ఎదుటి వ్యక్తితో 'వద్దు' అని చెప్పడానికి మొహమాటపడుతుంటాం. చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్న కొంత మంది వ్యక్తులు మనకు నచ్చకపోయినా, వాళ్లకు మన ఇంట్లో లేదా సామాజికంగా కలిసే ప్రదేశాల్లో ఆతిధ్యం ఇవ్వవలసి వస్తుంది. ఎందుచేతనంటే తప్పదు, తప్పక అలా చేయాల్సి వస్తుంది.

అయితే ఎంతో గొప్ప తత్వవేత్త అయిన చాణక్యుడి ప్రకారం ఈ క్రింద చెప్పబడిన వ్యక్తులకు ఎప్పుడు గాని ఆతిధ్యం ఇవ్వవద్దని అస్సలు వారిని గుర్తించే ప్రయత్నం కూడా చేయకండి అని చెబుతున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అబద్దపు వ్యక్తిత్వం కలవారు :

అబద్దపు వ్యక్తిత్వం కలవారు :

చాలా మంది వ్యక్తులు వారి యొక్క అసలైన స్వభావాలను ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల దగ్గర అత్యంత నమ్మకస్తులుగా ఉన్నట్లు వ్యవహరిస్తారు. కానీ వారు లేనప్పుడు లేదా వారి వెనుక, వారి గురించే చెడు మాట్లాడుతుంటారు. ఇటువంటి వ్యక్తులను ఎప్పుడు గాని మీ జీవితంలో గుర్తించే ప్రయత్నం చేయకండి. అసలు వారికి ప్రాముఖ్యత కూడా ఇవ్వకండి అని చెబుతున్నాడు చాణుక్యుడు.

ఇలా ఎందుకు చేయమంటున్నారంటే :

ఇలా ఎందుకు చేయమంటున్నారంటే :

ఏ వ్యక్తులైతే వారి యొక్క వ్యక్తిత్వంలో రెండు భిన్నమైన స్వభావాలు కలిగి ఉంటారో, అటువంటి వ్యక్తులు చాలా ప్రమాదకరం అని చెబుతున్నాడు చాణక్యుడు. ఇలాంటి వారు మీ ముందు మీ గురించి ఎంతో తియ్యటి మాటలు మాట్లాడతారు. కానీ మీరు లేని సమయంలో మీ గురించే పుకార్లు వ్యాప్తిచేస్తారు. ఇటువంటి వ్యక్తులకు పూర్తిగా దూరంగా ఉండండి.

ఎవరైతే చెడు పనులు చేస్తారో :

ఎవరైతే చెడు పనులు చేస్తారో :

ఈ ప్రపంచంలో చెడు పనులు చేసే వ్యక్తులకు కొదవ లేదు. ఇటువంటి వ్యక్తులు ఎదుటి వ్యక్తుల పై భౌతిక దాడికి దిగుతుంటారు. వేరే వ్యక్తుల యొక్క మనస్సుని, ఆలోచనలని కలుషితం చేసేలా ప్రవర్తిస్తూ వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తుంటారు. ఇటువంటి వ్యక్తులు అహంకారంతో పాటు మోసపు స్వభావాన్ని కలిగి ఉంటారు. కావున వారిని మీరు చాలా దూరంగా ఉంచండి.

ఎందుకు ఇలా చేయాలంటే :

ఎందుకు ఇలా చేయాలంటే :

ఇటువంటి వ్యక్తులు నమ్మడం మన జీవితంలో చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే, వీరు అంత నమ్మదగిన వ్యక్తులు కాదు, వెన్నుపోటు పొడుస్తారు, క్రూరంగా వ్యవహరిస్తారు మరియు ఇష్టం వచ్చినట్లు ఉంటారు. అంతేకాకుండా అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలకు కూడా పాల్పడుతుంటారు. అటువంటి వ్యక్థలకు ఎప్పుడు మీ ఇంట్లో ఆతిధ్యం ఇవ్వకండి.

ఎవరైతే అవకాశవాదులుగా ఉంటారో :

ఎవరైతే అవకాశవాదులుగా ఉంటారో :

ఒక పాత మరియు గొప్ప నానుడి ఏమిటంటే " అవసరంలో లేదా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఒక స్నేహితుడే నిజంగా నమ్మదగిన స్నేహితుడు ". ఏ వ్యక్తులైతే నిజాయితీగా మరియు నమ్మకస్తులుగా ఉంటారో అటువంటి వ్యక్తులకు ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. అయితే, ఇదే కాకుండా ఏ వ్యక్తులైతే అవసరమున్న సమయంలోనే మీ వద్దకు వచ్చి సహాయం కోరుతారో అటువంటి వ్యక్తులను అస్సలు దగ్గరకు రానియ్యకండి. మీరు అలాంటి వారిని దూరం పెట్టడం మంచిది.

