2018 రోజ్ డే గురించి మీరు ఖఛ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

అసలు ఈ ప్రపంచం ఉద్భవించిన నాటి నుండి కూడా, ప్రేమకు గుర్తుగా ప్రేమని తెలియజేయడానికి రెండే రెండు ఉన్నాయి అని చెప్పవచ్చు. మొదటిది ఎరుపు రంగు, రెండవది రోజా పువ్వు. అందునా ప్రేమికుల వారం లేదా వాలెంటైన్స్ వారంలో రోజా పువ్వులను ప్రేమికులు ఎక్కువగా ఇచ్చిపుచ్చుకుంటుంటారు.

ప్రతి సంవత్సరం, వాలెంటైన్ వారం ఫిబ్రవరి 7 వ తారీఖున మొదలవుతుంది. ఈ రోజు నుండి ప్రతి రోజు ఒక వారం పాటు, ప్రేమలోని ఒక ప్రత్యేకమైన అంశానికి అంకితం చేయడం జరిగింది. ఈ వారం ఫిబ్రవరి 14 తో ముగుస్తుంది. ఆ రోజుని ప్రపంచం వాలెంటైన్స్ డే గా పిలుస్తుంది లేదా ప్రేమికుల దినోత్సవం గా పిలుస్తారు.

All you need to know about Rose Day 2018

ఈ ప్రేమికుల వారం రోజా పువ్వు రోజుతో మొదలవుతుంది. ఈ సందర్భంగా జంటలు రోజా పూలని ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ రోజున చేసే ఈ పని ప్రేమ గురించి ఎన్నో చెప్పలేని భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగపడుతుంది మరియు సంబంధ బాంధవ్యాల్లో ఒకరి పై ఒకరికి ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంచుతుంది. భారతదేశంలో కొంతమంది ప్రజలు ఈ వ్యవహారం అంతా అసంబద్దమైనదిగా భావిస్తారు. మరి కొంతమందేమో బహిరంగంగా ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయని అంతకు మించి వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఏమి లేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

కానీ, వీరు చెప్పేది నిజానికి చాలా దూరంగా ఉంది. గులాబీ రోజు, అంటే రోజ్ డే యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు మనలో ప్రతి ఒకరు, మన జీవితంలో కొంత సమయాన్ని ఈ రోజ్ డే గురించి కేటాయించాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితంలో ఎవరైతే వారి జీవితం మొత్తాన్ని, మీ పై ప్రేమని చూపించడానికి ఆప్యాయత పంచడానికి సమయం కేటాయించారో వారి కోసం ఈ రోజుని జరుపుకోవాలి. అందుకోసం తీరిక చూసుకొని మరీ సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ఇప్పుడు మీరు ఈ వ్యాసంలో రోజ్ డే యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నారు.

స్నేహితుల మధ్య ప్రేమ :

స్నేహితుల మధ్య ప్రేమ :

అందరు నమ్మిందానికి విరుద్ధంగా ఒక నమ్మలేని నిజం ఏమిటంటే, రోజ్ డే అనేది కేవలం ప్రేమికులు మాత్రమే జరుపుకునేది కాదు. విభిన్న రకాల రోజా పూలు, వివిధ రకాల భావాలను తెలియజేస్తాయి. స్నేహితులు కూడా రోజా పూలని ఇచ్చి పుచ్చుకోవచ్చు. ఎందుకంటే, స్నేహమే ప్రేమలోని ఉత్తమమైన లక్షణం. పసుపు పచ్చ రోజా పువ్వు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుంది. అందుచేత మీ స్నేహితులకు ఈ రోజు ఈ రంగు రోజా పువ్వు ఇవ్వవచ్చు. గులాబీ రంగు రోజా పువ్వు కృతజ్ఞత భావానికి చిహ్నంగా నిలుస్తుంది. అందుచేత మీరు ప్రేమించే వ్యక్తులకు ఈ రంగు రోజా పువ్వు ఇవ్వవచ్చు.

మరణించినవారి పై ప్రేమ :

మరణించినవారి పై ప్రేమ :

ఇది వినడానికి కొద్దిగా బాధగా ఉన్నా, ఈ నిజాన్ని మాత్రం అందరూ తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మన మధ్య లేనప్పుడే వారి అవసరం మరియు వారి గొప్పదనం మనకు తెలుస్తుంది. ఇటువంటి సందర్భంలో, తెలుపు రోజా పువ్వుని వారు మరణించిన ప్రదేశంలో పెట్టి తమ సంతాపాన్ని తెలియజేయవచ్చు లేదా ఈ పవిత్రమైన రోజున, వారి ఫోటో ముందు కూడా తెలుపు రోజా పువ్వుని పెట్టవచ్చు. ఇలా చేయడం వల్ల మీ మనస్సు ఎంతో శాంతపడుతుంది. తెలుపు రంగు రోజా పువ్వు పవిత్రతకు మరియు స్వచ్ఛతకు చిహ్నంగా నిలుస్తుంది. ఈ ప్రేమమయం అయినా రోజు నాడు బ్రతికి ఉన్నవారికి తెలుపురంగు రోజా పువ్వు సాధ్యమైనంత వరకు ఇవ్వకండి.

విభిన్న రకాల ప్రేమ కోసం :

విభిన్న రకాల ప్రేమ కోసం :

"మొదటిసారి ప్రేమలో పడటం" అనే దానికి చిహ్నంగా లేవేండర్ రోజా పువ్వు నిలుస్తుంది. మీకు గనుక ఎవరి పైన అయినా ప్రేమ ఉంటే మరియు మీ ప్రేమని వారితో ఎప్పుడూ గనుక వ్యక్తపరచకపోయి ఉంటే, అటువంటి సమయంలో మీరు ప్రేమించే వ్యక్తికి లేవేండర్ రంగు రోజా పువ్వు ఇవ్వవచ్చు. మీరు గనుక ఎవరితో అయినా ప్రేమలో ఉంటే, మరియు ఆ సంబంధాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లని భావించినట్లైతే గనుక అటువంటి సమయంలో నారింజ రంగు రోజా పువ్వు ఇవ్వండి. నారింజ రంగు రోజా పువ్వు అభిరుచికి మరియు కోరికకు చిహ్నంగా నిలుస్తుంది. అయితే ఎవరైనా ఆనందంగా ఉన్నారని మీరు వారికి చెప్పాలనుకుంటే గనుక, అటువంటి సమయంలో పీచు రంగు రోజా పువ్వు ఇవ్వండి. ఈ రంగు రోజా పువ్వు వినయంగా ఉన్నారని చెప్పడానికి, ప్రశంసించడానికి మరియు ప్రేమని వ్యక్తపరచడానికి చిహ్నంగా నిలుస్తుంది. ఒకవేళ మీరు గనుక ఏ రంగు రోజా పువ్వు ఇవ్వాలి అనే అయోమయంలో ఉన్నట్లయితే, అటువంటి సమయంలో ఎరుపు రంగు గులాబీ పువ్వు ఇవ్వండి.

ఆహారాన్ని ఎక్కువగా ప్రేమించేవారు :

ఆహారాన్ని ఎక్కువగా ప్రేమించేవారు :

ఎవరైతే ఆహారాన్ని ఎక్కువగా ప్రేమిస్తారో, అటువంటి వ్యక్తులు రోజా పువ్వు రోజుని వివిధరకాలుగా జరుపుకోవచ్చు. గులాబీ ఫిర్నీ అనే రుచికరమైన వంటకాన్ని మీకు నచ్చిన వారికి ఈ రోజు ఇవ్వవచ్చు. యాలకాయ పొడి, మంచి నాణ్యత కలిగిన కుంకుమ పువ్వుని ఉపయోగించి, రోజ్ పొడి మరియు రోజ్ వాటర్ ని కలిపి రోజ్ డే నాడు ఈ ప్రత్యేకమైన ఆహారాన్ని తయారుచేయవచ్చు. ఇదే కాకుండా రోజా పూల రేకులను, గుడ్డులోని తెల్ల సొనని మరియు నిమ్మకాయ రసాన్ని ఉపయోగించి రోజ్ పెటిల్ సోర్బెట్ అనే వంటకాన్ని తయారుచేయవచ్చు.

సోమరిగా వ్యవహరించేవారి కోసం ఆహారం :

సోమరిగా వ్యవహరించేవారి కోసం ఆహారం :

కొంతమంది విపరీతమైన ప్రేమని కురిపిస్తారు, కానీ ఆహారం విషయంలో సోమరిగా ఉంటారు. ఈ రెండిటి కలయిక నిజజీవితంలో అంత అభినందనీయం కాదు. ముఖ్యంగా మీరు రోజ్ డే ని జరుపుకోవాలని భావిస్తున్నట్లైతే, అటువంటి సమయంలో మీరు ఆ ఆనందాన్ని పొందలేకపోవచ్చు. అయినప్పటికీ కుంకుమ పువ్వు మరియు రోజ్ సిరప్ ని ఉపయోగించి ఒక మంచి రోజా పూల వాసనతో వెదజల్లే ఆహారాన్ని తయారుచేయవచ్చు. ఈ ఆహారం కంచం లో చూడటానికి మాత్రమే ఎంతో అందంగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. ఇది చేయడం చాలా సులభం మరియు తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది.

