For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిగ్గుపడే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారా ? అయితే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి

సిగ్గుపడే అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారా ? అయితే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి

By R Vishnu Vardhan Reddy
|

మీరు సిగ్గుపడే అమ్మాయి తో డేటింగ్ చేస్తున్నారా ? ఎప్పుడు ఈ అమ్మాయి తన చుట్టూ ఉన్న కనిపించని అడ్డుగోడలు తొలగించుకొని బయటకు వస్తుంది అని ఆలోచిస్తున్నారా ? ఆమె సౌకర్యవంతంగా తన వక్తిగత భావాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నారా ? ఆమె కోసం మీరు ఉన్నారు అని ఆమె గుర్తించే విధంగా చేయడం కష్టతరంగా ఉందా ? ఆలా అయితే మీరు ఈ వ్యాసాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే.

మీరు గనుక సిగ్గుపడే అమ్మాయితో సంబంధ బాంధవ్యంలో ఉంటే, మీరు ఆమె పద్దతిలో వెళ్ళవలసిన అవసరం ఉంది. లేదంటే ఆమె తన పంథాన్ని మార్చుకొని మీకు దూరం అయ్యే అవకాశం ఉంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినప్పుడు, సిగ్గుపడే అమ్మాయి ని అర్ధం చేసుకోవడం అనేది చాలా సవాళ్లతో కూడుకున్న వ్యవహారం, కష్టమైనా పని కూడా.

IN A RELATIONSHIP WITH A SHY GIRL? THINGS YOU NEED TO KNOW

అయితే ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఇందుకోసం మీరే చొరవ చూపాల్సి ఉంటుంది. నెమ్మదిగా స్థిరంగా వెళ్లడం ద్వారా మీరు విజయాన్ని చేరుకోవచ్చు.

సిగ్గుపడే అమ్మాయి తో సంబంధ బాధవ్యంలో ఉన్న అబ్బాయి, ఎప్పుడు తన ఆలోచనలోనే ఉండిపోయే అవకాశం ఉంది. అందుచేత అబ్బాయి అర్ధం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, తాను ప్రేమించే వ్యక్తి ఒక రాజకుమారి అనే భావనను ఆమెలో కలిగించాలి. ఎప్పుడైతే అమ్మాయితో ఆమెకు నచ్చినట్లు వ్యవహరిస్తారో అప్పటి నుండి అంతా మంచే జరుగుతుంది, అదే సమయంలో స్వర్గానికి చేరువుగా ఉన్నాము అనే భావన కూడా కలుగుతుంది.

సిగ్గుపడే అమ్మాయితో సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ విషయాన్ని పాటించడం చాలా సులభమైన సాధారణ ప్రక్రియ. మీరు అడుగులు ముందుకు వేసే ముందు అమ్మాయి గురించి కొద్దిగా పరిశోధన చేయండి.

1. ఆమె ఏ రకమైన సిగ్గు వర్గంలోకి చెందుతుంది అనే విషయాన్ని ముందుగా గుర్తించండి :

1. ఆమె ఏ రకమైన సిగ్గు వర్గంలోకి చెందుతుంది అనే విషయాన్ని ముందుగా గుర్తించండి :

అమ్మాయి సిగ్గుపడే విషయాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగింది.

మాట్లాడేటప్పుడు సిగ్గుపడటం - ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా మాట్లాడతారు. మాట్లాడుతున్న సమయంలో అర్ధాతరంగా ఏమి మాట్లాడాలో తెలియక మాటలు ఆపేసే అవకాశం కూడా ఉంది.

శారీరికంగా సిగ్గుపడటం - ఆమెను ముట్టుకోగానే దూరం జరుగుతారు.

సిగ్గుని దాచుకోవడం - మీరు ఆమెతో సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు, ఎప్పుడు గాని గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించడానికి అస్సలు ఒప్పుకోదు.

ఇలా మూడు రకాలుగా సిగ్గుని విభజించడం జరిగింది. కావున, మీ ప్రేయసి వీటిల్లో ఏ రకానికి చెందిందో మీరు ముందుగా గుర్తించాలి. అలా గుర్తించడం ద్వారా ప్రతిరోజూ ఆమెతో ఎలా మెలగాలి అనే విషయం మీకు బాగా అర్ధం అవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, ఆమె బాహాటంగా తన మనస్సులోని భావాలను మీతో వ్యక్తపరిచేలా చేయాలి.

