Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
ముగ్గురమ్మాయిలు రూమ్ కు పిలిపించుకున్నారు, రాత్రంతా గడుపుతామన్నారు,సోషల్ మీడియాలో పరిచయం #mystory343
వాళ్లు ఒప్పుకుంటారా అని అడిగాను. ఎందుకు ఒప్పుకోరు.. నేను ఒప్పిస్తాను అంది. ఇక ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఉదయమే రెడీ అయి సిటీకి బయల్దేరాను. తను సాయంత్రం రమ్మని చెప్పడంతో కరెక్ట్ ఆ టైమ్ కు తను చెప్
నాకు మొదట సోషల్ మీడియా అంటేనే తెలియదు. అందులోని రకరకాల యాప్ ల గురించి అసలే తెలియదు. నేను ఇంటర్ తర్వాత చదువు మానేసి ఇంటి దగ్గరే ఉండి మా పొలం పనులు చూసుకుంటూ ఉంటున్నాను. ఎప్పుడైనా బోర్ కొడితే ఫోన్ లో నెట్ ఆన్ చేసి యూట్యూబ్ లో ట్రెండింగ్ వీడియోస్ చూసేవాణ్ని. లేదంటే నాకు నచ్చిన పాటలు వింటూ ఉండేవాణ్ని.
కానీ నా ఫ్రెండ్స్ చాలా మంది నెట్ లో ఏవేవో చేసేవాళ్లు. ఒక్కసారి వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని వెళ్లాను. ఒకరేమో నెట్ లో గేమ్స్ ఆడేవాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుకుంటూ గేమ్ ఆడేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావురా అంటే హైదరాబాద్ లో నా ఫ్రెండ్ ఉంటాడు.. వాడితో కలిసి నెట్ లో గేమ్ ఆడుతున్నా అని చెప్పాడు. నేను షాక్ అయ్యాను.

హైదరాబాద్ లో ఉండేవాడితో
నిజమాబాద్ లో ఉండేవాడు హైదరాబాద్ లో ఉండేవాడితో కలిసి ఎలా గేమ్ ఆడుతున్నాడబ్బా అనుకున్నాను. ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోయాను. నువ్వు దీనికే షాక్ అయితే నీకు ఇంకా చాలా చూపిస్తా అని తను నాకు ఫోన్ లో అన్నీ ఆప్స్ డౌన్ లోడ్ చేసిచ్చాడు.

అమ్మాయిలంతా లైక్ చేసేవారు
అవన్నీ ఏమిటో కూడా తెలియదు. అందులో ఒకయాప్ కు ఏదో గ్రామ్ అని లాస్ట్ అక్షరాలుంటాయి. ఆ యాప్ నాకు భలే నచ్చింది. నేను ఫొటోలు దిగి అప్ లోడ్ చేస్తే చాలు చాలా మంది అమ్మాయిలు లైక్ లు కొట్టేవారు.

బానిస అయిపోయాను
రానురాను నేను ఆ యాప్ కు బానిస అయిపోయాను. ఒక్కరోజు యాప్ ఓపెన్ చేయకుంటే చాలు సతమతం అయిపోవాణ్ని. ప్రపంచం ఏమైపోతుందో అన్నట్లుగా ఆందోళన చెందేవాణ్ని. ఒక్కోసారి రాత్రంతా నిద్రపోకుండా సోషల్ మీడియాలోనే గడిపేవాణ్ని.

అమ్మాయిలతో పరిచయం
అంతలా నాకు పిచ్చిపట్టుకుంది. ఈ క్రమంలో నాకు కొందరు అమ్మాయిలు సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. వారంతా కూడా ఒక ఉమెన్స్ హాస్టల్ లో ఉంటారు. వాళ్ల ఫొటోలకు నేను రోజూ కామెంట్స్ పెట్టేవాణ్ని.

