For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నందు నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడొచ్చేది, పెళ్లాంలాగానే కాపురం చేసింది #mystory204

ఆ రాత్రి తను చాలా టెంప్ట్ చేసింది. తట్టుకోలేకపోయాను. నా షర్ట్ బటన్స్ విప్పేసింది. తన టాప్ తీసేసింది. కమిట్ అయిపోయాను. అలా ఎన్ని సార్లు కలిశామో మాకే తెలియదు. నిజమైన ప్రేమంటే ఇదేరా అనేది నందు. #mystory

|

ప్రేమలో ఎప్పడూ మగవారే మోసం చేస్తుంటారని అనుకుంటారు. కానీ అమ్మాయిలు కూడా నమ్మించి గొంతుకోస్తారని తనను ప్రేమించాకే తెలిసింది. మా ఊరి సర్పంచ్ అంటే మా ఫ్యామిలీ మొత్తానికి బాగా అభినమానం. మా అమ్మ నాన్న కూడా మా ఊరి సర్పంచ్ కుటుంబానికి చాలా మర్యాద ఇస్తారు.

మా నాన్న ఆయన దగ్గరే పని చేస్తారు. ఇద్దరూ చిన్నప్పటి నుంచి మిత్రులు. సర్పంచ్ కు కాస్త డబ్బు ఉంది. ఊరిలో ఆయనకు అంత పలుకుబడి లేదు. కానీ మా నాన్న ఆయన స్నేహితుడు కావడం వల్ల ఆయనకు అందరూ గౌరవం ఇస్తారు.

సర్పంచ్ అంకుల్ వాలింట్లోనే పెరిగాను

సర్పంచ్ అంకుల్ వాలింట్లోనే పెరిగాను

మా సర్పంచ్ చేయని అక్రమాలు అంటూ లేవు. వాటిని నాన్న ఎంత కట్టడి చేయాలని చూసినా ఆయనకు తెలియకుండానే అవన్నీ చేసేస్తుంటాడు సర్పంచ్. నాకు ఈ విషయాలు ముందుగా తెలియవు. నేను చిన్నప్పటి నుంచి సర్పంచ్ అంకుల్ వాలింట్లోనే పెరిగాను.

ఒకే ఒక కూతురు ఉంది

ఒకే ఒక కూతురు ఉంది

సర్పంచ్ కు ఒకే ఒక కూతురు ఉంది. తను పేరు నందిని. ముద్దుగా నందు అంటారంతా. నందు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. కానీ తమకు డబ్బు ఉందని కాస్త గర్వం ఎక్కువ. నందు ఎక్కడెక్కడికి వెళ్లాలన్నా నేను వెంటుండేవాణ్ని. తనను వాళ్ల నాన్న అస్సలు బయటకు పంపించేవాడు కాదు.

నందును నాతో ఎక్కడికైనా పంపేవారు

నందును నాతో ఎక్కడికైనా పంపేవారు

నందు చిన్నప్పటి నుంచి సిటీలోనే చదువుకుంది. సిటీలో వాళ్ల మామయ్య వాళ్లింట్లోనే ఉండేది. వేసవి సెలవులకు మాత్రమే నందు ఇంటికొచ్చేది. తను వచ్చిందంటే నాకు చాలా సంతోషం. వెంటనే నాకు కబురొచ్చేది. క్షణాల్లో వెళ్లి వాలింట్లో ఉండేవాణ్ని. ఇక నేను పక్కన ఉన్నానంటే నందును ఎక్కడికైనా పంపేవారు.

బెడ్రూమ్ లోకి పైప్ పట్టుకుని పాకుకుంటూ వెళ్లేవాణ్ని

బెడ్రూమ్ లోకి పైప్ పట్టుకుని పాకుకుంటూ వెళ్లేవాణ్ని

ఇద్దరం రోజంతా పొలాల గట్లపైన తిరుగుతూ బావిలో ఈతపడుతూ గడిపేటోళ్లం. రాత్రి అయ్యాక నేను ఇంటికి వెళ్తుంటే నందు బాధపడేది. కొన్నిసార్లు రాత్రి పూట నన్ను ఇంటికి రమ్మనేది. తన బెడ్రూమ్ లోకి పైప్ పట్టుకుని పాకుకుంటూ వెళ్లేవాణ్ని. తర్వాత సైకిల్ పై ఇద్దరం పక్క ఊరిలో సినిమాకు వెళ్లేవాళ్లం. తను సినిమా హల్లో గుర్తు పట్టకుండా నా ఫ్యాంట్, షర్ట్ వేసుకునేది.

