రాధతో రాత్రీపగలూ ఎంజాయ్ చేశా.. సంధ్యకు ఆ విషయం తెలిసింది.. పెళ్లికి ఒప్పుకోవడం లేదు- #mystory120

Written By:
Subscribe to Boldsky

నా ఇంటర్‌ పూర్తయింది. నేను బీటెక్ లో జాయినయ్యాను. అక్కడ అందరూ కొత్త వాళ్లే. మొదట బీటెక్ మానేసీ బ్యాంక్ కోచింగ్ లో జాయిన్ అవుదాం అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత బీటెక్ లో అడ్జస్ట్‌ అయిపోయాను.

సెమిస్టర్‌ పరీక్షలు

సెమిస్టర్‌ పరీక్షలు

మొత్తానికి ఫస్ట్ సెమిస్టర్‌ పరీక్షలు వచ్చాయి. ఎగ్జామ్ కు వెళ్లాను. నా పక్కన ఎవరు పడ్డరా అని అటూ ఇటూ చూశాను. ఒక అందమైన అమ్మాయి వచ్చి నా పక్కన కూర్చొంది. ఇద్దరం ఒకే బెంచ్ పై కూర్చొన్నాం. నాది మెకానికల్ బ్రాంచ్. తనది సివిల్ బ్రాంచ్.

కళ్లు ఆర్పలేదు

కళ్లు ఆర్పలేదు

ఆమెను చూడగానే కాసేపు కళ్లు ఆర్పలేదు. ఎలాగైనా తనతో మాట్లాడుదామనుకున్నా. మీది ఏ బ్రాంచ్ అన్నాను. మెకానికల్ అంది. మీ పేరు అని అడిగాను. సంధ్య అని చెప్పింది. పరీక్షలు అయిపోయే వరకు నాకు ప్రతి రోజూ సంధ్య గుర్తొచ్చేది.

గుండె వేగం

గుండె వేగం

తాను కాస్త లేటుగా పరీక్షకు వచ్చినా నా గుండె వేగం పెరిగిపోయేది. తాను ఎప్పుడొస్తుందా అని వేచి చూసేవాణ్ని. పరీక్ష రాస్తూరాస్త నేను తనవైపు చూస్తే వెంటనే తను కూడా చూసేది.

నీ నంబర్ చెప్పవా?

నీ నంబర్ చెప్పవా?

అలా చూపులతోనే మేమిద్దరం మాట్లాడుకునేవాళ్లం. పరీక్ష అయిపోయాక కూడా ఇద్దరం చాలా సేపు మాట్లాడుకునేవాళ్లం. ఒక రోజు తన ఫోన్ నంబర్ అడుగుదామనుకున్నాను. అంతలో తనే నీ నంబర్ చెప్పవా అంది. వెంటనే నా ఫోన్ నంబర్, వాట్సాప్‌ నంబర్‌ ఇచ్చాను.

గంటల తరబడి చాటింగ్

గంటల తరబడి చాటింగ్

మేమిద్దరం రోజూ గంటల తరబడి చాటింగ్ చేసేవాళ్లం. నా వేళ్లు ఒక్కోసారి నొప్పి పుట్టేవి. అంతగా ఉండేది మా చాటింగ్. మొదట చాటింగ్ చేసేటప్పుడు ఏదో హాయ్.. హలో వరకే ఉండేది. తర్వాత నుంచి ఇద్దరం రొమాంటిక్ గా చాటింగ్ చెయ్యడం మొదలుపెట్టాం.

చాలా గొప్పగా కనిపిస్తారు

చాలా గొప్పగా కనిపిస్తారు

మనం ఎవరినైనా ఇష్టపడితే వాళ్లు మనకు చాలా గొప్పగా కనిపిస్తారు. నాకు కూడా సంధ్య అలాగే కనిపించేది. సంధ్య అప్పుడప్పుడు కోప్పడేది. అయినా నాకు తను కోపంలోనూ బాగా నచ్చేది.

విపరీతమైన ఇష్టం

విపరీతమైన ఇష్టం

తనపై నాకు విపరీతమైన ఇష్టం పెరిగింది. వెంటనే నా మనస్సులో మాట చెబుదామనుకున్నాను. ఒక రోజు.. నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాను. సరే కాలేజీలో మాట్లాడుకుందాం అంది.

ఎంతో టెన్షన్‌తో

ఎంతో టెన్షన్‌తో

తన కోసం నేను ఎంతో టెన్షన్‌తో కాలేజీలో ఎదురుచూస్తున్నా. ఇంతలో తను వచ్చింది. ఏంటో చెప్పాలన్నావ్.. చెప్పు మరి అంది. నా గుండెలోని ప్రేమనంతా ఒక్కసారి చూపించాలనిపించింది. ఒకవేళ తాను కాదంటే నేను తట్టుకోలేను.

ప్రపోజ్ చేశాను

ప్రపోజ్ చేశాను

అందుకే చాలా సేపు ఆలోచించి ప్రపోజ్ చేశాను. మొదట మౌనంగా ఉంది. నా శరీరం మొత్తం చమటలు పట్టాయి. తర్వా ఐలవ్యూ టూ అంది. వెంటనే అక్కడే కిస్ చేశాను.

రాధ అనే అమ్మాయిని

రాధ అనే అమ్మాయిని

అయితే నాకు ఇంటర్ లో ఒక లవ్ స్టోరీ ఉండేది. రాధ అనే అమ్మాయిని లవ్ చేసేవాణ్ని. ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. రాధతో నేను చెయ్యని ఎంజాయ్ అంటూ ఏదీ లేదు. రాధ నేను ఇంటర్ లోనే చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నాం.

సంధ్యకు ఎవరో చెప్పారు

సంధ్యకు ఎవరో చెప్పారు

ఈ విషయం ఇక్కడ ఎవరికీ తెలుస్తుందిలే అనుకున్నాను. కానీ నా మాజీ ప్రేమ గురించి సంధ్యకు ఎవరో చెప్పారు. దాంతో మా ప్రేమాయణంలో ఓ కలత ఏర్పడింది. సంధ్య నన్ను ఒక రోజు రాధ గురించి అడిగింది.

యూజ్ చేసుకుని వదిలేసింది

యూజ్ చేసుకుని వదిలేసింది

అవును నిజమే అన్నాను. కానీ తన క్యారెక్టర్ బ్యాడ్.. తను నన్ను యూజ్ చేసుకుని వదిలేసింది. తనకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారన్నాను. తను నువ్వు ఒక్కటి కాదు.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అన్నాను.

బ్రేకప్‌

బ్రేకప్‌

తాను నేను ఎంత చెప్పినా వినలేదు. వెంటనే బ్రేకప్‌ అంది. నాతో చాలా రోజులు మాట్లేడేది కాదు. ఏందిరా నా జీవితం ఇలా అయిపోయింది అనుకునేవాణ్ని.

దూరంగా ఉంచింది

దూరంగా ఉంచింది

అలా ఏడాది పాటు నన్ను దూరంగా ఉంచింది. ఓ రోజు నా దగ్గరకు వచ్చి సారీ.. నీ గురించి తెలియక నిన్ను ఇన్నాళ్లు దూరం పెట్టాను అంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా అంది.

చాలా ఇష్టం

చాలా ఇష్టం

నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది. అలా మళ్లీ ఇద్దరం కలిశాం. తర్వాత సంధ్యను ఇంటికి తీసుకెళ్లాను. మా ఇంట్లో వాళ్లు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ సంధ్య వాళ్ల ఇంట్లో వారు మా పెళ్లికి ఒప్పుకోవడం లేదు.

సమస్యలు వస్తూనే ఉన్నాయి

సమస్యలు వస్తూనే ఉన్నాయి

నాకు ఒకదాని వెనకాల ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి. వాళ్ల ఇంట్లో వాళ్లు పెళ్లికి ఒప్పుకుంటే ఇద్దరం జీవితాంతం హ్యాపీగా కలిసి ఉంటాం. జీవితంలో తొందరపడి ఏ తప్పూ చేయకూడదు. ఒకవేళ చేస్తే దాని తాలుకా ప్రభావాలు మనపై పడుతూనే ఉంటాయి.

English summary

my first love cheated on me

my first love cheated on me
Story first published: Wednesday, March 21, 2018, 13:30 [IST]