Latest Updates
-
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ జాతకం ఎలా ఉంది? - బుధవారం, 24 జూన్ 2026 -
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే..
మా ఆయన నా కళ్ల ముందే ఆమెతో గడిపాడు - My Story #47
మా ఆయన సెల్ టీవీపైన ఉంది. మా ఆయన ఇంటికొచ్చాడని అర్థం అయ్యింది. బెడ్ రూమ్ లాక్ అయి ఉంది. లోపల మా ఆయన ధ్వని వినపడుతుంది. మరో అమ్మాయి కూడా ఉన్నట్లు అర్థం అయ్యింది. నాకు ఏమి అర్థం కాలేదు.
ప్రపంచంలో దేనికైనా పరిష్కారం లభిస్తుందనుకుంటాం. కానీ బాధ వస్తే దాన్ని ఎలా నియంత్రించుకోవాలి.. బాధలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మాత్రం ఎవరూ కనిపెట్టడం లేదు. నా తప్పు లేకున్నా కూడా నేను ఎన్నోసార్లు జీవితంలో బాధపడ్డాను.

పెళ్లయి పదేళ్లు
నాకు పెళ్లి అయి పదేళ్లు అవుతుంది. నాకు పాప, బాబు ఉన్నారు. నాకు ఇరవై ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి అయ్యింది. నా భర్త బాగా చదువుకున్నాడు. పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా మర్యాదపూర్వకంగా ఉండేవాడు. మంచి తెలివిమంతుడు.

మనస్సులో ఏమి ఉంచుకోడు
మా వివాహమైన మొదట్లో ఆయన ఎలాంటి అతనో అని చాలా ఇబ్బందిపడేదాన్ని. అయితే రానురాను అతని గుణాలన్నీ నాకు తెలిశాయి. ఆయన ఏ విషయం గురించి కూడా నేరుగా చెప్పేవాడు కాదు. అన్నీ మనస్సులోనే ఉంచుకునేవాడు. నేను మాత్రం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని. ఏ విషయం మనస్సులో ఉన్నా కూడా వెంటనే అతనితో చెప్పేదాన్ని.

ఆడవారితో మాట్లాడేవాడు కాదు
మా ఆయన వ్యక్తిత్వం చాలా మంచిదని నేను పెళ్లయిన కొత్తలో నమ్మేదాన్ని. ఆయన అస్సలు ఆడవారితో మాట్లాడేవాడు కాదు. పండుగలప్పుడు మా ఊరికొచ్చినప్పుడు ఆయనతో మా చెల్లెల్లు ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించినా చాలా సిగ్గుపడేవాడు. బాగున్నావా బావ అని నాకు చెల్లెలు వరుస అయ్యే వారు అడిగినా సిగ్గుతో పలికేవాడు కాదు.

ఆయనలో ఇంకో కోణం
కానీ ఆయనలో ఇంకో కోణం ఉందనే విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. నన్ను ఎంతో ప్రేమిస్తున్నానని మాయమాటలు చెబుతూనే ఇంకో ఆమెను ప్రేమలోకి దింపాడు ఈ మహానుభావుడు. ఆమె పేరు స్వాతి. ఆమె నాకన్నా అందంగా ఉంటుంది. నేను కొద్దిగా నల్లగా ఉంటాను. ఆమె అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. ఆమె బాగా ధనవంతురాలు కూడా. మా ఆయన పని చేసే కంపెనీలో ఆమెది చాలా పెద్దస్థానం.

ఆమె గురించే చెప్పేవాడు
ఆమె గురించి ఎప్పుడూ నాతో చెప్పేవాడు. ఆమె చాలా మంచిదని, ఆమెలాంటి మంచి వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని, ఆమె అంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా తనతో చాలా బాగా మాట్లాడుతుందని ఇలా చాలా విషయాలు ఆమె గురించి నాతో చెప్పేవాడు. అయితే ఆమెలో ఉన్న మంచితనాన్ని అతన ప్రేమిస్తున్నాడని నేను అనుకునేదాన్ని.

చాలా ఆలోచనలు
కానీ అతనిలో ఇంకా చాలా రకాల ఆలోచనలున్నాయి. ఆమెను వలలో వేసుకుని ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా మా ఆయన భావించాడు. ఆమెకు కూడా మా ఆయనపై ఎప్పటి నుంచో కన్ను ఉంది. ఈ విషయాలన్నీ కూడా చాలా రోజుల తర్వాత తెలిశాయి.

నన్ను అక్కడికి పంపి..
ఒక రోజు నేను మా పాప స్కూల్ లో పేరేంట్స్ మీటింగ్ ఉందటే వెళ్లాను. మొదట నేను, మా ఆయన వెళ్దామనుకున్నాం. అయితే మా ఆయన తనకు ఆఫీసులో చాలా అర్జెంట్ పని ఉందని.. ఆఫీస్ కు వెళ్లకపోతే చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉంటాయని చెప్పాడు.

కొద్ది సేపటికే వచ్చా
తన బాస్ లీవ్ కూడా ఇవ్వలేదని చెప్పారు. పాపం ఆయన అంత బిజీలో ఉన్నప్పుడు ఎందుకు డిస్ట్రబ్ చేయాలని నేను కూడా అతన్ని స్కూల్లో మీటింగ్ కు రావాలని బలవంతం పెట్టలేదు. అయితే ఫంక్షన్ ఉదయం సాయంత్రం వరకు ఉంటుందని మా ఆయనతో చెప్పాను. కానీ నాకు అక్కడికి వెళ్లాక కాస్త హెల్త్ బాగా లేకపోయేసరికి కొద్ది సేపటికే వెనక్కి వచ్చాను.