ముగ్గురమ్మాయిలతో చాటింగ్
వాళ్లు ఏం పోస్ట్ చేసినా సరే సూపర్బ్ అంటూ మెచ్చుకునేవాణ్ని. క్రమంగా వాళ్లతో రోజూ చాటింగ్ చేయడం మొదలుపెట్టాను. ఒకేసారి ముగ్గురు అమ్మాయిలు నాతో చాట్ చేసేవారు. నేను నా ఫొటోలు పంపితే వాళ్లు కూడా ఫొటోలు పంపేవారు.

అందరికీ ఐ లవ్ యూ చెప్పా
అమ్మాయిలు నేను ఏది అడిగినా కాదు అనరని అనుకునేవాణ్ని. అందుకే వాళ్లతో ఎలా అంటే అలా మెసేజెస్ చేసేవాణ్ని. మొదట ఒక అమ్మాయికి ఐలవ్ యూ చెప్పాను. తను నో చెప్పింది. సరే అని మరో అమ్మాయికి చెప్పాను. తను కూడా నో అంది. మూడో అమ్మాయికి అలాగే మెసేజ్ చేశాను. తను కాస్త టైమ్ కావాలంది.

ముగ్గురితో గడపాలని ఉంది
సరే వెయిట్ చేస్తాను అని చెప్పాను. తర్వాత తనని మరో మాట అడిగాను. నీతో పాటు మిగతా నీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా.. మీ ముగ్గురితో రాత్రంతా నాకు గడపాలని ఉంది అన్నాను. అలాగా దానికేముంది ఒక రోజు రాత్రి హాస్టల్ కు రా..గడుపుదువులే అంది.

నేను ఒప్పిస్తాను అంది
వాళ్లు ఒప్పుకుంటారా అని అడిగాను. ఎందుకు ఒప్పుకోరు.. నేను ఒప్పిస్తాను అంది. ఇక ఆ రోజు నా ఆనందానికి అవధుల్లేవు. ఉదయమే రెడీ అయి సిటీకి బయల్దేరాను. తను సాయంత్రం రమ్మని చెప్పడంతో కరెక్ట్ ఆ టైమ్ కు తను చెప్పిన అడ్రస్ కు గంపెడాశలతో వెళ్లాను.

తిట్టని తిట్టు తిట్టకుండా..
సాయంత్రం నేను తను ఇచ్చిన అడ్రస్ కు వెళ్లాను. లోపలకి రమ్మంది.. ఆనందంతో స్టెప్స్ వేస్తూ లోపలికి వెళ్లాను. అంతే. నన్ను తిట్టని తిట్టు తిట్టకుండా.. కొట్టని చోట కొట్టకుండా కొట్టారు. అక్కడ ఎవరెవరున్నారని ముఖాలు చూసేంత టైమ్ కూడా నాకు లేకుండా చేశారు.

ఎవ్వరికీ చెప్పుకోలేదు
పోలీస్ కంప్లైట్ ఇచ్చి లోపల పెట్టిస్తాం అన్నారు. వెంటనే బస్ ఎక్కి మా ఊరికి వచ్చేశాను. నాకు జరిగిన ఈ అవమానాన్ని ఎవ్వరికీ చెప్పుకోలేదు. రోజూ పొలం దగ్గర హ్యాపీగా పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేసే నేను సోషల్ మీడియాకు అలవాటు కావడంతో చివరకు తన్నులు తినాల్సి వచ్చింది.

మోసపోకండి
సోషల్ మీడియాను మంచికి ఉపయోగించుకుంటే చాలా మేలు చేస్తుంది. దాన్ని మరోరకంగా ఉపయోగించుకుంటే దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్ నాలా మీరు ఎవ్వరూ మోసపోకూడదని కోరుకుంటున్నాను.

జీవితాలను నాశనం చేసుకోకండి
ముక్కు మొహం తెలియని వారితో సోషల్ మీడియాలో గంటల తరబడి చాటింగ్ చేస్తూ మీ జీవితాలను నాశనం చేసుకోకండి. అదే సమయాన్ని మీ కెరీర్ పై పెడితే మీ లైఫ్ మరోలా ఉంటుంది. సోషల్ మీడియా భూతానికి దూరంగా ఉండండి.



Click it and Unblock the Notifications