నందు పెద్ద మనిషి అయినప్పుడు

నందు పెద్ద మనిషి అయినప్పుడు

అలా చాలాసార్లు చేశాం. కానీ ఒక్కసారి కూడా ఎవ్వరికీ దొరకలేదు. నేను పక్కన ఉన్నానంటే తను చాలా హ్యాపీగా ఫీలయ్యేది. నువ్వు నా పక్కనుంటే చాలు.. నాకు ఎలాంటి సమస్య రాదు అనేది. నందు పెద్ద మనిషి అయినప్పుడు పెద్ద ఫంక్షన్ చేశారు. అప్పుడు నన్ను నందును కొన్ని రోజుల చూడనివ్వలేదు. తర్వాత నందును కలిశాను. చాలా సంతోషపడింది.

నందు నన్ను ఒక హీరోలా చూసేది

నందు నన్ను ఒక హీరోలా చూసేది

నందు సిటీలో కాలేజీలో చేరింది. ఒకసారి కాలేజీలో ఎవరో నందును ర్యాంగింగ్ చేశారు. సర్పంచ్ అంకుల్ మాకు చెప్పడంతో ఊరి నుంచి ఒక పెద్ద గ్యాంగ్ తో బైక్ లపై వెళ్లి డంకీ ఇచ్చొచ్చాం. నందుకు ఆ రోజు నేను ఒక హీరోలాగా కనపడ్డాను. నేను చదివింది తక్కువే. కానీ నందు నన్ను ఒక హీరోలా చూసేది. కాలేజీలో జాయిన్ అయ్యాక నందు బాగా ఫ్యాషన్ బుల్ గా తయారైంది.

హీరోయిన్ లా ఉంటుంది

హీరోయిన్ లా ఉంటుంది

తనను అలా చూసేసరికి నేను షాక్ తిన్నా. చిన్నప్పటి నందుకు తనకు చాలా తేడా ఉంది. సిగరెట్స్, మందు తాగడం నేర్చుకుంది. మగరాయుడిలా తయారైంది. చూడడానికి సినిమా హీరోయిన్ లా ఉంటుంది కానీ అలవాట్లు చాలా మారాయి. అయినా నన్ను అభిమానించడం మాత్రం మారలేదు.

సిగరెట్ తాగి నాకిచ్చింది

సిగరెట్ తాగి నాకిచ్చింది

ఒక రోజు రాత్రి ఇంటికి రమ్మంది. అందరూ పడుకున్నాక ఇంటికెళ్లాను. ఒక వైన్ బాటిల్, సిగరెట్ ఫ్యాక్, లైటర్, గ్లాస్ లు తీసుకుని బ్యాగ్ లో వేసుకుంది. వాళ్ల పొలంలో బావి దగ్గర ఒక గది ఉంది. అందులో సిట్టింగ్ వేశాం. నేను మందుతాగుతాను కానీ సిగరెట్స్ నాకు అలవాటు లేదు. తను కాస్త సిగరెట్ తాగి నాకిచ్చింది. తన చెప్పిన మాటను నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కాదనలేదు. అందుకే తాగాను.

మనం ఇద్దరం ఎందుకు ప్రేమించుకోవడం లేదు

మనం ఇద్దరం ఎందుకు ప్రేమించుకోవడం లేదు

అవును.. నువ్వు ఎందుకు నన్ను ఇష్టపడడం లేదు అని అంది. అలా అంటావేంటి నందు నువ్వు నా ప్రాణం అన్నాను. అంటే అలా కాదు.. మనం ఇద్దరం ఎందుకు ప్రేమించుకోవడం లేదు.. ఇంత ఏజ్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ గానే ఎందుకున్నాం అంది. అప్పటి వరకు నాకు బల్బ్ వెలగలేదు.

నువ్వు సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తున్నావంటే

నువ్వు సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తున్నావంటే

తర్వాత తను నా దగ్గరకు వచ్చింది. సిటీలో కూడా ఎవ్వడూ నీ అంత అందంగా ఉండడు.. విలేజ్ లో ఉండే నువ్వు సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తున్నావంటే నువ్వు గ్రేట్ రా అంది. నువ్వు నన్ను అమ్మాయిగారి మాదిరిగానే చూస్తున్నావ్.. కానీ నాకు నువ్వుంటే చాలా మోజు అంది. అప్పటి వరకు నేను నందు నోటి నుంచి అలాంటి మాటలు అస్సలు వినలేదు.

అది తప్పుకదా అమ్మగారు.. తప్పేంట్రా?

అది తప్పుకదా అమ్మగారు.. తప్పేంట్రా?