ఆడవారి లోదుస్తులు
మా ఇంటికి బయటి నుంచి, లోపలి నుంచి రెండు రకాలుగా లాక్ వేయొచ్చు. నేను డోర్ లాక్ తీసి లోపలికి వెళ్లాను. బెడ్ రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుందామనుకున్నాను. అయితే సోఫాలో ఆడవాళ్ల లోదుస్తులు పడి ఉన్నాయి. నాకు అర్థం కాలేదు. అలాంటి బ్రాండ్స్ నేను ధరించను. బెడ్ రూమ్ బయట ఆడవారి చెప్పులున్నాయి.

మా ఆయన గర్ల్ ఫ్రెండ్ కూడా
మా ఆయన సెల్ టీవీపైన ఉంది. మా ఆయన ఇంటికొచ్చాడని అర్థం అయ్యింది. బెడ్ రూమ్ లాక్ అయి ఉంది. లోపల మా ఆయన ధ్వని వినపడుతుంది. మరో అమ్మాయి కూడా ఉన్నట్లు అర్థం అయ్యింది. నాకు కొన్ని క్షణాల పాటు ఏమి అర్థం కాలేదు. చాలా బాధపడ్డాను. ఏడ్చాను. కొద్ది సేపటి తర్వాత వాళ్లు డోర్ తెరిచి బయటకు వచ్చారు. చాలా నిర్లజ్జగా మా ఆయన, అతని గర్ల్ ఫ్రెండ్ వ్యవహరించారు.

కామన్ అట
నన్ను చూసి షాక్ అవుతారనుకున్నాను. కానీ వారిద్దరూ చాలా క్యాజ్ వల్ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేను చూసిన దాని గురించి మా ఆయన్ని ప్రశ్నిస్తే ఇలాంటివన్నీ కామన్ అని చాలా తేలికగా చెప్పాడు. తర్వాత నేను మా ఆయనతో విడాకులు తీసుకుందామనుకున్నాను. కానీ నా పిల్లలు గుర్తొచ్చారు. మేమిద్దరం విడిపోతే పాపం అభం శుభం తెలియని పిల్లలు ఇబ్బందులుపడాల్సి వస్తుందనుకున్నాను. అందుకే విడాకులు తీసుకోలేకపోయాను.

అదే రోజు రాత్రి
మా ఆయన మళ్లీ అదే రోజు రాత్రి నాతో మాట్లాడాడు. నాకు మాత్రం అతనిపై చాలా కోపం వచ్చింది. నిసిగ్గుగా ఉన్న ఆయనను చూసి అసహ్యం వేసింది. నా ముందే తప్పు చేసి నాతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నందుకు చాలా బాధేసింది.

మళ్లీ నాతో సెక్స్
కొన్ని రోజుల తర్వాత రాత్రి మా ఆయన నాతో సెక్స్ చెయ్యాడానికి ట్రై చేశాడు. నాకు ఏదేదో మాటలు చెప్పి నన్ను శాంతపరచాలనుకున్నాడు. ఆయనపై నాతో శారీరకంగా కలుస్తున్నప్పుడు నేను ఏ మాత్రం దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాను. ఒక మెషిన్ లాగా అతను నన్ను ఎంజాయ్ చేస్తూ ఉంటే అలా ఉండిపోయాను. మనస్ఫూర్తిగా అతనితో కలవలేకపోయాను

పిల్లల వల్లే..
నా పిల్లలు అతనితో సరదాగా ఉంటారు. కానీ నాకు మాత్రం అతని నుంచి దూరం అవుదామని అనిపిస్తూ ఉంది. నా పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తే అతనితో ఉండాలనిపిస్తోంది. కానీ నా భర్త ప్రవర్తన చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు విడిపోదామా అని అనిపిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. రోజూ నరకం చూస్తూ బతుకు ముందుకు కొనసాగిస్తున్నాను.

చాలా మంది ఇలాగే
నాలాగే చాలామంది ఆడవారు ఈ సమాజంలో ఇలాంటి ఇబ్బందులుపడుతూనే ఉంటారు. భర్తకు మరో ఆమెతో సంబంధం ఉందని తెలిసినా.. కళ్తముందే భర్త మరో అమ్మాయితో సరసాలాడుతున్నా కూడా చూస్తూ ఉండాల్సిందే తప్పా.. ఏమి చేయలేని నిస్సహాస్థితిలో ఉంటారు.

నమ్మిన వాళ్లకే మోసం
మా ఆయన ఎంతో మంచి వాడని నేను చాలా నమ్మాను. కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడని అనుకోలేదు. నేను కూడా ఒక అతన్ని ఇంటికి తీసుకొచ్చి అతని ముందు సరసాలాడితే తట్టుకోగలడా. కనీసం పక్క మగాడితో మాట్లాడితేనే భర్తలు తట్టుకోలేరు. మరి భార్యలు ఎలా భరించాలి. కళ్లముందే సరసాలు చేస్తున్నా కళ్లు మూసుకుని కాపురం చేయాలా?



Click it and Unblock the Notifications