ఫ్లాట్‌కొచ్చాడు.. ఆ పని పూర్తి చేసి వెళ్లాడు - My Story #53

Written By:
Subscribe to Boldsky

అతను నాకు ఫ్రెండా.. లవరా అంటే నేను చెప్పలేను కానీ అతనితో నాకో స్టోరీ ఉంది. నేను అప్పటికే చదువు పూర్తి చేసుకుని జాబ్ లో జాయినయ్యాను. మా ఫ్లాట్‌కు ఎదురుగా ఉంటే ఫ్లాట్‌ లో అతను దిగాడు. అతని నేను ఫస్ట్ రోజు నుంచే గమనించడం మొదలుపెట్టాను.

అతనొక ప్లే బాయ్

అతనొక ప్లే బాయ్

అతని ఫ్లాట్ కు రోజుకొక అమ్మాయి వచ్చేది. తర్వాత చిన్నగా అతను నాకు పరిచయం అయ్యాడు. అప్పటికే తనకు నా ఫ్రెండ్స్ కూడా తెలుసనే విషయం నాకు తెలియదు. తన గురించి నా ఫ్రెండ్స్ కు చెబితే అతనొక ప్లే బాయ్.. అమ్మాయిలతో బాగా ఆడుకుంటూ ఉంటాడన్నారు. కానీ నేను ఆ మాటలను పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు.

నా ఫ్లాట్ కు వచ్చేవాడు

నా ఫ్లాట్ కు వచ్చేవాడు

అప్పడప్పుడు నా ఫ్లాట్ కు కూడా వచ్చేవాడు. చాలా సరదగా ఉండేవాళ్లం. ఒకసారి సాయంత్రం ఫ్లాట్ వచ్చాడు. ఈ రోజు చాలా బాధగా ఉంది పద్మ అన్నాడు. ఏమైంది రామ్ అని అడిగాను. గతం గుర్తొస్తుంది అందుకే బాధవేస్తుంది అన్నాడు. తర్వాత మెల్లిగా

తన ప్లాష్ బ్యాక్ మొత్తం ఇలా చెప్పాడు.

ఒక్క ఫోన్ కొడితే నా ముందు ఉంటుంది

ఒక్క ఫోన్ కొడితే నా ముందు ఉంటుంది

" నాకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేవు. ఎందుకంటే మా నాన్న పెద్ద కాంట్రాక్టర్. నాకు ఇది కావాలి డ్యాడీ అని మా నాన్నకు ఒక్క ఫోన్ కొడితే మార్నింగ్ కల్లా ఇంటి ముందు అది ఉంటుంది. నాకు నచ్చిన బైక్.. కావాల్సిన కారు అన్నీ మా డ్యాడీ కొనిచ్చాడు. కానీ నన్ను ఒక అమ్మాయి చాలా బాధపెట్టింది.

యూజ్ చేసుకుంది

యూజ్ చేసుకుంది

నాకు ఆమెనే ప్రపోజ్ చేసింది. మొదట నేను ఆమె ప్రేమను అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ తను మాత్రం రోజూ నా వెంట పడేది. ఆమె ప్రేమకు నేను పడిపోయాను. నేను కూడా ఆమెను ప్రేమించాను. కానీ ఆమె నన్ను యూజ్ చేసుకుని వదిలేసింది. ఎక్కడైనా అమ్మాయిల్ని అబ్బాయిలు యూజ్ చేసుకుంటారు గానీ నన్ను మాత్రం ఆ అమ్మాయి బాగా వాడుకుంది.

అది తనకే ఇచ్చాను

అది తనకే ఇచ్చాను

తను ఒక రోజు కాలేజీ ఫీజు కట్టడానికి ఇబ్బందిపడినట్లు నాకు తెలిసింది. నేను వెంటనే నా డెబిట్ కార్డ్ తనకే ఇచ్చాను. నీకు ఎంత కావాలంటే అంత తీసుకో అని చెప్పాను. నాకు చదువు మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. అందుకే బాగా చదువుకునేవాళ్లకైనా సాయం చేయాలని నా మనస్సులో ఉంది. ఆ అమ్మాయి చదువులో ఫస్ట్. ఆమె బాగా చదువుకునేందుకు అన్ని రకాలుగా నేను అండగా నిలిచాను.

