For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రోజు ఇద్దరం ఏకాంత సేవలో తేలిపోయాం, కానీ నేను నమ్మే మగాడంటే వాడే #mystory195

బీటెక్ నాలుగేళ్లు ఎంతో ఆనందంగా గడపాలనుకున్నాం. మేమిద్దరం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. కానీ ఫస్ట్ ఇయర్ లోనే మేమిద్దరం దారి తప్పాం. ఇద్దరం ప్రేమలో పడ్డాం. నేను నమ్మే మగాడంటే వాడే #mystory195

|

వాడు నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. మేమిద్దరం ఒకే పాఠశాలలో చదువుకున్నాం. ఇద్దరిదీ ఒకే తరగతి. మేమిద్దరం ఎంతో బాగా మెలిగేవాళ్లం. ఎంతగా అంటే వాడి అంగీలు కూడా నేను వేసుకునేదాన్ని. ఎక్కడికైనా సరే మేమిద్దరమే వెళ్లేవాళ్లం. వాడి పేరు నిరంజన్. వాడి పేరులోని అక్షరాలు కలిసేటట్లుగానే నా పేరు కూడా ఉండేది. నా పేరు నీరజ.

ఒకే కాలేజీలో జాయిన్ అవుదామనుకున్నాం

ఒకే కాలేజీలో జాయిన్ అవుదామనుకున్నాం

బీటెక్ లో ఇద్దరం ఒకే కాలేజీలో జాయిన్ అవుదామనుకున్నాం. కానీ నిరంజన్ వాళ్ల ఇంట్లో మాత్రం అతన్ని కర్నూల్ లో జాయిన్ చేస్తామన్నారు. మా ఇంట్లో వాళ్లేమో నన్ను హైదరాబాద్ లో జాయిన్ చేస్తామన్నారు. అయితే వాడికి ఆ విషయం తెలిసింది. ఫస్ట్ వాళ్ల నాన్నను హైదరాబాద్ లో జాయిన్ అవుతాను అని అడిగాడు. ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్ల ఇంట్లో నానా రచ్చ చేశాడు.

డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకున్నాం

డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకున్నాం

మొత్తానికి హైదరాబాద్ లో నేను చేరిన కాలేజీలోనే వాడు జాయిన్ అయ్యాడు. తర్వాత నేను హాస్టల్ జాయినయ్యాను. కానీ అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. వాడు మాత్రం పట్టుబట్టీ ఇద్దరం ఒక రూమ్ లోనే ఉందామన్నాడు. తర్వాత ఇద్దరం ఒక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకున్నాం. అందులోనే ఇద్దరం ఉండడం స్టార్ట్ చేశాం. ఈ విషయం మా ఇంట్లో వాళ్లకు తెలియదు.

చదువులపైన కన్నా వాటిపైనే ధ్యాస

చదువులపైన కన్నా వాటిపైనే ధ్యాస

అలా బీటెక్ నాలుగేళ్లు ఎంతో ఆనందంగా గడపాలనుకున్నాం. మేమిద్దరం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. కానీ ఫస్ట్ ఇయర్ లోనే మేమిద్దరం దారి తప్పాం. ఇద్దరం ప్రేమలో పడ్డాం. చదువులపైన కన్నా ఎక్కువగా ఇతర అంశాలపై ధ్యాస పెట్టాం. ఫస్ట్ ఇయర్ లో మా రిజల్ట్స్ పూర్తిగా తగ్గిపోయాయి.

ఇద్దరి గురించి నానా రకాలుగా మాట్లాడారు

ఇద్దరి గురించి నానా రకాలుగా మాట్లాడారు

నిరంజ్ వాళ్ల ఇంట్లో వాళ్లని అడిగి ఎఫ్ జెడ్ బైక్ కొన్నాడు. తర్వాత ఇద్దరం దానిపైనే చక్కర్లు కొట్టేవాళ్లం. మా ఇద్దరి జీవితాలు ఎటు వెళ్తున్నాయో కూడా అర్థమయ్యేవి కావు. మా ఇద్దరి గురించి ఫ్రెండ్స్ మొత్తానికి తెలిసింది. అందరూ నానా రకంగా మాట్లాడారు. ఇద్దరిపై అభాండాలు వేశారు. నిజంగా మేము ఏ తప్పు చేయకముందే మమ్మల్ని లోకం మరోలా చూసింది.

శారీరకంగా కలిశాం

శారీరకంగా కలిశాం

అందుకే అందరూ అనుకుంటున్న ఆ తప్పు చేసేద్దామనుకున్నాం. ఒక రోజు మేమిద్దరం శారీరకంగా కలిశాం. నిరంజన్ కచ్చితంగా నన్ను బాగా చూసుకుంటాడనే నమ్మకంతోనే నేను అతనికి సర్వం సమర్పించాను. తర్వాత భయం వేసింది. మా ఇద్దరి మధ్య అది జరిగాక అతను నన్ను ఎక్కడ వదిలేసి వెళ్తాడోనన్న భయం కలిగింది.

వాణ్ని కాకుండా మరొకర్ని నేను ఊహించుకోలేను

వాణ్ని కాకుండా మరొకర్ని నేను ఊహించుకోలేను

వెంటనే పెళ్లి చేసుకుందామన్నాను. కానీ చదువు పూర్తయి జాబ్ దొరికాక చేసుకుందామన్నాడు. మా ఇద్దరి విషయం మా ఇళ్లలో తెలిసింది. ఇద్దరినీ కొట్టి వేర్వురుగా పెట్టారు. నన్ను కర్నూలులోని కాలేజీలో జాయిన్ చేశారు. కానీ నాకు మాత్రం నిరంజన్ అంటే ప్రాణం. వాణ్ని కాకుండా నా జీవితంలో మరొకర్ని నేను ఊహించుకోలేను. అలా జీవించలేను. ఉంటే వాడితో.. లేదంటే ఈ లోకాన్నే వదిలి వెళ్లాలనుకున్నాను.

ఇద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం

ఇద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం

బీటెక్ అయిపోయింది. ఇద్దరికీ మంచి ర్యాంకులు వచ్చాయి. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లోనే జాబ్స్ వచ్చాయి. తర్వాత మా ఇద్దరి ఇళ్లలో మా పెళ్లి గురించి మాట్లాడాం. ఒప్పుకోలేదు. నిరంజన్, నేను ఇద్దరం రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం. మా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది.

అసలైన మగోడు.. మగాడు

అసలైన మగోడు.. మగాడు

నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త నిరంజన్ అసలైన మగోడు.. మగాడు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు వాడుకుని వదిలేస్తారనుకుంటారు. కానీ నిరంజన్ లాంటి మగాళ్లు కూడా ఉంటారు. మగతనం అనేది... అవతలి వ్యక్తి మనపై పెట్టుకున్న భరోసాను నిలిపేదిగా ఉండాలి. అదే నా దృష్టిలో అసలైన మగతనం.

English summary

the first man to influence my life is no doubt my husband,ఆ రోజు ఇద్దరం ఏకాంత సేవలో తేలిపోయాం, కానీ నేను నమ్మే మగాడంటే వాడే #mystory195

the first man to influence my life is no doubt my husband
Story first published:Friday, July 13, 2018, 13:08 [IST]
Desktop Bottom Promotion