Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
నా బైక్ పై కూర్చొన్న మేడాన్ని బజార్లోనే ముద్దు పెట్టుకున్నా, పెళ్లి ఫిక్స్ చేసింది #mystory216
అమ్మాయి తాను కోరుకున్న అబ్బాయి నుంచి ఆశించేది ముద్దు కాదు. తనతో మూడు ముళ్లు వేయించుకుని జీవితాంతం ఉండాలనుకుంటుంది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయితో పెళ్లికి ముందే రొమాన్స్ చేసి ఏదో మొక్కుబడిగా పెళ్లి.
ఆమె నేను చదివే కాలేజీలోనే లెక్చరర్. నేను అదే కాలేజీలో పీజీ చేస్తున్నాను. తను మా క్లాస్ మేట్. నేను మధ్యమధ్యలో సబ్జెక్టులను మిగిలించుకోవడంతో ఇంకా అదే కాలేజీలో చదవాల్సి వస్తోంది. కానీ తనేమో చదువుపూర్తి చేసుకుని లెక్చరర్ గా జాయిన్ అయ్యింది. తను బాగా ఇంటలిజెంట్.

తనతో నాకు బాగా చనువు ఉండేది
మంచి పద్దతి గల అమ్మాయి. రోజూ సంప్రదాయంగా చీరలో కాలేజీకి వస్తూ ఉంటుంది. ఇద్దరం చాలా ఏళ్లుగా చదువుకున్నాం కాబట్టి తనతో నాకు బాగా చనువు ఉండేది. కాలేజీకీ లేట్ అయ్యే సమయంలో అప్పుడప్పుడు తాను నా బైక్ పై వచ్చేది. కాలేజీలో అందరూ ఆమెకు గౌరవం ఇచ్చేవారు. నేను మాత్రం ఆమెను ఫ్రెండ్ లాగే ట్రీట్ చేసేవాణ్ని.

రోజూ తను నా బైక్ పైనే కాలేజీకి వచ్చేది
కొన్నాళ్లకు వాళ్లు మా ఇంటికి సమీపంలోనే రెంట్ కు దిగారు. దీంతో ఆమెతో మాట్లాడడానికి నాకు ఇంకా ఈజీ అయిపోయింది. రోజూ తను నా బైక్ పైనే కాలేజీకి వచ్చేది. మేమిద్దరం చాలా రోజులు కలిసి చదువుకున్నా కూడా అంత క్లోజ్ గా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ ఈ మధ్యే మా మధ్య మాటలు పెరిగాయి.

తెలుగు సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్
నిండుగా చీరకట్టుకుని తెలుగు సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ లా ఉండేది ఆమె. తనని నేను కాలేజీలో చీరకట్టులో చూడగానే ప్లాట్ అయిపోయాను. ఏదో ఒక ప్లాన్ వేసి తనను పెళ్లి చేసుకోవాలన్నాను. మొదట ఇది కాని పని అనుకున్నా. తర్వాత కచ్చితంగా తనతో కలిసి కాపురం చేసే రోజులు రానున్నాయని నాలో కాన్ఫిడెంట్ పెరిగింది.

ముద్దు పెట్టుకున్నా
నేను కలలు కన్న రాకుమారిలా ఉండేది తను. అప్పుడప్పుడు నేను తనని ముద్దుగా మేడం అనేవాణ్ని. ఒక రోజు తను నా బైక్ పై వస్తుంటే ముద్దు పెట్టుకున్నా. బైక్ ఆపు అంది. తను కూడా ముద్దు ఇస్తుందేమో అనుకున్నా. చెంపపై చెల్లుమన్పించింది. తర్వాత ఆటోలో కాలేజీకి వెళ్లింది. అప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేసింది. నాపై కాలేజీలో కంప్లైట్ చేస్తుందేమోనని, వాళ్లింట్లో వాళ్లకు చెబుతుందేమోనని భయం వేసింది. కానీ అలా చేయలేదు.

