For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అటాచ్మెంట్ లేకుండా ప్రేమించడం ఎలా? మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి

అటాచ్మెంట్ లేకుండా ప్రేమించడం ఎలా? మీరు ఈ స్కిల్స్ నేర్చుకోవాలి

|

ప్రేమ కేవలం ప్రేమగానే, బంధం రూపంలో కాదు!
ఎవరైనా ప్రేమ గురించి ఆలోచించగానే, ఆటోమేటిగ్గా ఇంకొక వ్యక్తితో బంధం గురించి ఆలోచిస్తారు. కానీ ఎవరన్నా మీకు ఏ అటాచ్మెంట్ లేకుండా కూడా ప్రేమలో పడవచ్చని, ఒక ఆరోగ్యకరమైన బంధాన్ని మీ భాగస్వామితో ఇలా కూడా ఏర్పర్చుకోవచ్చని చెప్తే నమ్ముతారా?

ఇక అప్పుడు మనస్సులోకి వచ్చే ప్రశ్న,” అటాచ్మెంట్ లేనప్పుడు ప్రేమలో పడి ఉపయోగం ఏంటి అని? మనం అసలు అటాచ్మెంట్ లేకుండా ప్రేమలో ఎలా పడతాం?అది నిజంగా సాధ్యమేనా? అటాచ్మెంట్ లేని ప్రేమ మంచిదేనా?”

How To Love Without Having Attachment? You Need To Learn The Skills

ఈ ప్రశ్నలన్నీ మనకి అటాచ్మెంట్ లేకుండా ప్రేమలో ఎలా పడాలో తెలియకపోవటం వలన వస్తాయి, మనస్సులో ఉన్న ఆలోచనలు,సందేహాలే ఇలా బయటకి వస్తాయి.

ప్రేమ అటాచ్మెంట్ కాదని అర్థం చేసుకోవటం చాలా కష్టమైన పని,నాకు తెలుసు. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే మీరు కూడా అర్థం చేసుకుంటారు.

ఒకసారి మీ పాత బంధం లేదా ప్రస్తుతం ఉన్న వివిధ బంధాల గురించి ఆలోచించండి. అటాచ్మెంట్ మీకు ఎలా సాయపడిందో ఆలోచించండి. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి “కేవలం అటాచ్మెంటే ప్రేమకి రూపం అయితే,నా బంధాలు ఎందుకు ముగిసిపోయాయి?”అని.

ఈ ఆర్టికల్ లో ముందుకి వెళ్ళటానికి, మీరందరూ ప్రేమ గురించిన రెగ్యులర్ ఆలోచనలు తీసేయాలని కోరుకుంటున్నాను. కొద్దిసేపు ఏ ఆలోచనలూ లేకుండా, ఈ ఆర్టికల్ చివరివరకూ చదివి అటాచ్మెంట్ తో కూడిన ప్రేమ, లేని ప్రేమ గురించి మీకెంత అర్థమయ్యిందో తెలుసుకోండి.

ఈ ఆర్టికల్ మీకు దేనికీ జవాబులు ఇవ్వదు,కేవలం అటాచ్మెంట్ లేకుండా ప్రేమలో ఎలా పడచ్చో చెప్తుంది, అలాగే మీ సొంతంగా ప్రశ్నలు వేసి,మీరే జవాబులు తెలుసుకునేలా సాయపడుతుంది.

మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి ఏం ఆశించకుండా ప్రేమించగలటం సాధ్యమేనా?

మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి ఏం ఆశించకుండా ప్రేమించగలటం సాధ్యమేనా?

ఇదే మీరు ఆలోచించాల్సిన మొదటి ప్రశ్న,మీ మనస్సును జవాబుకి కారణాలు వెతికేలా చేయండి. మీరు ఏం ఆశించకుండా, ఏం అడగకుండా ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే మీరు సరిగ్గానే చేస్తున్నారు. మీ మనస్సులో జవాబు ఇంకోరకంగా వస్తే,మీరు దేన్ని నమ్ముతున్నారో మీకే అర్థమవుతుంది.

