For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ క్షణం నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా తట్టుకోలేకపోయాను, ఆ పిల్ల బాగా నచ్చింది #mystory217

చివరకు ఆమెకు వాళ్లింట్లో వారు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆమెను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. నేను నా ప్రేమ విషయం ఆమె నాన్నకు చెబుదామంటే మా ఫ్యామిలీ గురించి బ్యాడ్ గా అనుకుంటారని భయం వేసింది.

|

తను ఎయిర్ హోస్టెస్. ఒకసారి నేను మా ఫ్యామిలీతో కలిసి ఫ్లైట్ లో ఫారిన్ ట్రిప్ వెళ్తుంటే పరిచయం అయ్యింది. మా అమ్మనాన్నలకు తను బాగా కనెక్ట్ అయ్యింది. మా అమ్మ ఫ్లైట్ ఎక్కడం అది మొదటిసారి. ఆమెకు అన్ని జాగ్రత్తలు తను దగ్గరుండి చెప్పింది.

ఫ్లైట్ టేకాఫ్ అవుతున్నప్పుడు ల్యాండ్ అవుతున్నప్పుడు మా అమ్మ భయపడకుండా ధైర్యం చెప్పింది తను. అలా మా అమ్మకు, నాన్నకు బాగా దగ్గరైపోయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. వచ్చేటప్పుడు మా అమ్మ తనకు మొబైల్ నంబర్ ఇచ్చింది. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే కచ్చితంగా ఇంటికిరమ్మని ఆహ్వానించింది.

తను మా ఇంట్లో ప్రత్యక్షమైంది

తను మా ఇంట్లో ప్రత్యక్షమైంది

నెల తర్వాత ఒక రోజు తను మా ఇంట్లో ప్రత్యక్షమైంది. ఏంటి అని ఆరా తీస్తే తాను హైదరాబాద్ టు ముంబై వెళ్లే ఫ్లైట్ కు రోజూ వెళ్లాల్సి ఉందట. అందువల్ల హైదరాబాద్ లోనే స్టే చేస్తున్నారట. ఆమె రాగానే మా అమ్మ రకరకాల వంటలు చేసి పెట్టింది. నువ్వు బయట ఎక్కడో ఉండే కంటే మా ఇంట్లోనే ఉండు నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం.. బయట ఉండి బాగా చిక్కిపోయావు చూడు అంటూ మా అమ్మ తనతో చెప్పింది.

మా అమ్మ గుర్తొస్తుంది

మా అమ్మ గుర్తొస్తుంది

నాకు కూడా ఇక్కడే ఉండాలని ఉంది ఆంటీ. మీ చేతివంట తింటే నాకు మా అమ్మ గుర్తొస్తుంది అంటూ తను కూడా కన్నీరు పెట్టుకుంది. నేను మీ ఇంట్లో ఉంటాను కానీ నేను ఇక్కడ స్టే చేస్తున్నందుకు డబ్బులిస్తాను మీరు తీసుకోవాలంది. దానికి మా అమ్మ అస్సలు ఒప్పుకోలేదు. నిన్ను మా ఇంటి అమ్మాయిలా చూసుకుంటాంగానీ డబ్బులు తీసుకోం అని చెప్పేసింది. సరే నేను కూడా డబ్బులేమీ ఇవ్వను. ప్రేమగా గిఫ్ట్ ఇస్తాను దాన్ని తిరస్కరిస్తే మాత్రం బాగుందని ఆమె అనింది.

నువ్వు తిక్కతిక్క వేషాలు వేశావంటే

నువ్వు తిక్కతిక్క వేషాలు వేశావంటే

మరుసటి రోజే తను మా ఇంటికి లగేజీతో షిఫ్ట్ అయ్యింది. తను ఇంట్లో దిగేటప్పడు.. ఓరేయ్ నువ్వు తిక్కతిక్క వేషాలు వేశావంటే మక్కులు విరగ్గొడతా అని నాన్న నన్ను హెచ్చరించాడు. తన బెడ్రూమ్ కు నా బ్రెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండేది. దీంతో నాకు రోజూ ప్లాబ్లమ్ అయ్యేది. తను బాత్రూమ్ లోకి వెళ్తే గంటకుగానీ బయటకు రాదు.