అసహ్యించుకునేది
నేను తనను పెళ్లి చేసుకోవాలని జీవితాంతం తనను నా గుండెల్లో ఉంచుకుని చూసుకోవాలనుకున్నాను. ఆమె విషయంలో నేను ముద్దు పెట్టుకోవడం తప్ప ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదు. ఎప్పుడూ తనే గుర్తొచ్చేది. కాలేజీలో తను నా ముఖం చూడగానే బాగా అసహ్యించుకునేది. దాంతో నేను కొన్ని రోజులు కాలేజీకి వెళ్లలేదు.

పెళ్లి ఫిక్స్ అయ్యింది
చివరకు ఒక రోజు తనే మా ఇంటికి వచ్చి కాలేజీకి రమ్మని చెప్పింది. దాంతో మళ్లీ కాలేజీకి వెళ్లడం స్టార్ట్ చేశాను. దాంతో తనపై నాకు మరింత ప్రేమ పెరిగింది. తనకు మాత్రం నాపై కొద్దిగా కూడా ప్రేమ ఉండేది కాదు. తర్వాత తను నా గురించి వాళ్ల అమ్మనాన్నలకు చెప్పింది. మంచి అబ్బాయికు పెళ్లి చెయ్యమని కోరింది. ఆమె అమ్మనాన్నలు మా ఇంట్లో వాళ్లతో మాట్లాడారు. పెళ్లి ఫిక్స్ అయ్యింది.

బజార్ లో బైక్ పై నన్ను అలా ముద్దుపెట్టుకుంటే..
మా ఇంట్లో నాకు ఈ విషయం చెప్పగానే రెక్కలు కట్టుకని ఆకాశంలో విహరించినట్లు అనిపించింది. నిశ్చితార్థం రోజు తనతో కాసేపు పర్సనల్ గా మాట్లాడాను. మరి ఆ రోజు ఎందుకు కొట్టావు.. ఈ రోజు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావ్ అన్నాను. 'ఒకరిపై ప్రేమ ఉంటే దాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా తెలిసి ఉండాలి. బజార్ లో బైక్ పై నన్ను అలా ముద్దుపెట్టుకుంటే నాకు నీపై అసహ్యం వేసింది. నాపై నీకు ఉన్న ప్రేమను అర్థం చేసుకోగలను. నన్ను నువ్వు బాగా చూసుకుంటామని కూడా నాకు తెలుసు. కానీ నువ్వు ఆ రోజు వ్యవహరించిన తీరు నచ్చలేదు.

మూడు ముళ్లు వేయించుకోవాలనుకుంటుంది
అమ్మాయి తాను కోరుకున్న అబ్బాయి నుంచి ఆశించేది ముద్దు కాదు. తనతో మూడు ముళ్లు వేయించుకుని జీవితాంతం ఉండాలనుకుంటుంది. చాలా మంది అబ్బాయిలు అమ్మాయితో పెళ్లికి ముందే రొమాన్స్ చేసి ఏదో మొక్కుబడిగా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. నువ్వు కూడా అలాగే వ్యవహరించడంతో నాకు కోపం వచ్చింది.

పెళ్లికి ముందు అలా చేయొద్దు
పెళ్లి అయ్యాక నీకు ఎన్ని ముద్దులు కావాలంటే అన్నీ.. ఎక్కడ కావాలంటే అక్కడిస్తాను. పెళ్లికి ముందు మాత్రం నువ్వు నాతో అలా చేయడం తప్పు అంది. జీవితాంతం నన్ను బాగా చూసుకుంటావనే భరోసా, నాకు ఏ కష్టం రానివ్వనే నమ్మకం నీపై నాకు ఉంది. అందుకే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అంది. మొత్తానికి మా మేడంతో నా పెళ్లి జరగనుంది.



Click it and Unblock the Notifications