ఎవరైతే మిమ్మల్ని బుద్ధిలేని వారీగా చిత్రీకరిస్తారో :

ఎవరైతే మిమ్మల్ని బుద్ధిలేని వారీగా చిత్రీకరిస్తారో :

మిమ్మల్ని ఎవరైతే విపరీతంగా విసిగిస్తారో లేదా కావాలనే ప్రశ్నలు అడిగి ఇబ్బందిపెడతారో లేదా వాళ్ళు ఏమి చేసినా మీరు పట్టించుకోరని చెప్పి మీ గురించి అవహేళన చేస్తారో అటువంటి వ్యక్తులు మీ జీవితంలో మీ శ్రేయోభిలాషులుగా ఉండటానికి అనర్హులు. ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం కూడా చేయకండి.

ఎవరైతే ఇతరులను గాయపరుస్తారో :

ఎవరైతే ఇతరులను గాయపరుస్తారో :

కొంతమంది వ్యక్తులు కావాలనే లేదా పొరపాటునో ఇతరులను గాయపరుస్తారు. అయితే కొంతమందిలో తప్పుచేశామనే భావన ఉండదు. అటువంటి వ్యక్తులను ఒకసారి క్షమించవచ్చు. కానీ, వారు ఎప్పుడైతే ఆ తప్పుని పదేపదే చేస్తూనే ఉంటారో అటువంటి వారిని చెడు వ్యక్తిత్వం గల వ్యక్తులుగా గుర్తించాలి. వారిని మీ చుట్టు ప్రక్కల ఉండనివ్వకుండా దూరం పెట్టాలి.

ఎందుకు అలా చేయాలంటే :

ఎందుకు అలా చేయాలంటే :

అటువంటి వ్యక్తులు ఎదో సాధారణంగా ఇతరులకు నష్టపరుద్దాం అని కాదు. కొన్ని సార్లు వాళ్ళు భౌతిక దాడికి దిగుతారు మరికొన్ని సార్లు ఎదుటివారి జీవితాలనే నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఇటువంటి వ్యక్తులు ఎదుటివారి మనోభావాలను అస్సలు పట్టించుకోరు. వాళ్లకు ఏది సరైనది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి.

ఎవరికైతే వేదాల పై అస్సలు జ్ఞానం ఉండదో :

ఎవరికైతే వేదాల పై అస్సలు జ్ఞానం ఉండదో :

ఎవరికైతే వేదాల పై అస్సలు జ్ఞానం ఉండదో అటువంటి వారితో అస్సలు స్నేహం చేయకండి అని చెబుతున్నాడు చాణక్యుడు. ఎందుచేతనంటే వేదాలు అనేవి శక్తి కేంద్రాలు మరియు జీవితంలో ఆచరించాల్సిన, పాటించాల్సిన విలువలను నేర్పిస్తాయి. ప్రతి ఒక్కరు వేదాలను ఖచ్చితంగా నమ్మాలి మరియు ఆ పవిత్రమైన గ్రంధములను అభ్యసించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి.

ఇలానే ఎందుకు చేయాలంటే :

ఇలానే ఎందుకు చేయాలంటే :

ఏ వ్యక్తులైతే వేదాలను నమ్మరో అటువంటి వ్యక్తుల్లో సానుకూలమైన ఆలోచనలు ఉండవు. వాళ్ళు ఎప్పుడు చెడునే ఆలోచిస్తారు మరియు చెడు చేయడానికే ప్రయత్నిస్తారు. ఇటువంటి వ్యక్తులను ఎప్పుడు మీ జీవితంలో దగ్గరకు చేరదీయకండి.

వ్యతిరేకతకు దూరంగా ఎలా ఉండాలి :

వ్యతిరేకతకు దూరంగా ఎలా ఉండాలి :

తమ జీవితంలో వ్యతిరేకతకు ఎలా దూరంగా ఉండాలి అనే విషయమై చాలా మంది ఆలోచిస్తుంటారు. అటువంటి వ్యక్తుల కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు చెప్పబడినవి. ఈ పిచ్చి ప్రపంచంలో మీరు మంచిగా బ్రతకాలంటే ఏమి చేయాలి అనే విషయమై ఇప్పుడు తెలుసుకుందాం.

