For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భాగస్వామితో ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల, మీ రిలేషన్షిప్ మరింత బలపడుతుంది

మీ భాగస్వామితో ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల,మీరిలేషన్షిప్లో కావలసినంత సంతోషాన్ని పొందగలరు,అలా ఎందుకని?

|

అవును, మీరు విన్నది నిజమే !

మీరు ఎక్కువగా సెక్స్ చేయడం ద్వారా మాత్రమే మీకు కావలసిన ప్రతిదానిని పొందగలరు, ఇదే నిజం ! మీ రిలేషన్షిప్ లో మీకు కావలసిన ఆనందాలను ఎక్కువగా పొందడమనేది సెక్స్ ద్వారా మాత్రమే ఎలా జరగవచ్చని మీరు తీవ్రంగా ఆలోచిస్తున్నారా ? ఇద్దరు మనుషుల మధ్య అత్యంత సన్నిహిత సంబంధమనేది కేవలం సెక్స్ ద్వారా మాత్రమే ఏర్పడుతుందని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ విషయమే, మానవ జీవితాన్ని పరిపూర్ణం చేస్తున్నది ! మీ భాగస్వామి మాత్రమే, మీ శరీరం - ఆత్మ - మనస్సు అనేవి ఓకే తాటిపైకి వచ్చేలా - మీరు కోరుకునే విధంగా మీతో సెక్స్ చేయగలదు. అందువల్ల, మీరు మీ భాగస్వామితో ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల, మీ రిలేషన్షిప్ లో మీకు కావలిసిన ప్రతి ఆనందాన్ని ఆస్వాదించవచ్చు ఎందుకంటే, మీరు మీ భాగస్వామితో ఇలా ప్రేమగా ఉండటంవల్ల అది మీ అనుబంధాన్ని శాశ్వతమైనదిగా చేస్తుంది, అదే నిజమేనా ప్రేమగా రూపాంతరం చెందుతుంది.

ఈ వివరణ కేవలం ఆ ఒక్క కారణాన్ని (సెక్స్ను) సూచించేదిగా ఉండటం మాత్రమే కాదని, అంతకుమించిన ఉద్దేశాలను కూడా మీకు తెలియజేసి, మీలో ఉన్న భయాలను పోగొట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము.

మేము చేసిన ప్రకటనను సమర్థించే ఇతర విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం !

1. సెక్స్ వల్ల మీరు మరింత పాజిటివ్గా ఉంటారు :-

1. సెక్స్ వల్ల మీరు మరింత పాజిటివ్గా ఉంటారు :-

సెక్స్ మీలో ఉన్న భావోద్వేగ ఒత్తిడిని నయం చేసి, శారీరక వ్యాయామాన్ని చేకూర్చి - మీలో మరింత సానుకూల దృక్పథాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. సానుకూల దృక్పథం అనేది చాలా ముఖ్యమైనది, భాగస్వాముల మధ్య సెక్స్ ఎక్కువగా జరగటంవల్ల మీ మధ్య ఈ సానుకూల దృక్పథమనేది మరింత ఎక్కువగా పెంపొందుతుంది.

సానుకూల దృక్పథమనేది మెరుగుపడటం వల్ల, ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఎలాంటి సందేహం లేకుండా మరింత దృఢంగా మారుస్తుంది. సానుకూల దృక్పథమనేది మిమల్ని జీవితంలో ముందుకు నడిపిస్తుంది, అలాగే మీకు కావలసిన వాటన్నింటినీ సమకూరుస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇలాంటి దృక్పధాన్ని కలిగి ఉండటంవల్ల మీ భాగస్వామితో మీ జీవితాన్ని మరింత ఆనందంగా ఆస్వాదించగలరు.

మీ భాగస్వామితో మీరు సెక్స్ను ఆస్వాదించడం వల్ల మీ మధ్య బంధం మరింత దృఢంగా మారి, మీ మధ్య మరింత సన్నిహిత్యాన్ని పెంచుతుంది.