మొదట తనపై ఉన్న రెస్పెక్ట్ వల్ల ఏమీ అనేవాణ్ని కాదు. కానీ కొన్నాళ్లకు మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ మాదిరిగా తయారయ్యాం. తను రోజూ నాపై మా ఇంట్లో వాళ్లకు సరదాగా కంప్లైట్ చేసిది. చూడు ఆంటీ వీడు అంటూ నాపై సరదగా తను మా అమ్మకు చెప్పేది.

ఆ పిల్ల బాగా నచ్చింది

ఆ పిల్ల బాగా నచ్చింది

తనని రోజూ నేను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో నేనే బైక్ పై డ్రాప్ చేసేవాణ్ని. రోజురోజుకు మా మధ్య ఉన్న స్నేహం పెరిగిపోయింది. ఇద్దరం ఎప్పుడూ తిట్టుకుంటూ సరదాగా కొట్టుకుంటూ ఉండేవాళ్లం. అదే మా మధ్య ప్రేమకు దారి తీసింది. మా ఇంట్లోవాళ్లకు కూడా ఆ పిల్ల బాగా నచ్చింది. చూస్తే బొమ్మలా ఉంటుంది. గిల్లితే కందిపోతుంది. అలాంటి పిల్లే నా పెళ్లాం కానుందని నేను సంతోషపడ్డాను. కానీ మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్లకు తెలియదు.

బలవంతంగా పెళ్లికి ఒప్పించారు

బలవంతంగా పెళ్లికి ఒప్పించారు

చివరకు ఆమెకు వాళ్లింట్లో వారు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. ఆమెను బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. నేను నా ప్రేమ విషయం ఆమె నాన్నకు చెబుదామంటే మా ఫ్యామిలీ గురించి బ్యాడ్ గా అనుకుంటారని భయం వేసింది. ఏదో కొన్నాళ్లు గెస్ట్ మాదిరిగా ఇంట్లో ఉంచుకుని మా అమ్మాయినే బుట్టలో వేసుకున్నారా అని అనుకుంటారని నేను అస్సలు చెప్పలేదు.

కంట్రోల్ చేసుకున్నా తట్టుకోలేకపోయాను

కంట్రోల్ చేసుకున్నా తట్టుకోలేకపోయాను

తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి తన పెళ్లికి కారులో బయల్దేరాను. ఆ రోజు మొత్తం తనతో గడిపిన క్షణాలే గుర్తొచ్చాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా తట్టుకోలేకపోయాను. ఏడ్చేశాను. మా అమ్మనాన్నలకు కూడా నా బాధ అర్థమైంది. అయితే అప్పటికీ పెళ్లి ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయి. తను కూడా చాలా బాధపడుతూనే పెళ్లి పీటలు ఎక్కింది. ఇంతలోనే పెళ్లి కొడుకు కనిపించడం లేదని అందరూ గుసగుసలాడుకుంటున్నారు. పెళ్లి కొడుకు మరో అమ్మాయిని ప్రేమించాడట. అందుకే అతను వెళ్లిపోయాడట.

ఎయిర్ హోస్టెస్ మా ఇంటి కోడలు

ఎయిర్ హోస్టెస్ మా ఇంటి కోడలు

ఆ క్షణం దేవుడున్నాడనిపించింది. పరువు కోసం పాకులాడే ఆ పెద్దమనిషిని క్షణాల్లో మా నాన్న కన్విన్స్ చేశాడు. చివరకు మా పెళ్లి జరిగింది. ఎయిర్ హోస్టెస్ మా ఇంటికి కోడలిగా వచ్చింది. ఇప్పటికీ మా మామయ్య నేను అంటే చాలా ప్రేమ చూపిస్తాడు. ఆ క్షణం నువ్వు లేకుంటే నా పరువు పోయేది అల్లుడు అంటూ ఉంటాడు. కానీ అసలు విషయం ఆయనకు తెలియదు.

English summary

i love a girl sincerely but she is engaged to someone else finally i married her

i love a girl sincerely but she is engaged to someone else finally i married her
Desktop Bottom Promotion