Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
లా ఆఫ్ అట్రాక్షన్ : స్త్రీలలో ఆకర్షణీయ లక్షణాలు
లా ఆఫ్ అట్రాక్షన్ : స్త్రీలలో ఆకర్షణీయ లక్షణాలు
ప్రతి స్త్రీకి తనకంటూ ఒక సొంత ఆకర్షణను కలిగి ఉంటుంది. మహిళలు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి దృష్టిని ఆకర్షించడానికి వారి వారి మార్గాలను కలిగి ఉంటారు. కొన్నిసార్లు, ఎటువంటి ఉద్దేశం లేకపోయినా కూడా, ఈ మార్గాలు వారికి అనుకూలంగా మారుతూ ఉంటాయి.
అబ్బాయిలు ఏమి చేస్తున్నా, ఎటువంటి పనుల్లో నిమగ్నులై ఉన్నా కూడా, చిట్ చాట్ చేసుకుంటున్న అమ్మాయిలు గుంపు లేదా వారి ముందు నుండి ఒక అందమైన అమ్మాయి అలా నడుచుకుంటూ వెళ్ళినా కూడా, వారికే తెలీకుండా వీరి చూపులు ఆ మహిళల వెంట పరుగులు పెడుతుంటాయి. పురుషులకు నచ్చే ఏదోక అంశం ఖచ్చితంగా ఆ స్త్రీలో ఉంటూ, ఆకర్షణీయంగా ఉండడమే ఇందుకు కారణం. ఒక్కోసారి పురుషులు తమకు నచ్చిన, లేదా ఆకర్షితులైన స్త్రీలపట్ల ఒకటికి రెండుసార్లు, లేదా రెండు సెకండ్లకు ఒకమారు చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా ? ఈప్రశ్న అనేకమందికి ఆసక్తిని రేకెత్తించే ప్రశ్నగా ఉంది అనడంలో ఆశ్చర్యమే లేదు.
కావున, పురుషులను ఆకర్షించే మహిళ గురించిన ఆకర్షణీయమైన విషయాలు తెలుసుకునేందుకు ఈ వ్యాసం చూడండి.

లా ఆఫ్ అట్రాక్షన్ : స్త్రీలలో ఆకర్షణీయ లక్షణాలు
కాన్ఫిడెన్స్ :
మీ విశ్వాసం ఒక పురుషుని ఆకర్షించే విషయాల్లో ప్రధానమైనది. పురుషులు ఇంటెలిజెన్స్, సెక్సీ మరియు ఆకర్షణీయమైన మహిళను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మీరు మాట్లాడే విధానం లేదా నడవడిక ఖచ్చితంగా ముఖ్యవిషయాలుగా ఉంటాయి. ఇక్కడ మీ ఆత్మవిశ్వాసం కీలకపాత్ర పోషిస్తుంది. మహిళలోని ఆత్మవిశ్వాసం, ఆమె నడవడిక మీద ప్రభావం చూపిస్తుంది. క్రమంగా ఇతరులను ఆకర్షించే అంశాలలో ప్రధానంగా ఉంటుంది.
ప్రశాంతత/సున్నిత స్వభావం :
నాటకీయత జోడించిన విధానం, ఆర్భాటపు మాటలను పురుషులు ఎన్నటికీ ఇష్టపడరు. పొదుపుగా సమయానుసారం మాటలు కలపడం, సున్నిత స్వభావాన్ని కలిగి ఉండి, ప్రవర్తనలో ప్రశాంతత కలిగి ఉన్న మహిళలను ఎక్కువగా ఇష్టపడుతారు.
ఇంటెలిజెన్స్ :
ఒక ఆలోచనాశక్తి లేని స్త్రీ, ఒక ఖాళీ సిలిండర్ వలె ఉంటుందన్న అభిప్రాయం పురుషులది. మహిళలు తమ హృదయపూర్వకంగా హేతుబద్ధమైన అంశాలతో మాట్లాడినప్పుడు క్రమంగా పురుషులు ఆకర్షితులవుతారు. తెలివైన స్త్రీ ఉన్నతమైన ఆశయాన్ని, ప్రణాళికలను కలిగి ఉంటుంది. క్రమంగా ఈ తెలివితేటలనే పురుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
పొడవైన కాళ్ళు:
ఎక్కువ శాతం పురుషులు, మహిళలు పొడవైన కాళ్ళను కలిగి ఉండుటకు ఇష్టపడతారు. ఇది వారు గమనించి ఇష్టపడే భౌతిక లక్షణంగా ఉంటుంది.
నీలి కళ్ళు:
నీలి కళ్ళు అరుదైనవి మరియు అరుదుగా ఉండే అంశాలు పురుషులని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి. పురుషులు దీనిని ఎదురులేని విషయంగా పరిగణిస్తుంటారు
హెయిర్:
అవును, అనేకమంది పురుషులు ఎక్కువగా స్త్రీ యొక్క జుట్టునే ఎక్కువగా చూస్తారు. పురుషులు, స్త్రీలు ఆకర్షణీయమైన జుట్టును కలిగి ఉండడం ఒక వరం వలె భావిస్తారు. మహిళల అందానికి జుట్టు పోషించే పాత్ర కీలకమైనది. క్రమంగా కేశాలంకరణ మీద అధిక శ్రద్ద కలిగిన మహిళల పట్ల అధిక ఆసక్తిని కనపరుస్తుంటారు.