2. సెక్స్ మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది :-

2. సెక్స్ మీలో ఒత్తిడిని తగ్గిస్తుంది :-

సెక్స్ అనేది చాలా సున్నితమైన వ్యవహారం. సెక్స్, మీలో ఉన్న మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ తరం వారు ఎక్కువగా ఎదుర్కొంటున్న బాధలు & ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందేందుకు మీరు తప్పక మీ భాగస్వామితో సెక్స్లో పాల్గొంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మీరు మంచి అనుభూతిని పొందడమే కాకుండా, మిమ్మల్ని మీ భాగస్వామిని మరింత చేరువచేస్తుంది.

ఒత్తిడి అనే ప్రతికూలమైన ఆరోగ్యపరిస్థితి మీకు అనేక వ్యాధులు కలగటానికి దారితీస్తుంది, వాటినుంచి మీరు బయటపడటానికి సెక్స్ బాగా సహాయపడుతుంది. మీరు ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల వ్యాధులు, ఒత్తిడులు మీ దరిచేరవు.

3. సెక్స్ మీ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది :-

3. సెక్స్ మీ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుంది :-

సెక్స్ అంటే మీకు, మీ భాగస్వామికి మధ్య ఏర్పడే సఖ్యతకు ప్రతిరూపం. ఈ సఖ్యత, మీ మధ్య ఉన్న ప్రేమ బంధానికి మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. మీ ప్రేమ బంధంలో సెక్స్ అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది. అలాంటి అవసరం కంటే, సెక్స్ మీ జంటల మధ్య మరింత సాన్నిహిత్యం పెంపొందించడంలో సహాయపడుతుంది.

ఒక జంటగా, మీ పాట్నర్స్ మద్యలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించే అంశంగా "సెక్స్ను" వ్యవహరించాలి. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని, సెక్స్ అనేది మరింత ఎక్కువగా పెంపొందిస్తుంది. మీ జీవితంలో సెక్స్ కొనసాగినంత వరకూ మీ ఉన్న సాన్నిహిత్యం ఏ మాత్రము చెదిరిపోదు.

మీ భాగస్వామితో మీరు మరింత ఆనందాన్ని, సఖ్యతను పొందేందుకు - మీరిరువురు సెక్స్ను ఎక్కువగా ఆస్వాదించండి.

4. మీ మధ్య మెరుగైన కమ్యూనికేషన్ కోసం :-

4. మీ మధ్య మెరుగైన కమ్యూనికేషన్ కోసం :-

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సెక్స్ అనేది కమ్యూనికేషన్కు ప్రతిరూపము. ఈ కమ్యూనికేషన్ అనేది శారీరక భావోద్వేగాలను ఉత్తేజపరిచే రూపంగా ఉంటుంది. సెక్స్ అనేది మీలో ఉన్న ఆత్మ మరొకరితో అనుసంధానము కాబడటం, ఈ మార్గంలోనే ప్రేమికులిద్దరూ ఒకటిగా మారతారు.

ఇక్కడ ఒక వ్యక్తి మరొక వ్యక్తితో శారీరకంగా కలవడం వల్ల వారిమధ్య ప్రేమ చిగురించడమే కాకుండా, ఒకరికొకరు ప్రేమతో కమ్యూనికేట్ చేసుకుంటారు. ఆ సమయంలోనే వారిమధ్య జరిగే శారీరక కలయిక భావోద్వేగ భరితమైన శబ్దాలను కలిగి ఉండటంతోపాటు, చెమట రూపంలో కూడా బయటపడుతుంది.

