Latest Updates
-
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీలో మండుటెండల ఎఫెక్ట్: పెళ్లిళ్ల ప్లాన్స్ మార్చేసిన జంటలు.. అర్ధరాత్రికి షిఫ్ట్ అవుతున్న ఫేరాలు! -
జాకీ భగ్నానీ 'సిట్యుయేషన్షిప్' కామెంట్.. రకుల్ ప్రీత్ సింగ్ అదిరిపోయే రిప్లై! -
వీకెండ్ స్పెషల్..పక్కా రెస్టారెంట్ రుచితో అంబూర్ స్టైల్ సోయా బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే -
వైశాఖ పౌర్ణమి నాడు ఈ చిన్న పనులు చేస్తే.. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి! -
ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోనే ఉన్న ఈ చిట్కాలు ట్రై చేయండి -
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే!
తను నాకంటే మూడేళ్లు చిన్నోడు, కానీ ఆ విషయంలో మెచ్యూర్డ్ పర్సన్, అందుకే పెళ్లి చేసుకున్నా #mystory358
తన ఆలోచనలు.. తన ప్రవర్తన అన్నీ నాకు నచ్చాయి. అందుకే అతనితో జీవితాంతం ఉండాలనిపించింది. నా మనస్సులోని మాటను తనకు చెప్పాను. తను ఒప్పుకున్నాడు. కానీ మా నాన్న మా పెళ్లికి ఎంతకూ ఒప్పుకోలేదు.
మనకు అన్యాయం చేయకుండా మనల్ని జీవితాంతం బాగా చూసుకునేవాణ్ని పెళ్లాడితే తప్పేముంది. చాలా మంది తల్లిదండ్రులు తమ కూతుళ్లను మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కంటారు.
అందుకే పెళ్లి విషయంలో ఆచితూచి అడుగేస్తారు. కానీ ఒక్కోసారి తల్లిదండ్రులు ఎంతో ఆలోచించి తమ కూతుర్ని మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేశామని అనుకుంటారు కానీ చాలా అరేంజ్ డ్ మ్యారేజీల్లోనూ చివరకు వరకు నిలబడడం లేదు.

కులం, వయస్సు, గోత్రం వద్దు
ఇవన్నీ చూసే నేనొక నిర్ణయం తీసుకున్నాను. నన్ను చేసుకునే అబ్బాయి ఎవరైనా సరే నన్ను బాగా చూసుకుంటే చాలు అన్నుకున్నా.. కులం, వయస్సు, గోత్రం ఇలా ఏవీ పట్టించుకోకూడదనుకున్నాను. కానీ మా నాన్న మాత్రం నాకు రోజుకొక సంబంధం తెచ్చేవాడు.

సాలరీ ఎంత?
ప్రతి ఒక్కరూ కట్నం ఎంత ఇస్తారు... మీ అమ్మాయికి సాలరీ ఎంత వస్తుంది అని అడిగేవారే కానీ ఒక్కరూ కూడా మీ అమ్మాయి బాగుంది మాకు కట్నం అవసరం లేదు అని చెప్పిన వాడు లేడు.

సొంతవాళ్లే
సొంతం మా నాన్న అక్క కొడుకులు, చెల్లెలు కొడుకులు, మా అమ్మ అన్న కొడుకులు కూడా మా నాన్న కాస్త తక్కువ కట్నం ఇస్తా అనేసరికి పెళ్లి చేసుకోమని తెగేసి చెప్పారు.

చూసేందుకు వచ్చి
నన్ను చూసేందుకు వచ్చి తర్వాత నన్ను రిజెక్ట్ చేసి వెళ్లిపోతే నాకు చాలా బాధేసేది. ఏ అబ్బాయైనా నన్ను చూసేందుకు వస్తున్నాడంటే అతని గురించి మా ఇంట్లో వాళ్లు చాలా గొప్పలు చెప్పేవారు.. అబ్బాయి చాలా మంచోడమ్మా.. మంచి ఉద్యోగం చేస్తున్నాడు.. లక్షల్లో జీతం అంటూ ఏవేవో కబుర్లు చెప్పేవారు.

లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేస్తానో
నేను వారి మాటలు విని ఏవేవో ఊహించుకునేదాన్ని. ఇప్పుడు నన్ను చూసేందుకు వచ్చే వ్యక్తితోనే నాకు పెళ్లయిపోతుందన్నట్లు.. తనతో లైఫ్ ను ఎలా ఎంజాయ్ చేస్తానో ఒక బొమ్మ వేసుకునేదాన్ని.

కట్నం విషయంలో
చివరకు వచ్చిన అబ్బాయి, అతని తల్లిదండ్రులు కట్నం విషయంలో వెనక్కి వెళ్లేసరికి నా ఆశలన్నీ అడియాసలయ్యేవి.

ఫ్యాషన్ డిజైనింగ్
నాకు కొన్నాళ్లు ఎలాంటి సంబంధాలు చూడొద్దు.. చూసినా నేను చేసుకోను అని మా నాన్నకు గట్టిగా చెప్పాను.తర్వాత నేను ముంబైలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వెళ్లాను.

ఉదయం కాలేజీకి మధ్యాహ్నం
ఫస్ట్ ఇయర్ మొత్తం నా స్టడీస్ పైనే కాన్సట్రేషన్ పెట్టాను. సెకెడియర్ లో ఉదయం కాలేజీకి వెళ్తూ మధ్యాహ్నం జాబ్ చేసేదాన్ని.

ఎవరూ లేనట్లు నేను ఫీలయ్యేదాన్ని
నా డిజెన్స్, నా పనితనం నచ్చి నాకు పెద్దపెద్ద కంపెనీలు ఆఫర్స్ ఇచ్చాయి. మా కాలేజీలో నాకంటే పెద్ద డిజైనర్ ఎవరూ లేనట్లు నేను ఫీలయ్యేదాన్ని. కానీ మా కాలేజీలో చదివే మరో అబ్బాయి కూడా నేను పని చేసే కంపెనీలో పని చేస్తున్నాడని తెలిసింది.

చాలామంది సెలబ్రిటీలకు
స్టూడెంట్ లెవల్ లో అంతపెద్ద కంపెనీలో జాబ్ కొట్టాడంటే అతను మంచి టాలెంటెడ్ అనుకున్నా. తను ఎవరో తెలుసుకుందామని కలిశాను. తన పేరు వైశాల్. తను మా జూనియర్.. హెవీ టాలెంటెడ్. చాలామంది సెలబ్రిటీలకు తను డ్రెస్ డిజైన్ చేస్తాడని తెలిసింది.

మూడేళ్లు చిన్నోడు
ఫీల్డ్ లో నాకు ఉపయోగపడతాడని తనతో పరిచయం పెంచుకున్నాను. తను నాకు కొత్తకొత్త ఐడియాలు ఇచ్చేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు. తను నాకంటే మూడేళ్లు చిన్నోడు. కానీ ఆలోచనల్లో మాత్రం నాకంటే చాలా ఏళ్లు పెద్దోడు. చాలా మెచ్యూర్డ్ పర్సన్.

మనస్సులోని మాట చెప్పాను
తన ఆలోచనలు.. తన ప్రవర్తన అన్నీ నాకు నచ్చాయి. అందుకే అతనితో జీవితాంతం ఉండాలనిపించింది. నా మనస్సులోని మాటను తనకు చెప్పాను. తను ఒప్పుకున్నాడు. కానీ మా నాన్న మా పెళ్లికి ఎంతకూ ఒప్పుకోలేదు.

నాన్నకు తెలిసి
దాంతో మేమిద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకున్న విషయం నేను మా నాన్నకు చెప్పలేదు. ముంబైలోనే కాపురం పెట్టాం. కానీ మా పెళ్లి మా నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఊరి నుంచి మా బంధువులతో కలిసి ముంబై వచ్చాడు.




Click it and Unblock the Notifications