ఇది ఒక వ్యక్తిని ఆకర్షించడంలో మహిళలు కలిగి ఉండే ప్రధాన ఉన్నతమైన అంశాలలో కేశాలంకరణ కూడా ఒకటి అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. వారి వెంట్రుకలతో ఆడటం లేదా వారి చేతులను వెంట్రుకల మద్య నుండి నడపడం, లేదా వారి పొడవాటి జుట్టును వారి చేతులతో కదిలిస్తూ మెడను బహిర్గతం చేసేలా వ్యక్తి కంటికి పరిచయం చేస్తూ, ఆకర్షించగలదు స్త్రీ.
పాతకాలపు లుక్:
పురుషులు సాధారణంగా వారి వయస్సు కన్నా కొంచెం అధిక పరిపక్వత కలిగిన మహిళల పట్ల ఆకర్షితులవుతుంటారు. క్రమంగా ఒక మహిళ ఆయా ప్రాంతాల దృష్ట్యా పాతకాలపు లుక్ కలిగిన దుస్తులు లేదా మేకప్ కలిగి ఉన్న ఎడల, పురుషులు ఆకర్షితులవుతుంటారు.
భిన్నమైన వైఖరి:
వైఖరి లేదా విధానం ఒక వ్యక్తిని నిర్దేశించగలదు. ముఖ్యంగా ఒక మహిళ విషయంలో, వారి భిన్న స్వభావం మరియు విధానం పురుషులను ఆకర్షించగలదు. సానుకూల దృక్పథం కలిగి ఉండటం పురుషుల శ్రద్ధని తమ మీదకు మళ్లేలా చేయగలదు. సాధారణంగా పురుషులకు, రొటీన్ ఆలోచనలు కలిగి ఉన్న మహిళలకన్నా, భిన్నవైఖరిని ప్రస్ఫుటించే స్త్రీలు ఎక్కువగా నచ్చుతారు.
వంపులు:
మీలోని ప్రత్యేకమైన అంశాలే ఒక వ్యక్తి దృష్టిని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మీకు తెలియనిదికాదు. పురుషులు తన శరీరాకృతిని కాపాడుకుంటున్న స్త్రీకి అధికంగా ఆకర్షించబడతారు. క్రమంగా వంపులు తిరిగిన సరైన శరీరాకృతి కలిగిన స్త్రీపట్ల అధికంగా ఆకర్షితులవుతారు.
అద్దాలు:
పురుషులు, పొడవాటి జుట్టును కలిగి అద్దాలు ధరించిన మహిళ పట్ల ఆకర్షితులవుతుంటారు. ఈ లుక్ వారిని తిరుగులేని విధంగా చేస్తుంది. పురుషులు సులభంగా ఆకర్షించబడతారు.
హాస్య చతురత:
పురుషులు మరియు మహిళలు ఇద్దరూ హాస్యచతురత కలిగిన వారినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎప్పుడూ ముభావంగా ఉండే వ్యక్తులను ఇష్టపడరు. తమ హాస్య చతురతతో పరిస్థితులను చక్కదిద్దగలిగే మహిళల మాటలకు పురుషులు ఆకర్షించబడుతుంటారు.
మిస్టీరియస్:
పురుషులు ఎక్కువగా మహిళల విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనపరుస్తుంటారు, ప్రతిదీ బహిరంగపరచి పంచుకునే మహిళల కన్నా, తాము కనుక్కోడానికి అంశాలు మిగిలి ఉన్న మహిళల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు.
అటువంటి మహిళ సాధారణ మహిళకన్నా భిన్నంగా కనిపిస్తుంటుంది.
నప్పే దుస్తులు:
మనిషి నడవడిక ధోరణితో పాటు, తమకు నప్పే దుస్తులను ధరించడం కూడా పురుషులను ఆకర్షించే అంశాలలో ప్రముఖమైనది. శరీరాకృతి, అందానికి తగినట్లుగా దుస్తులను ఎంపిక చేసుకోవడం కూడా ఒక కళ అని పురుషుల అభిప్రాయంగా ఉంటుంది. క్రమంగా వారి దృష్టి పూర్తిగా మీమీద పడేలా చేసుకోవచ్చు.
సెక్సీ, శరీరాకృతి వంటి శారీరిక అంశాలతో పాటు వ్యక్తిత్వం, హాస్యచతురత, నడవడిక వంటి మానసిక అంశాలు కూడా పురుషులను ఆకర్షించేవిగా ఉంటాయి. మరియు పురుషులు అందరు కూడా ఒకే ఆలోచనలను కలిగి ఉండరు. కావున, మీరు ఇష్టపడుతున్న వ్యక్తి అయితే వారి విధానాలను అనుసరించి అడుగులు వేయవలసి ఉంటుంది.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications