For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇద్దరం ఫుల్ తాగాం తను నాతో శారీరకంగా కలిశాడు, దీనికంతటికి అమ్మనే కారణం #mystory215

ఒకసారి ఇద్దరం ఫుల్ తాగాం. తర్వాత తను నాతో శారీరకంగా కలిశాడు. ఆ మైకంలో నాకు అప్పడు అస్సలు తెలియలేదు. కొన్నాళ్లకు నా డేట్ రాలేదు. అప్పుడు టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ అని చెప్పారు.

|

నా పేరు సురేఖ. మాది వైజాగ్. నేను చిన్నప్పటి నుంచి ఒక సమస్యను ఎక్కువగా ఫేస్ చేస్తున్నాను. బయటి వాళ్లు మనల్ని అర్థం చేసుకోకున్నా ఫర్వాలేదు. కానీ ఇంట్లోవాళ్లు అర్థం చేసుకోకుండా ఆంక్షలు విధిస్తే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది. తల్లిదండ్రులు అతి జాగ్రత్తగా చూసుకున్నా.. అస్సలు పట్టించుకోకుండా ఉన్నా మంచిది కాదని నా అభిప్రాయం.

నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదవుతున్నాను. ఇంట్లో అమ్మనాన్నతో పాటు మా అక్క కూడా ఉంటుంది. మేము ఇద్దరం ఆడపిల్లలమే.. కాబట్టి మాపై అతి జాగ్రత్త చూపేవారు అమ్మనాన్న. ఎక్కడికైనా బయటికి వెళ్తే వంద జాగ్రత్తలు చెప్పేవారు.

ప్రతి మాటకు తల ఊపేవాళ్లం

ప్రతి మాటకు తల ఊపేవాళ్లం

చిన్నప్పుడు వాళ్లు చెప్పిన ప్రతి మాటకు తల ఊపేవాళ్లం. కానీ ఇప్పుడు మాత్రం అమ్మనాన్న చెప్పే మాటలు చిరాకు తెప్పిస్తున్నాయి. ప్రతి విషయంలో అలా చెయ్ ఇలా చెయ్ అని అంటూ ఉంటారు. ఒకవేళ అందుకు నో చెబితే.. అరుస్తారు. తిడతారు.

అమ్మ నాపై ఎక్కువ కేర్ తీసుకుంటుంది

అమ్మ నాపై ఎక్కువ కేర్ తీసుకుంటుంది

ముఖ్యంగా మా అమ్మ నాపై ఎక్కువ కేర్ తీసుకుంటుంది. తన మూఢనమ్మకాలను మొత్తం నాపై రుద్దుతుంది. మా అమ్మ కాలేజీ చదివే రోజుల్లో ఏవేవో ఇబ్బందులుపడిందట. అవన్నీ నాకు చెబుతూ ఉంటుంది. ఇక మా నాన్న చేసుకున్నాక కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందట. మా డ్యాడీ అమ్మను ఉద్యోగం చేయొద్దని మాన్పించి ఇంట్లో కూర్చొబెట్టాడట.

అమ్మపై బాగా కోపం వచ్చేది

అమ్మపై బాగా కోపం వచ్చేది

అందుకే నన్ను మా అమ్మ బ్లౌజ్ స్టిచింగ్, ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ వంటివి నేర్చుకో అని చెబుతూ ఉంటుంది. నాకు అవి ఏవీ నచ్చవు. చివరకు నా అభిరుచుల్ని కూడా తానే డిసైడ్ చేస్తే ఎలా అనేది నా ప్రశ్న. దాంతో నాకు మా అమ్మపై బాగా కోపం వచ్చేది. ఇక అబ్బాయిలతో అసలు మాట్లాడొద్దని చెప్పేది. నేను ఇంటర్ వరకు అమ్మ చెప్పిన మాటలనే విన్నాను. తర్వాత నా వల్లే కాలేదు.

పంజరంలో చిలుక మాదిరిగా ఉండేదాన్ని

పంజరంలో చిలుక మాదిరిగా ఉండేదాన్ని

బీటెక్ లో జాయిన్ అయ్యాక కొత్తకొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. అంతవరకు నేను పంజరంలో చిలుక మాదిరిగా ఉండేదాన్ని. ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చినట్లు అనిపించింది. కాలేజీలో నా ఫ్రెండ్స్ లో ఎక్కువగా బాయ్స్ ఉండేవారు. మా అమ్మకు తెలియకుండా నేను కాలేజీలో బాయ్స్ తో బాగా ఎంజాయ్ చేసేదాన్ని. అలా నాకు ఒక అబ్బాయితో బాగా పరిచయం ఏర్పడింది. స్పెషల్ క్లాస్ లని చెప్పి తనతో ట్రిప్స్ వెళ్లేదాన్ని. తను నాకు చాలా చెడ్డ అలవాట్లు నేర్పాడు.

నాతో శారీరకంగా కలిశాడు

నాతో శారీరకంగా కలిశాడు

ఒకసారి ఇద్దరం ఫుల్ తాగాం. తర్వాత తను నాతో శారీరకంగా కలిశాడు. ఆ మైకంలో నాకు అప్పడు అస్సలు తెలియలేదు. కొన్నాళ్లకు నా డేట్ రాలేదు. అప్పుడు టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీ అని చెప్పారు. వెంటనే అబార్షన్ చేయించుకున్నాను. కానీ ఆ సమయంలో నేను పడ్డ ఇబ్బందులు దేవుడికే ఎరుక. అన్నీ ఇబ్బందులుపడ్డాను. అమ్మ చెప్పిన మాటలు విని ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనిపిస్తూ ఉంటుంది. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నా పరువు పోయింది.

అతిగా కేర్ తీసుకొని ఉండకుండా ఉంటే

అతిగా కేర్ తీసుకొని ఉండకుండా ఉంటే

కానీ అమ్మ చేసిన అతిగారాబం వల్లే నాకు ఒక్కసారిగా రెక్కలు కట్టకుని ప్రపంచమంతా విహరించాలనిపించింది. తన అతిగా కేర్ తీసుకొని ఉండకుండా ఉంటే నేను అలా ప్రవర్తించేదాన్ని కాదేమో. ఏ విషయంలో కూడా అతి పనికిరాదు. ఎక్కువగా బంధించినట్లు పెట్టడం వల్లే నేను అలా తప్పుడు మార్గంలోకి వెళ్లాను. నాలా ఏ ఆడపిల్ల కూడా తన జీవితాన్ని ఇలా చేసుకోకూడదని కోరుకుంటున్నా. అలాగే తల్లిదండ్రులు కూడా అతిగా జాగ్రత్తలు చెప్పకూడదు. అలా అని గాలికి వదిలేయకూడదు.

English summary

my boyfriend cheated on me but the reason my mother

my boyfriend cheated on me but the reason my mother
Story first published:Thursday, August 23, 2018, 15:42 [IST]
Desktop Bottom Promotion