For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాణి నన్ను మాయ చేసింది, అరగంట సేపు తన పెదాలతో నా లిప్స్ లాక్ చేసేసింది #mystory205

అక్కడే ఆగిపోయావేంటీ.. మనం త్వరలోనే భార్యాభర్తలం... దగ్గరకు వచ్చేసెయ్ అన్నాను. తన వచ్చి నా ఒళ్లో వాలింది. మరి ఇంత చేశాను కదా నాకేమీ ట్రీట్ ఇవ్వవా అని జోక్ చేశాను. ట్రీట్ ఏంటీ.. సర్వం నీకే సమర్పిస్తాను

|

నాకు పెళ్లంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అంతా కూడా పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులుపడేవారు. చాలా అంటే.. బ్యాచిలర్స్ మాదిరిగా పార్టీలు చేసుకోవడానికి వీలుండదు. ఏ పని చేసినా పెళ్లానికి చెప్పి చేయాలి.

అసలు ఈ భార్యలు ఎలా ఉంటారంటే.. ఫ్రెండ్స్ తో ఉన్నామంటే అనుమానపడతారు. ఆఫీస్ లో వర్క్ బిజీ వల్ల కాస్త లేట్ అయితే అనుమానపడతారు. అందుకే నేను జీవితంలో ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదనుకున్నా.

మూడేళ్ల పెళ్లి వద్దని ఇంట్లో చెప్పాను

మూడేళ్ల పెళ్లి వద్దని ఇంట్లో చెప్పాను

మా ఇంట్లో వాళ్లేమో నాకు పాతికేళ్లు కూడా నిండకుండానే పెళ్లి చేయాలని తెగ ఇబ్బందిపెడుతున్నారు. కానీ నేను మరో మూడేళ్ల వరకు పెళ్లి వద్దని ఇంట్లో చెప్పాను. అలా కాదని సంబంధాలు చూస్తే ఇంట్లో నుంచి దూరంగా పారిపోతానన్నాను. అంతే అప్పటి నుంచి నాకు సంబంధాలు చూడడం మానేశారు.

హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కల

హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కల

నాకు మాత్రం హ్యాపీగా నా సొంత డబ్బులతోనే ఒక లగ్జరీ కారు కొనుక్కుని, ఓ డూప్లెక్స్ బిల్డిండ్ తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కల. మా వాళ్లేమో ఊర్లో మనం వ్యాపారాలు చూసుకుంటూ ఇక్కడే ఉండురా అని గోల పెట్టేవారు . కానీ అలా మా ఊర్లో ఉండి మా నాన్న మాదిరిగానే నా లైఫ్ కూడా ఎలాంటి ఎంజాయ్ లేకుండా ఎండ్ కావడం నాకిష్టం లేదు.

ఏజ్ బార్ అయితే పిల్లనివ్వరురా

ఏజ్ బార్ అయితే పిల్లనివ్వరురా

అలాగే వరల్డ్ వైడ్ గా ఒక ట్రిప్ వేసి రావాలనేది నా కల. రోమ్, యూరప్, యూఎస్ ఇలా అన్నీ చుట్టేయాలనేది నా ఎయిమ్. అందుకోసమే పెళ్లిగిళ్లి అన్నీ పక్కన పెట్టేశాను. మా ఇంట్లో వాళ్లేమో ఒరేయ్.. నీకు ఏజ్ బార్ అయితే పిల్లనివ్వరురా అని అనేవారు.

ఏదో ఒక పిల్లను చేసుకోరా

ఏదో ఒక పిల్లను చేసుకోరా

మా బంధువుల్లోనూ ఓ నలుగురు ఐదుగురు పేర్లు చెప్పి ఏదో ఒక పిల్లను చేసుకోరా అనేవారు. ఇక వీళ్లు వినేటట్లు లేరని ఒకసారి బలవంతంగా పెళ్లి చూపులకు వెళ్లాను. ఆ పిల్ల పేరు వాణి. మా దూరపు బంధువుల అమ్మాయి. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది కానీ నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ఏదో ఒక కారణం చెప్పి రిజెక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను.

రూమ్ లోకి వెళ్లాం

రూమ్ లోకి వెళ్లాం

వాణి వాళ్ల నాన్నకు ఆరోగ్యం సరిగ్గా లేదు. ఆ ఇంటికి వాణినే ఆసరా. తను జాబ్ చేస్తేనే వాళ్ల ఇళ్లు గడుస్తుంది. దాంతో వాణి నాకు నచ్చింది. తను నాతో పర్సనల్ గా మాట్లాడుతాననంది. రూమ్ లోకి వెళ్లాం. మీకు నచ్చానా అని అడిగింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. నచ్చావ్ అన్నాను. ప్లీజ్ నన్ను వెంటనే పెళ్లి చేసుకోండి అంది.

ఆ పిల్లేమో పెళ్లి చేసుకోమ్మని పట్టుబట్టింది

ఆ పిల్లేమో పెళ్లి చేసుకోమ్మని పట్టుబట్టింది

నాకు పెళ్లి అంటే పెద్ద చిరాకు. ఆ పిల్లేమో పెళ్లి చేసుకోమ్మని పట్టుబట్టింది. మరుసటి రోజు కేఫ్ లో కలుద్దామంది. ఆ రోజు తన లైఫ్ గురించి, చిన్నప్పటి నుంచి తనుపడ్డ బాధల గురించి చెప్పింది. రోజూ ఆఫీస్ తను పడే ఇబ్బందులన్నీ వివరించింది. తన ఇంటి కోసం ఆఫీస్ లో ఎవరెవరి నుంచో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. కొన్ని రోజుల్లోనే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ గా మారింది. ఒక ఫ్రెండ్ గా నీ సమస్యలు పరిష్కరించడానికి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను.