2. సిగ్గుపడే అమ్మాయితో సంబంధ బాంధవ్యంలో ఉండటం చాలా కష్టతరమైన పని :

2. సిగ్గుపడే అమ్మాయితో సంబంధ బాంధవ్యంలో ఉండటం చాలా కష్టతరమైన పని :

ఆమె సిగ్గుపడే స్వభావాన్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా మీరు వ్యవహరించాలి. ఆమె సౌకర్యవంతంగా ఉండేలా మీరు చూసుకోవాలి. ఆమెకు నచ్చని విషయాలను చేయమని ఒత్తిడి చేయకూడదు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఇలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిలు మీతో ఒంటరిగా ఉండటానికి అస్సలు ఇష్టపడరు.

అందుచేత ఇలాంటి అమ్మాయిలను ఎక్కువ జనం ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లాలి. అలాంటప్పుడు వాళ్ళు సౌకర్యవంతంగా భావిస్తారు. ఇలాంటి సర్దుకుపోవడం అనే వ్యవహారం మొదట్లో కష్టతరంగా అనిపించవచ్చు. కానీ, ఆమెకు ఇలాచేయడం ద్వారానే మీతో సౌకర్యవంతంగా ఉంటుందని. క్రమంగా ఆమెలో ఉన్న సిగ్గు కూడా దూరం అయ్యి మీతో అన్నీ పంచుకుంటుంది. మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే, ఓపికతో వ్యవహరించడం. అదే సమయంలో పనులన్నీ ఎలా జరగాలని ఉంటే, అలా జరుగుతాయని కొద్దిగా సర్దుకుపోవాల్సి ఉంటుంది.

3. ఆమె సౌకర్యవంత స్థాయిల గురించి ఎక్కువగా ఆలోచించడం :

3. ఆమె సౌకర్యవంత స్థాయిల గురించి ఎక్కువగా ఆలోచించడం :

అసౌకర్యవంతమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు, ఆమె శారీరిక భాషలో అనూహ్య మార్పు వస్తుంది. ఇలాంటి విషయాలను మీరు గమనించాలి. కష్టంగా ఉంటే, ఆమెను అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పాలి. సిగ్గుపడే అమ్మాయిలతో సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఇలా నెమ్మదిగా ఓపికతో వ్యవహరించడం ద్వారా, వారి వ్యక్తిత్వానికి అడ్డుపడుతున్న గోడలు నెమ్మదిగా బద్దలు అవుతాయి. ఆమె ఇష్టాయిష్టాల గురించి ఎక్కువగా ఆలోచించండి. ఇలా చేయడం ద్వారా ఆమెను మరింత బాగా అర్ధం చేసుకోవచ్చు. అదే సమయంలో ఆమె మనస్సు లోతుల్లోకి వెళ్లి మీరు ఆమెను తెలుసుకోవచ్చు. ఆమె భావాలన్నీ సిగ్గుతో కప్పబడి ఉంటాయి, కాబట్టి ఇలా చేయాల్సి ఉంటుంది.

ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తున్నారు అనే భావనను ఆమెలో కలిగించినపుడు, మీరు ఆమె పట్ల ఎంత బాధ్యతతో ఉన్నారు అనే విషయాన్ని ఆమె గుర్తిస్తుంది. ఇలా జరిగినప్పుడు, మీరు ఆమె దగ్గర ఉన్నప్పుడు ఆమె ఎంతో సౌకర్యవంతంగా భావిస్తుంది.

4. మాట్లాడే సమయంలో సరైన విషయాన్ని ఎంచుకోండి :

4. మాట్లాడే సమయంలో సరైన విషయాన్ని ఎంచుకోండి :