తేడాలు అర్థం చేసుకోవటం సులభమే

తేడాలు అర్థం చేసుకోవటం సులభమే

ఎ. మీరు ఎవరినైనా అటాచ్మెంట్ లేకుండా ప్రేమించినప్పుడు, మీరు, అతను/ఆమె నాపై ఎంతో ప్రేమను కనబరుస్తారు,నేనెలా ఉన్నానో అలానే అందంగా ఫీలయ్యేట్లు చేస్తారు, ప్రతీసారి నన్ను ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేస్తారు మొదలైనవి అంటుంటారు.

బి. మీరు ఎవరినైనా అటాచ్మెంట్ లేకుండా ప్రేమిస్తే,మీరు అతను/ఆమె ప్రతివిషయంలోనూ అందంగానే ఉన్నారు, అతను/ఆమె చాలా ప్రత్యేకమైన వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తిగానే ఉంటారు,అతను/ఆమె ఎప్పుడూ నా ప్రేమను కోల్పోరు మొదలైనవి అంటుంటారు.

(ఎ మరియు బి) మధ్య మీకు తేడా ఇంకా అర్థం కాకపోతే దయచేసి మళ్ళీ చదవండి. ఈ వాక్యాల నిర్మాణం, అర్థం, అర్థం చేసుకోండి.ఇది మీరు ప్రేమించే విధానంపై మీకో కొత్త ఆలోచననిస్తుంది, అటాచ్మెంట్ ఉన్నా లేకున్నా కూడా.

అటాచ్మెంట్ లేకుండా ప్రేమలో పడే మార్గాలు

అటాచ్మెంట్ లేకుండా ప్రేమలో పడే మార్గాలు

మొదటగా చాలా ముఖ్యమైన మార్గం మిమ్మల్ని మీరు నిజంగా ప్రేమించుకోవటం. ఇదే ఇంకెవరి నుంచి అటాచ్మెంట్ కోరుకోకుండా ఉండే ఏకైక మార్గం.

మనం ఇంకొకరితో బంధం పెంచుకునేది మనల్ని మనం సంపూర్ణం చేసుకోవటానికి. అదే మీలో మీరే మీకు కావాల్సినవన్నీ పొందగలిగితే,ఇంకొకరి నుంచి అటాచ్మెంట్ కోరుకోకుండా మీరే మీ చుట్టూ ఉన్నవారికి,మీ భాగస్వామికి కూడా ప్రేమను పంచుతారు. ఇదే అద్భుతమైన ప్రేమకి బెస్ట్ పద్ధతి.

ఇలా చేయటానికి, మీరు మీ గురించి ముందు తెలుసుకుని, వాటి అన్నిటినీ ప్రేమించడం నేర్చుకోవాలి. మీరేంటో మీకు ముందు తెలిసాక, తర్వాత స్టెప్స్ సులభమౌతాయి.

ఎవరిని వారు ప్రేమించుకోలేనివారు, ప్రేమను పంచలేరు, అటాచ్మెంట్ లేకుండా ప్రేమలో పడలేరు కూడా.

2.మీరు ఇంకొకరితో అటాచ్మెంట్ ఎందుకు ఫీలవ్వుతున్నారో కారణాలు చెప్పుకోండి

2.మీరు ఇంకొకరితో అటాచ్మెంట్ ఎందుకు ఫీలవ్వుతున్నారో కారణాలు చెప్పుకోండి

మీరు ప్రేమించిన వ్యక్తి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టండి. మీరు ఎలా వారితో అటాచ్డ్ గా ఉన్నారో, దేని ఆధారంగా ఉన్నారో తెలుసుకోండి.ఇలా అర్థం చేసుకోవటం వలన మీ ప్రేమ జీవితం గురించి మీకు చక్కగా అవగాహన వస్తుంది. ఇది మీ భాగస్వామితో మీరెంత అటాచ్డ్ గా ఉన్నారో కూడా తెలుసుకునేలా చేస్తుంది.

మీ భాగస్వామి ఎక్కడెక్కడ మిమ్మల్ని పూర్తి చేస్తున్నట్లు అన్పిస్తోందో అర్థం చేసుకోండి. ఈ విషయాల్లోనే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదన్నమాట. మీరు ఆ గ్యాప్ లని ప్రేమకి అంటించకుండా మీరే నింపుకోవటం మొదలుపెట్టవచ్చు.

రెండవది, ఏ విషయాలు మీ భాగస్వామితో ప్రేమలో పడేలా చేస్తాయో, వారిలోని ఏ విషయాలు సంతోషాన్నిస్తాయో అర్థం చేసుకోండి. ఇవి వారిని ఎందుకు ప్రేమిస్తున్నారో కారణాలు తెలుసుకోవడానికి సాయపడతాయి.