ఆ విషయం వేరే వాళ్లు చెబితే తెలిసింది

ఆ విషయం వేరే వాళ్లు చెబితే తెలిసింది

తను డిగ్రీ పూర్తి చేశాక.. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించింది. అప్పుడు తను కోచింగ్ తీసుకునేందుకు, తను కచ్చితంగా జాబ్ కొట్టేందుకు నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను. అండగా నిలిచాను. ఫైనల్ గా ఆమె గవర్నమెంట్ జాబ్ సాధించింది. తనకు జాబ్ వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదు. వేరే వాళ్లు చెబితే అప్పుడు తెలిసింది.

మాయమాటలు చెప్పి

మాయమాటలు చెప్పి

ఆమె చదువుకోవడానికి నేను ఆర్థిక సాయం చేయడానికి నేను రెడీ. కానీ నన్ను ప్రేమిస్తున్నాని చెప్పి.. నాతో ఏవేవో మాయమాటలు చెప్పి అలా మోసం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను.. నువ్వు లేకపోతే చచ్చిపోతాను అని ఏవేవో మాయమాటలు చెప్పింది.

ఫ్రెండ్స్ వాడుకుంటదని చెప్పారు

ఫ్రెండ్స్ వాడుకుంటదని చెప్పారు

అప్పటికీ నా ఫ్రెండ్స్ మొత్తం ఆ అమ్మాయి నీకు బాగా డబ్బుందని అలా నాటకాలు ఆడుతుంది. ఆమెను నమ్మకు అని చెప్పారు. కానీ నేను వినలేదు. ఆమెను చూస్తూ అసలు అలా మోసం చేసే అమ్మాయిలా కనిపించదు. కానీ మొత్తానికి నన్ను నిలువునా ముంచిందనే విషయం నాకు చాలా రోజులకు అర్థం అయ్యింది.

తనివితీరా అనుభవిస్తున్నాను

తనివితీరా అనుభవిస్తున్నాను

ఎవరైనా అమ్మాయితో ప్రేమలో ఉంటే రొమాన్స్ అవి ఇవీ అని గడుపుతారు. కానీ నేను మాత్రం ఆమె బాగా చదవాలని.. ఆమె జీవితంలో స్థిరపడాలని ప్రతి క్షణం పరితపించేవాణ్ని. ఆమె మోసం చేసిన తర్వాత తెలిసింది. అమ్మాయిలను వాడుకుని వదిలేయాలని కానీ సీరియస్ గా తీసుకోకూడదని. అందుకే ఇప్పుడు రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతి అమ్మాయిని తనివితీరా అనుభవిస్తున్నాను."

ఏజ్ లో చిన్నవాడే

ఏజ్ లో చిన్నవాడే

ఇలా మొత్తం తన కథను అంతా చెప్పాడు. నాకు తెలిసి అతను నాకన్నా ఏజ్ లో చిన్నవాడే ఉంటాడేమో. నేను అప్పటికే మూడు ఆమ్లెట్లు వేశాను. వాటిని తిన్నాడు. కాస్త మందు తాగినట్లున్నాడు. తర్వాత తను నా దగ్గరకు వచ్చాడు. పద్మా.. నువ్వు చాలా అందంగా ఉంటావు అని నీతో ఎవరైనా చెప్పారా అని అన్నాడు. చాలామంది చెప్పారన్నాను.

నువ్వు చాలా అందంగా ఉంటావ్

నువ్వు చాలా అందంగా ఉంటావ్

నేను కూడా చెబుతున్నాను.. నువ్వు చాలాచాలా అందంగా ఉంటావన్నాడు. నేను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. మరి నీ స్టోరీ గురించి చెప్పవా అన్నాడు. నాకు అంతగా స్టోరీలు లేవు అన్నాను. నువ్వు ఎప్పుడైనా వైన్ తాగావా అని అడిగాను. లేదు అని చెప్పాను. తాగుతావా అన్నాడు.. నాకు కూడా మనసులో తాగాలని ఉంది కాబట్టి ఓకే అన్నాను. వెంటనే అతని ఫ్లాట్ కెళ్లి ఒక వైన్ బాటిల్, ఒక వొడ్కా బాటిల్ పట్టుకొచ్చాడు.

అతను వొడ్కా.. నేను వైన్

అతను వొడ్కా.. నేను వైన్

అతను వొడ్కా తాగుతూ ఉన్నాడు. నేను వైన్ తాగాను. అతను తన ప్లాష్ బ్యాక్ స్టోరీలు చెబుతూనే ఉన్నాడు. నిజానికి అతను చాలా మంచివాడు. డబ్బుందనే అహంకారం అస్సలు లేదు. అతనితో నిజాయితీ ఉంది. అవతలి వ్యక్తులను క్షమించే గుణాలున్నాయి. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అతని ప్రతి స్టోరీలో అతనే మోసపోయాడు తప్పా అతను ఎవర్ని మోసం చేయలేదు.

ఒక్కసారి గడపాలని

ఒక్కసారి గడపాలని

ఇద్దరం సోపాలో కూర్చొన్నాం. నేను అతనికి మరింత దగ్గరకు వెళ్లాను. అతన్ని పెళ్లి చేసుకుని కాపురం చేయాలనే కోరిక లేదుగానీ అతనితో ఒక్కసారైనా గడపాలనే కోరిక మనస్సులో కలిగింది. కానీ అంత ధైర్యం చేయలేకపోయా. మందు మత్తులో ఉన్నా కాబట్టి నా మనస్సులోని మాటలను అతనితో చెప్పాను. అతను మొదట కాస్త ఆలోచించాడు. తర్వాత వెంటనే కమిట్ అయ్యాడు.

కండోమ్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు

కండోమ్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు

తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లాం. అందులో అతనికి బాగా ఎక్స్ పీరియన్స్ ఉన్నట్లుంది. జేబులో కండోమ్ ప్యాకెట్ కూడా పెట్టుకున్నాడు. కుర్రాడు నాకు మంచి సంతృప్తి ఇచ్చాడు. జీవితంలో ఆ రోజును ఎప్పటికీ మరిచిపోను. అంతకుముందు నన్ను ఇంకో అబ్బాయి కిస్ పెట్టుకున్నాడు కానీ ఫస్ట్ టైమ్ శృంగారంలో పాల్గొన్నది మాత్రం అప్పుడే.

మధుర జ్ఞాపకం

మధుర జ్ఞాపకం

ఆ క్షణంలో నేను అతనితో ప్రేమలో పడిపోయాను. అయితే నా దగ్గరకు అతను పక్కా ప్లాన్ ప్రకారమే వచ్చి నాకు వైన్ తాపి ప్లాష్ బ్యాక్ చెప్పి నాతో ఆ పని పూర్తి చేశాడా అని ఒక్కోసారి డౌట్ వస్తుంది. కానీ అతని చూస్తే అలా అనిపించడు. ఏదో క్యాజ్ వల్ గా వచ్చాడు. నేను టెంప్ట్ అయిపోయాను. అందుకే ఆ పని పూర్తి చేశాడు అని మరోసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ అతను కొన్ని రోజులకు ఫ్లాట్ ఖాళీ చేశాడు. ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అతను నాకు ఫ్రెండా.. లవరా అంటే నేను చెప్పలేను. అతను ఒక మధుర జ్ఞాపకం.

English summary

Array

i fell in love with a man who only needed me till he found someone else
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more