నాకు పెళ్లి అవసరం లేదు, తన కోసం చేసుకోవాలి

నాకు పెళ్లి అవసరం లేదు, తన కోసం చేసుకోవాలి

మొదట తనను ఆఫీస్ లో టార్చర్ పెడుతున్న వారందరికీ చుక్కలు చూపించాను. తర్వాత తన ఎకానామికల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేశాను. రోజురోజుకు తను నా మనస్సుకు మరింత దగ్గరైంది. అప్పుడప్పుడు వాలింటికి వెళ్లేవాణ్ని. తన సమస్యలు మొత్తం నేను దగ్గరుండి చూశాను. ఆఫీస్ అయిపోయాక ఇంట్లో మళ్లీ వాళ్ల నాన్నకు తను చేసే సేవలు చూశాను. అప్పుడనిపించింది నాకు పెళ్లి అవసరం లేదు కానీ.. తన కోసం నేను పెళ్లి చేసుకోవాలని.

అయిదు నిమిషాల్లో ఎలా అంచనా వేస్తాం

అయిదు నిమిషాల్లో ఎలా అంచనా వేస్తాం

పెళ్లి చూపులప్పుడు మనకుండే సమయం అయిదు నిమిషాలే. అంత తక్కువ టైమ్ లో ఏ అబ్బాయి కూడా అమ్మాయి ఏంటి అని అంచనా వేయలేడు. కానీ తనతో మనస్సు విప్పి మాట్లాడితే మాత్రం ఏ మంచి అమ్మాయిని అబ్బాయిలు రిజెక్ట్ చేయరని నాకు అనిపించింది.

నా గుండెల్లో స్థానం దక్కించుకుంది

నా గుండెల్లో స్థానం దక్కించుకుంది

వాణి తన నవ్వుతో నన్ను మాయ చేసేసింది. తన నిజాయితీతో నా గుండెల్లో స్థానం దక్కించుకుంది. ఒకసారి వాళ్లకు నాన్నకు హెల్త్ కండీషన్ చాలా సీరియస్ అయిపోయింది. ఆ రోజు తను ఆఫీస్ లో ఉంది. ఆఫీస్ నుంచి వచ్చేసరికి చాలా టైమ్ పడుతుంది. నాకు ఫోన్ చేయడంతో వెంటనే వెళ్లి వాళ్ల నాన్నను హాస్పిటల్ లో జాయిన్ చేశాను.

త్వరలోనే మన పెళ్లి

త్వరలోనే మన పెళ్లి

ఆ రోజు తను నాపై చూపిన ప్రేమ నేను ఎప్పటికీ మరిచిపోలేను. మరుసటి రోజు నా రూమ్ కు వచ్చింది. నీతో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అంది. నువ్వు నా పక్కనుంటే చాలు.. నాకు ఏ సమస్య రాదు... నువ్వే నా బలం అంది. వాణి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అందుకే ఇంతగా నీకోసం అన్నీ చేస్తున్నాను అన్నాను. త్వరలోనే మన పెళ్లి అని చెప్పాను. తను ఆనందంతో నా దగ్గరకు వచ్చింది.

పెదాల తియ్యదన్నాని రుచి చూస్తాను

పెదాల తియ్యదన్నాని రుచి చూస్తాను

అక్కడే ఆగిపోయావేంటీ.. మనం త్వరలోనే భార్యాభర్తలం... దగ్గరకు వచ్చేసెయ్ అన్నాను. తన వచ్చి నా ఒళ్లో వాలింది. మరి ఇంత చేశాను కదా నాకేమీ ట్రీట్ ఇవ్వవా అని జోక్ చేశాను. ట్రీట్ ఏంటీ.. సర్వం నీకే సమర్పిస్తాను అంది. నా యవ్వనపు అందాలన్నీ నీకే అర్పిస్తాను అంది. నీ సొగసులన్నీ పెళ్లయ్యాక చూస్తాను.. ఆస్వాదిస్తాను కానీ ఇప్పుడు మాత్రం నీ పెదాల తియ్యదన్నాని రుచి చూస్తాను అన్నాను.

ఫెవిస్టిక్ వేసినట్లుగా అతుక్కుపోయాయి

ఫెవిస్టిక్ వేసినట్లుగా అతుక్కుపోయాయి

అంతే అరక్షణంలో తన పెదాలు నా పెదాలపై ఉన్నాయి. అరగంట సేపు ఫెవిస్టిక్ వేసినట్లుగా అతుక్కుపోయాయి. అంతలా ముద్దాడుకున్నాం. అయినా నన్ను ఇంతగా నమ్ముతున్నావ్.. నేను నిన్ను పెళ్లి చేసుకోకుంటే ఎలా అన్నాను. నమ్మించి మోసం చేసేవాడు ఈ మాట అనడు అంది. అలా నా గుండెను దోచిన చిన్నదాన్నే పెళ్లి చేసుకున్నా.

English summary

She has completely stolen my heart I wanna marry her

She has completely stolen my heart I wanna marry her
Desktop Bottom Promotion