3.మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా, తగినంత?

3.మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా, తగినంత?

మీరు కోరుకుంటున్న ప్రేమను మీకు మీరు ఇచ్చుకుంటున్నారా లేదా మీరు కోరుకునే ప్రేమ కోసం మీ భాగస్వామి ఇవ్వాలని ఆధారపడుతున్నారా అని మిమ్మల్ని మీరే అడిగే సమయం వచ్చేసింది.

మీకు మీరు తగినంత ప్రేమను ఇచ్చుకుంటున్నట్లైతే, మీరు ఎవరిపైనా కూడా ప్రేమ కోసం ఆధారపడలేరు, మీరు అలా ఆధారపడుతున్నారంతే అర్థం మిమ్మల్ని మీరు ఇండిపెండెంట్ చేసుకోవాలని,అలాగే ప్రేమ కోసం ఎవరి మీదా ఆధారపడకూడదని అర్థం.

4.మీరు చేసే పనులు, స్పందనలు గమనించండి

4.మీరు చేసే పనులు, స్పందనలు గమనించండి

దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి!

మీరూ, మీ భాగస్వామి నిజంగానే సీరియస్ గా కొట్టుకుంటున్నప్పుడు లేదా వాదించుకుంటున్నప్పుడు లేదా మీ భాగస్వామి పిచ్చి మూడ్ లో ఉన్నప్పుడు మీరు చేసే పనులు,మీ మూడ్ ఎలా మారుతోందో గమనించుకోండి. ఎందుకంటే మీ భావోద్వేగాలు చాలా రకాల స్పందనలు సృష్టించవచ్చు.

ఇదేం చెప్తోంది?

ఇది మీరు ప్రేమ,అటాచ్మెంట్లను మీ మూడ్ పై ప్రభావం చూపించకుండా ఎలా డీల్ చేయాలో, అవతలివారి మూడ్ ను బట్టి మీ రియాక్షన్ ఎలా ఉంచుకోవాలో చెప్తుంది.

మీరు ఏం చేస్తున్నారో గమనించటం నేర్చుకుంటే, ఆ విషయానికి సంబంధించి భావోద్వేగాలను అదుపులో పెట్టడంలో నిపుణులైపోతారు, లేకపోతే ఇద్దరూ ఈ వాదన వలన బంధం పాడుచేసుకునేవరకూ వెళ్లవచ్చు. మీ భాగస్వామి రియాక్ట్ అవుతున్న విధంగా మీరు కూడా రియాక్ట్ అయితే వారి ప్రవర్తనలో కూడా మార్పు చూడవచ్చు. దీనివలన అర్థమయ్యేది ఏంటంటే మీరు మీ భాగస్వామి భావోద్వేగాలకి అటాచ్ అయి అలానే రియాక్ట్ అవుతున్నారని.

5.ఆశించకుండా ప్రేమించటం నేర్చుకోండి

5.ఆశించకుండా ప్రేమించటం నేర్చుకోండి

ఈ స్టెప్ లో, మీరు మీ భాగస్వామిని వారి నుంచి ఏం ఆశించకుండా ప్రేమించటం మొదలుపెట్టండి. దీని అర్థం వారి నుంచి ఏమీ ఆశించకుండా మీరే వారిపై ఉన్న ప్రేమ కారణంగా వారికి అన్నీ అందించండి. మీరు కేవలం వారికి అవన్నీ చేయాలనిపించింది కాబట్టే చేయండి, ఏదో ఆశించి కాదు; వారికి ప్రేమనివ్వండి. ప్రేమను ఇస్తున్నప్పుడు ఏదీ రిటర్న్ లో అడగవద్దు. దీని వలన మీ ప్రేమలో, బంధంలో వచ్చే తేడా మీరే చూస్తారు. మీ బంధం గురించిన పాజిటివ్ సైడ్ ను, కొత్త ఆశను చూస్తారు.

English summary

How To Love Without Having Attachment? You Need To Learn The Skills

When people think of love, they automatically feel the attachment with another person. But, what if someone tells you that you can also fall in love with someone without having any form of attachment and can also create a healthier relationship with yourself and your partner in this way?
Story first published:Wednesday, June 20, 2018, 9:58 [IST]
Desktop Bottom Promotion