5. భాగస్వాముల మధ్యలో ఆప్యాయతను పెంపొందిస్తుంది :-

5. భాగస్వాముల మధ్యలో ఆప్యాయతను పెంపొందిస్తుంది :-

మీరు ఎక్కువగా మీ భాగస్వామితో సెక్స్ చేయడం వల్ల, మీ మధ్య ఉన్న ప్రేమ తారాస్థాయిలోకి చేరుకుంటుంది. మీలో ఎవరూ ఈ అంశాన్ని విభేదించలేరు. శారీరక, భావోద్వేగ కమ్యూనికేషన్ ద్వారా మాత్రమే మీ మధ్య ఆప్యాయత ప్రేరేపించబడుతుంది. భావోద్వేగ భరితమైన కమ్యూనికేషన్ అనేది ప్రేమికులు పాల్గొనే రతిచర్యలో చేసే శబ్దాలు ద్వారా బయటకు వెలువడుతుంది.

మీరు ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల శరీర హార్మోన్ల ప్రమేయం ఎక్కువగా ఉండటం పాటు, ఒకరికోసం మరొకరు ఆరాటాన్ని కలిగి ఉండటంతోపాటు ఇద్దరి మధ్య రతిచర్య ప్రారంభమయ్యే అవకాశాలను సుగమం చేస్తుంది.

మీరు, మీ భాగస్వామితో మరింత ప్రేమను ఆస్వాదించాలనుకుంటే మీరు ఎక్కువగా సెక్స్లో పాల్గొంటూ ఉండాలి, ఇది మీ మధ్య ప్రేమను పెంపొందిస్తుంది. సెక్స్ కారణంగా మీ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ల ప్రభావం ఒకరి మీద మరోకరు ఎక్కువ ప్రేమను కలిగి వుండేటట్లుగా చేస్తుంది.

6. మీ బంధంలో వెలుగులు నింపుతుంది :-

6. మీ బంధంలో వెలుగులు నింపుతుంది :-

మీరు మీ భాగస్వామితో ఎక్కువగా సెక్ను ఆస్వాదించడం వల్ల మీ మధ్య ఏర్పడే బంధం వెలుగులతో పూర్తిగా నిండి ఉంటుంది. ఈ వెలుగులు ప్రతి బంధంలో ఏర్పడటంవల్ల మీ భాగస్వాముల మధ్య ప్రేమ ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది.

మీరు మీ భాగస్వామి కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం, కనపడే వెలుగు ఆ రాత్రిని అద్భుతమైనది రాత్రిగా చేసి, మీకు మీ భాగస్వామిని మరింత చేరువగా చేస్తుంది. ఈ వెలుగులు మీ ఇద్దరి మధ్య బంధాన్ని దీర్ఘకాలం కొనసాగేటట్లుగా చేయటంలో సహాయపడుతుంది. ఈ వెలుగులు ఇప్పటివరకు మనము మాట్లాడుకున్న ప్రేమ, కమ్యూనికేషన్, సాన్నిహిత్యం వంటి ఇతర అంశాలను మీ మధ్యన ప్రేరేపించబడటం ద్వారా మీలో నమ్మకం, ఆనందం అనేవి పెంపొందించబడతాయి.

ఈ ముఖ్యమైన 6 ప్రతిఫలాలను, సెక్స్ మీకు దగ్గర చేస్తుంది. మీ బంధాన్ని మరింత ఎక్కువగా ఆస్వాదించాలంటే, సఖ్యతగా మెలగాలంటే, మీరు ఎక్కువగా సెక్స్లో పాల్గొనాలి. ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల మీ భాగస్వాముల మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఎక్కువకాలం కొనసాగేలా చేస్తుంది.


English summary

MORE SEX LEADS TO MORE OF EVERYTHING IN YOUR RELATIONSHIP; WHY?

There are 6 of the most important results that having more sex provides. In order to feel the relationship you are in, you need to have more of intimacy and sex. More the sex, more is the connection between you and your partner and that is the only way you can make everything better in favour of you and your partner in the relationship and for a very long time.
Story first published:Friday, June 8, 2018, 15:41 [IST]
Desktop Bottom Promotion