For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ నైట్ తన రూమ్ కు వెళ్లొచ్చేవాణ్ని, కులం పేరుతో చివరకు అలా చేస్తారని అనుకోలేదు #mystory202

కొన్నాళ్ల తర్వాత నా ప్రేమ గురించి చెప్పాను. తను ఒప్పుకుంది. ఇద్దరం తరుచూ బయటకలిసేవాళ్లం. తర్వాత మేమిద్దరం శారీరకంగా కూడా చాలా సార్లు కలిశాం. కులం పేరుతో చివరకు అలా చేస్తారని అనుకోలేదు.కులం, ప్రేమ.

|

అది 2014. ఫిబ్రవరి నెల. 15వ తేదీ. చాలా రోజులుగా నేను కాలేజీకి వెళ్తున్నా కూడా ఏ అమ్మాయిని కూడా ఎక్కువగా అబర్వ్ చేయలేదు. కానీ ఆ రోజు మాత్రం నా కన్నులు ఆమె రూపాన్ని చూసి మైమరిచిపోయాయి. కన్నురెప్ప వాల్చకుండా తదేకంగా తననే చూస్తూ ఉండిపోయాను. పర్పుల్ కల్ శారీలో ఆ అమ్మాయి అందం నన్ను మత్తెక్కించింది. సెలబ్రిటీ ఇలా సాధాసీదాగా రెడీ అయి కాలేజీకీ వచ్చిందేమోనని అనిపించింది.

నేను పెరిగిన వాతావరణం అంతా వేరు

నేను పెరిగిన వాతావరణం అంతా వేరు

మొట్టమొదటిసారి నేను మా సిటీ నుంచి వచ్చి వేరే సిటీలో ఉంటున్నాను. నేను పెరిగిన వాతావరణం అంతా వేరు. అక్కడ అంతా ప్రశాంతంగా ఉండేది. అక్కడి మనుషులు కూడా వేరు.. పరాయి వ్యక్తి కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్దపడేవాళ్లు. కానీ చదువుకునేందుకు మరో సిటీకి వచ్చాక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవాణ్ని. అలాంటి వాతావరణం నుంచి ఇక్కడి వచ్చినందుకు నేను ఇక్కడ ఎవ్వరితో కూడా మొదట్లో ఎక్కువగా మూవ్ కాలేకపోయాను.

కాలేజీలో ఫ్రెండ్స్

కాలేజీలో ఫ్రెండ్స్

తర్వాత నాకు కాలేజీలో ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. నాలాంటి మనసత్వం ఉన్న వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. మోసం, దగా, కన్నింగ్ తెలియని వారే నా స్నేహితులుగా మరారు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. దాంతో నేను కాలేజీకి రెగ్యులర్ వెళ్లడం స్టార్ట్ చేశాను.

అందాల సుందరి కళ్లకు కనపడింది

అందాల సుందరి కళ్లకు కనపడింది

అప్పుడే నాకు ఆ అందాల సుందరి కళ్లకు కనపడింది. తను ఎవరో నాకు తెలియదు. తర్వాత క్లాస్ రూమ్ లోనూ తను కనపడింది. నేను చాలా రోజుల నుంచి క్లాస్ కు వెళ్తున్నా కూడా ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూసేవాణ్ని కాదు. కానీ ఆమెతో మాత్రం ఎలా అయినా పరిచయం పెంచుకోవాలనుకున్నాను. ఆమె ప్రేమను పొందాలనుకున్నాను.

ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి

ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి

అయితే కాలేజీలో అప్పుడే మాకు ఒక అసైన్ మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా ఒక ప్రతి గ్రూప్స్ తయారు చేశారు. ఇక మా గ్రూప్ లో అందరూ నా ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే ఆ అమ్మాయి కూడా ఆ గ్రూప్ లో ఉంది. ఇక నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎలా అయినా సరే తనతో మాట్లాడే అవకాశం వచ్చిందనుకున్నాను.

ధైర్యం చేసి తన దగ్గరకు వెళ్లాను

ధైర్యం చేసి తన దగ్గరకు వెళ్లాను

మరుసటి రోజు నుంచి మా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఆ రోజు ఉదయమే కాలేజీకీ వచ్చాను. తను నాకంటే ముందే క్లాస్ రూమ్ లో కూర్చొని ఉంది. ఎంతో ధైర్యం చేసి తన దగ్గరకు వెళ్లాను. నా వంక తను చూడగానే గుండె వేగం పెరిగింది. నేను మీ గ్రూప్ లోనే ఉన్నానంటూ పరిచయం చేసుకున్నాను.

తన అందంతో మాయ చేసింది

తన అందంతో మాయ చేసింది

ఓ.. అలాగా.. ఒకే అంటూ చిరునవ్వు నవ్వింది. ఆమె పేరు మాయ. నిజంగా ఆమె తన అందంతో మాయ చేసింది. అయితే ఆమె హిందూ. నేను ముస్లిం. మొదట్లో ఆమె అందం చూసి మైమరిచపోయాను. తర్వాత మాత్రం భయంపట్టుకుంది. నా కులం వేరు తన కులం వేరు. అందులో ఇక్కడ పట్టింపులెక్కువ. తను నన్ను ఎలా ప్రేమిస్తుంది.? ఎలా పెళ్లి చేసుకుంటుంది? ఇది అయ్యే పని కాదులే అనుకున్నాను.

ఆమె బంధం పెరిగేలా చేసింది

ఆమె బంధం పెరిగేలా చేసింది

కానీ ఎందుకో మా మధ్య ఏర్పడ్డ పరిచయం కొన్నాళ్లకే మంచి స్నేహానికి దారి తీసింది. ఇద్దరి అభిప్రాయాలు ఒకటే కావడంతో ఈజీగా మా మనుసులు కలిశాయి. ఇక మా గ్రూప్ లోని ఫ్రెండ్స్ అంతా కూడా మా మధ్య ఏదో నడుస్తుందనుకునేవారు. స్వప్న అనే అమ్మాయి మా ఇద్దరి మధ్య మరింత బంధం పెరిగేలా చేసింది. మాయతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా మారింది నా పరిస్థితి.

శారీరకంగా కూడా చాలా సార్లు కలిశాం

శారీరకంగా కూడా చాలా సార్లు కలిశాం

కొన్నాళ్ల తర్వాత నా ప్రేమ గురించి చెప్పాను. తను ఒప్పుకుంది. ఇద్దరం తరుచూ బయటకలిసేవాళ్లం. తర్వాత మేమిద్దరం శారీరకంగా కూడా చాలా సార్లు కలిశాం. ఆమె ఫ్రెండ్ తో రూమ్ లో ఉండేది. నేను రోజూ నైట్ తన రూమ్ కు వెళ్లొచ్చేవాణ్ని.

ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చెయ్యలేదు

ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చెయ్యలేదు

తర్వాత సమ్మర్ హాలీడేస్ వచ్చాయి. ఇద్దరం మా ఊర్లకు వెళ్లిపోయాం. అయితే నాకు మాత్రం ఏదో మనస్సులో భయంగా భయంగా ఉండేది. తను ఊరికి వెళ్లిన తర్వాత ఒక్క రోజు కూడా నాకు ఫోన్ చెయ్యలేదు. తన నంబర్ కు కూడా స్విచ్ఛాప్ వచ్చింది. ఏం చెయ్యాలో తెలియక.. ఒక రోజు ఫ్రెండ్ తో కలిసి వాళ్ల ఊరికి వెళ్లాను.

సిటీకి పంపిస్తే వెదవ నాటకాలు వేసింది

సిటీకి పంపిస్తే వెదవ నాటకాలు వేసింది

తను గురించి ఎంక్వైరీ చేస్తే.. మాయకు పెళ్లి నిశ్చయం చేశారని తెలసింది. చదువుకోవడానికి సిటీకి పంపిస్తే అక్కడ ఏవేవో వెదవ నాటకాలు వేస్తుందని వాళ్ల నాన్న పెళ్లి ఫిక్స్ చేశారని కొందరు నాకు చెప్పారు. కానీ నా మాయను నేను దక్కించుకోవాలనుకున్నాను. మాయకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారనిపించింది.

ప్రాణం పోయినా నా దాన్ని చేసుకోవాలనుకున్నా

ప్రాణం పోయినా నా దాన్ని చేసుకోవాలనుకున్నా

ఒక రోజు అర్ధరాత్రి నేను మాయ ఇంటికి వెళ్లి ఆమె గదిలోకి వెళ్లాను. తను నన్ను చూడగానే గట్టిగా కౌగిలించుకుని ఏడ్చింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకోపో అంటూ కన్నీరు కార్చింది. ఒక ఆడపిల్ల అలా అడుగుతుంటే నా ప్రాణం పోయినా సరే తనని నా దాన్ని చేసుకోవాలనుకున్నాను. కానీ మాయ వాళ్ల నాన్నకు విషయం తెలియడంతో నన్ను ఆయన కొట్టించారు. మాయను కూడా కొట్టి బలవంతంగా పెళ్లి చేశారు.

భర్త పిల్లలతో కనిపించింది

భర్త పిల్లలతో కనిపించింది

కేవలం కులం వేరు అయిన కారణంగా తనను నా నుంచి విడదీశారు. కానీ ఇప్పటికీ నా గుండెల్లో మాత్రం ఆమె స్థానం అలాగే ఉంది. ఈ మధ్య ఒకసారి తన భర్త పిల్లలతో కనిపిస్తే మళ్లీ నా గతం అంతా గుర్తొచ్చి మౌనంగా రోదించాను.

English summary

Her family was Brahmin I am A Muslim But my love is sincere

Her family was Brahmin I am A Kashmiri Muslim But my love is sincere
Story first published:Wednesday, August 1, 2018, 14:26 [IST]
Desktop Bottom Promotion