ఈ మార్గంలో వెళ్లడం ద్వారా మీ పై నమ్మకాన్ని మరింత పెంచుకొనే అవకాశం మీకు కలుగుతుంది. అదే సమయంలో పనులన్నీ సజావుగా సాగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమె సిద్ధంగా లేనప్పుడు గతంలో ఆమె జీవితంలో జరిగిన చెడు విషయాల గురించి ఆమె వద్ద ప్రస్తావించకండి. తనంతట తానుగా మాట్లాడాలి అని ఆమె భావిస్తే, అప్పుడు మాత్రమే వాటి గురించి మీరు ప్రస్తావించండి. భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛను ఆమెకు ఇవ్వండి. ఆమె ఆలోచనలను బయటపెట్టమని ఒత్తిడి చేయకండి. ఇలా చేసినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఇలాంటి వారు, వారు చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే పనులు చేస్తారు. వద్దు అనుకున్నప్పుడు పనులు అస్సలు చేయరు. మీరు ఆమె ఆలోచనలకు తగినంత గౌరవాన్ని ఇవ్వండి. ఆమె నోరు మూపించే విషయాలు కాకుండా, ఆసక్తి కలిగించే విషయాలను మాట్లాడటానికి ప్రయత్నించండి.

ఆమె మీతో బాహాటంగా చెప్పేలా మీరు చేయాలి అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అందరితో ఉన్నట్లు కాకుండా, మీతో ప్రత్యేకంగా ఉండేలా చేసుకోవడం మీ పై ఆధారపడి ఉంటుంది. మీరు మాట్లాడే విషయాలు అర్థవంతంగా ఉన్నాయి అని ఆమె భావించాలి. అంతేకాకుండా మీరు మాట్లాడే విషయాలు ఆమె ఆలోచన సరళిని మార్చాలి, అదే సమయంలో అవి ఆమెలో ఆనందాన్ని నింపాలి. ఆమె చదవడానికి, చర్చించడానికి, రాయడానికి ఏ విషయాలను ఇష్టపడుతుంది అనే విషయాన్ని మీరు కనుక్కోవాలి. ఇలా చేయడం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

5. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఆమెకు తగినంత వ్యక్తిగత స్వేచ్ఛ ని ఇవ్వండి :

5. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఆమెకు తగినంత వ్యక్తిగత స్వేచ్ఛ ని ఇవ్వండి :

సిగ్గుపడే అమ్మాయితో సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఆమె తన భావాలను చెప్పడానికి అధిక సమయం తీసుకుంటుంది. సిగ్గుపడే అమ్మాయిలు భావోద్వేగపరంగా చాలా సున్నితంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారితో మీరు చాలా సౌమ్యంగా ఉండాలి. వారు సిగ్గుపడటానికి ఎటువంటి కారణాలు ఉండకపోవచ్చు లేదా చాలా కారణాలు ఉండవచ్చు. కానీ, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవడానికి ఆమె అంగీకరించకపోవచ్చు. ఎప్పుడైతే మీరు ఆమెతో ఎప్పటికీ ఉంటారు అని భావిస్తుందో అప్పుడు మాత్రమే ఆమె అన్ని విషయాలను మీతో చెబుతుంది.

మనస్సు రిత్యా ఇలాంటి అమ్మాయిలు చాలా సున్నితత్వం తో కూడిన ప్రేమతో ఉంటారు. కానీ, సిగ్గు అనే ఒక విషయం వీటన్నింటిని కప్పి వేస్తుంది. తనంతట తానుగా అన్ని విషయాలను బాహాటంగా బయటకు చెప్పడానికి ఇలాంటి వ్యక్తులకు చాలా వ్యక్తిగత స్వేచ్ఛ అవసరం. ఇది ఎప్పుడైతే మీరు ఇస్తారో, అప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఆమెతోనే ఎప్పటికి ఉండాలి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొంటే మంచిది. మీరు గనుక నిజంగానే ఆమెను కోరుకుంటూ ఉంటే పైన చెప్పబడిన మార్పులను అంగీకరించి మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది.

ఈ చిట్కాలన్నింటినీ అనుసరిస్తూ సిగ్గుపడే మీ ప్రేయసి దగ్గర నుండి మీరు పొందాలనుకునే ప్రేమను పొందవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా మీరు ఎంతో ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది.

English summary

IN A RELATIONSHIP WITH A SHY GIRL? THINGS YOU NEED TO KNOW

She is tender by heart, for which she keeps the shield of being shy. In order to open herself to you, she might need a lot of personal space and that is only possible when you give it to her. Remember, it is all about being with her. If you really want her, you need to make amendments such as this. Read to know more.
Story first published:Friday, May 18, 2018, 15:15 [IST]
Desktop Bottom Promotion