నేనే వెనుకబడి ఉన్నాననుకున్నాను. అయినా అలా మాట్లాడడం తప్పుకదా అమ్మగారు అన్నాను. తప్పేంట్రా.. నువ్వు నేను ప్రేమించుకుందాం.. పెళ్లి చేసుకుందాం అంది. జీవితాంతం హ్యాపీగా ఉంటాం అంది. నందు అలా చెప్పేసరికి నా గుండెలో గంటలు మోగాయి. నందు నాకు చాలా ఇష్టం. తనకోసం నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎన్నో పనులు చేశాను.

టెంప్ట్ చేసింది తట్టుకోలేకపోయాను

టెంప్ట్ చేసింది తట్టుకోలేకపోయాను

ఆ రాత్రి తను చాలా టెంప్ట్ చేసింది. తట్టుకోలేకపోయాను. నా షర్ట్ బటన్స్ విప్పేసింది. తన టాప్ తీసేసింది. కమిట్ అయిపోయాను. అలా ఎన్ని సార్లు కలిశామో మాకే తెలియదు. నిజమైన ప్రేమంటే ఇదేరా అనేది నందు. ఇద్దరం శారీరకంగా కలిస్తే జీవితాంతం కలిసి ఉంటాం అనేది. మేమిద్దరం బైక్ లపై చక్కర్లు కొడుతూ కొన్ని వేల లిప్ టు లిప్ కిస్ లు పెట్టుకున్నాం. రాత్రి పూట పొలాల గట్లపై, తన బెడ్రూమ్ లో, బావి దగ్గరి రూమ్ వద్ద ఎన్నిసార్లు తనతో శారీరకంగా కలిశానో నాకు గుర్తు లేదు.

ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది

ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది

నా పెళ్లాం మాదిరిగా నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేది. పెళ్లి కాకుండానే ఏడాది పాటు సంసారం చేశాం. చివరకు ఒక రోజు సర్పంచ్ అంకుల్ కు తెలిసింది. పెద్ద గొడవైంది. మా ఇంటిపై దాడి కూడా చేశారు. నన్ను కొన్నాళ్లు మా వాళ్లు ఊరికి దూరంగా ఉంచారు. సడన్ గా నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది.

బెడ్రూమ్ కు వెళ్లాను

బెడ్రూమ్ కు వెళ్లాను

వచ్చేసరికి నందినికి పెళ్లయ్యింది. నందిని ఏడుస్తూ ఉంది. ప్లీజ్ నా కోసం నువ్వు ఏమి చేసుకోకు. నేను తిరిగి వస్తాను. నేను ఎప్పటికీ నీదాన్నే అంది. వేచి చూశాను. పిచ్చోన్ని అయిపోయాను. నందిని ఏడాది తర్వాత ఊరికి వచ్చింది. మరుసటి రోజూ ఎవ్వరికీ తెలియకుండా తన బెడ్రూమ్ కు వెళ్లాను. నందిని ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది.

మోజు ఉండేది. తీర్చుకున్నా

మోజు ఉండేది. తీర్చుకున్నా

"వాడితో పెళ్లికాక ముందు ఎంజాయ్ చేశా. అప్పుడు వాడంటే మోజు ఉండేది. తీర్చుకున్నా. వాడు గుడ్డిగా నమ్మాడు. నా రేంజ్ ఏంది... నేను ఏంది. నేను వాణ్ని ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నాడు. వాణ్ని వాడుకున్నన్నీ రోజులు వాడుకుని వదిలేశా" అంటూ ఫోన్ లో మాట్లాడుతోంది. తర్వాత నన్ను చూసింది. ఆ విషయంపై నిలదీస్తే అవును.. నీలాంటోడ్ని నేను అందుకోసం యూజ్ చేసుకుంటా గానీ పెళ్లి చేసుకుని జీవితాంతం నీతోనే ఎలా పడుకుంటాననుకున్నావ్ అంది.

నా ప్రాణం సగం చచ్చిపోయింది

నా ప్రాణం సగం చచ్చిపోయింది

ఆ మాటలు విని గుండె ఆగినంత పనయ్యింది. అంటే పెళ్లి కూడా నీకు ఇష్టం ఉండే చేసుకున్నావా అంటే అవునంది. తను మాట్లాడిని మాటలకు నా ప్రాణం సగం చచ్చిపోయింది. ఇప్పుడు అమ్మాయిలు అంటనే నాకు అసహ్యం వేస్తోంది. నిజాయితీగా ప్రేమిస్తే కాలం లేదు అనుకున్నా. అందరికీ దూరంగా అజ్ఞాతంలో ఉన్నా.

English summary

She made me believe that I am the one for her Then Cheated On Me

She made me believe that I am the one for her Then Cheated On Me
Desktop Bottom Promotion