మరీ ఎక్కువ వ్యక్తిగతంగా తీసుకోకండి :

మరీ ఎక్కువ వ్యక్తిగతంగా తీసుకోకండి :

మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైనా మరీ ఎక్కువ వ్యతిరేక భావాలతో ఆలోచిస్తుంటే అటువంటి సమయంలో వారి యొక్క పరిస్థితిని అర్ధం చేసుకోడానికి మొదట ప్రయత్నించండి. ఈ వ్యతిరేక భావన అనేది వ్యక్తిత్వం లోపల ఉండే ఒక స్వాభావిక గుణం. ఏ వ్యక్తులైతే ఎక్కువగా అసంబద్ధంగా వ్యవహరిస్తుంటారో అటువంటి వ్యక్తులకు సహాయం అవసరం.

ఎప్పడూ కృతజ్ఞత భావంతో ఉండండి :

ఎప్పడూ కృతజ్ఞత భావంతో ఉండండి :

మీరు మీ జీవితంలో గనుక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ, మీరు ఏ పనిచేసినా అది విఫలమవుతుంటే లేదా ఎన్నో బాధలు పడుతుంటే మీకన్నా నీచ స్థితిలో ఉన్న వ్యక్తుల వైపు చూడండి. ఉదాహరణకు మీ ఇంట్లో పనిచేసే వారు, మీ డ్రైవర్, మీ కాపలా మనిషి మొదలైన వ్యక్తులను గమనించండి. ప్రతి ఒక్కరికి మంచి జరిగే సమయం కూడా ఉంటుంది, అటువంటి సమయం కోసం వేచి చూడండి.

జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది :

జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది :

జీవితం అనేది రోడ్డు ప్రయాణంలాంటిది అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రయాణంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కానీ వాటన్నింటిని మీరు దాటుకొని విజయం సాధించే శక్తి మీలో ఉందని గుర్తించండి. అంతే కాకుండా మీ జీవితంలో అన్నింటిని ఒకటేసారి చేయాలని ప్రయత్నించకండి. ప్రతి ఒక్క రోజుని ఎలా వచ్చినా స్వీకరించడం ప్రారంభించండి.

సవాళ్ళను స్వీకరించండి :

సవాళ్ళను స్వీకరించండి :

మీలో ఉన్న వ్యతిరేక భావన మిమ్మల్ని క్రుంగ దీస్తోందా ? మీరు ఎందుకు ఆ వ్యతిరేకతను ఒక నిర్మాణాత్మక ఆలోచనల వైపు అడుగులు వేసేలా ఆ అవకాశాన్ని మలుచుకోరు ? అలా గనుక చేస్తే మీకెంతో ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. అందుకు మీ కృషి అవసరం. ఇలా చేయడం మొదట్లో కష్టం అనిపించవచ్చు. కానీ అలా చేసిన తర్వాత వచ్చే ప్రతిఫలం మీకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుంది లాభాన్ని కలిగిస్తుంది.

మీకంటూ కొద్దిగా సమయాన్ని గడపడానికి వెచ్చించండి :

మీకంటూ కొద్దిగా సమయాన్ని గడపడానికి వెచ్చించండి :

మీ ఒత్తిడిని తగ్గించుకోవడంలో మీరే కీలక పాత్ర పోషించగలరు అని మీకు తెలుసా ? వ్యక్తిగతంగా మీ అంతకు మీరే ఏకాంతంగా సమయాన్ని గడపండి. మీలో ఉన్న లోపలి స్వభావాలను తెలుసుకొనే ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలను ఊహలను విశ్లేషించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మీరే స్ఫూర్తిని పొందగలరు. అలా చేయడం ద్వారా మీరు చైతన్యవంతులై మీ జీవితాన్ని వీలైనంత ఉత్తమంగా జీవించడానికి ఈ ప్రయత్నం ఎంతగానో దోహద పడుతుంది.

English summary

Chanakya Neeti: Never host these people in your homes or your life!

Chanakya Neeti: Never host these people in your homes or your life!, According to the great philosopher Chanakya, there are certain kinds of people one should never host or even acknowledge. Read on to know more...
Desktop Bottom Promotion