పాత పద్దతిలో జరుపుకోవాలనుకునే వారు :

పాత పద్దతిలో జరుపుకోవాలనుకునే వారు :

వ్యక్తులు ఎవరైతే పాత పద్ధతుల్లో జరుపుకోవాలని భావిస్తారో, అటువంటి వ్యక్తులు ఈ రోజ్ డే సందర్భంగా తాము పడుకునే పరుపుల పై రోజా పూల రేకులని జల్లుకోవచ్చు. రోజా పూల సువాసనను వెదజల్లే క్యాండిల్స్ ని కూడా వాడవచ్చు. అందమైన వెలుగులతో అలంకరించడం ద్వారా వాతావరణాన్ని ఎంతో ప్రేమ మయంగా మార్చి ఈ ప్రేమ వారం, ఈ సంవత్సరంలోనే ఒక మధురానుభూతిగా మిగిలిపోయేలా చేసుకోవచ్చు.

కాస్త ఎక్కువగా చేయాలనుకునే వారు :

కాస్త ఎక్కువగా చేయాలనుకునే వారు :

వ్యక్తులు ఎవరైతే మరి కాస్త ఎక్కువ కృషిని పెట్టి, ఈరోజు ఉత్తమంగా ఉండాలని భావిస్తారో, అటువంటి వ్యక్తులు బెలూన్ లోపల రోజా పూల రేకులను పెట్టవచ్చు. ఎప్పుడైతే, మీరు మీ భాగస్వామితో ప్రేమలో మునిగితేలుతుంటారో, అటువంటి సమయంలో మీ భాగస్వామి చేత ఆ బెలూన్ ని పేలిపించండి. దీనికి తోడు, జంటలు బయటకు వెళ్లి రోజా పూలను ప్రతిబింబించే ఆహారాన్ని తినండి లేదా అలాంటి రోజా పువ్వు నేపథ్యం ఉన్నా కాండిల్ లైట్ డిన్నర్లు చేయండి. ప్రముఖ పట్నాలు మరియు నగరాల్లో ఈ రోజా పూల నేపథ్యం ఉన్న ఆహారాన్ని ఈ రోజున ఎక్కువ రెస్టారెంట్స్ లో పెట్టడం జరుగుతుంది.

సరైన పద్దతిలో కేశాలంకరణ చేసుకోండి :

సరైన పద్దతిలో కేశాలంకరణ చేసుకోండి :

ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే వాలెంటైన్ డే రోజున ఎక్కువ ఆశ్చర్యపరచాలని భావిస్తారో, అటువంటి వారి కోసం ఎన్నో రకాల రోజా పూల నేపథ్యం ఉన్న కేశాలంకరణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇలా చేయడం ద్వారా, మీరు సాధారణంగా కంటే కూడా విభిన్నంగా ఉంటారు మరియు మీరు మీ భాగస్వామి ఎదో కొత్తదనం కోసం ప్రయత్నించినట్లు ఉంటుంది. ఇలా చేయడం ఎంతో ప్రోత్సహించినట్లు ఉంటుంది. ఎందుకంటే, మీరు ఈ సాధారణమైన విషయం చేయడం ద్వారా మీ జంట మీ యొక్క స్వాతంత్య్రాన్ని కోరుకున్నట్లవుతుంది. అంతేకాకుండా చాలామంది ఈరోజు రోజా పూలని మాత్రమే ఇచ్చిపుచ్చుకుంటుంటారు. మీ జంట ఇలా చేయడం ద్వారా వారికంటే మీ జంట విభిన్నంగా కనపడుతుంది. అంతేకాకుండా మీ ప్రేమలోని విభిన్నమైన గొప్పదనం ఈ ప్రపంచానికి తెలుస్తుంది.

English summary

All you need to know about Rose Day 2018

Every year, the Valentine’s week starts from the 7th of February. From this day on, every day is dedicated to a particular aspect of romance and the week culminates in February 14th that is the Valentine’s Day or the day of love. so today is rose day and here are the important things that you need to know about rose da
Story first published: Friday, February 9, 2018, 9:00 [IST]
Subscribe Newsletter