For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలిసి ప్రయాణించే జంటలకు చిట్కాలు

|

ఒకరి శరీరం లో మరొకరి ఆత్మ ఉండునట్లుగా, ఇద్దరమూ లోతైన ఆత్మబంధాన్ని కలిగి ఉందాం :

మీ భాగస్వామితో చేయు ప్రయాణాలు ఒక్కోసారి మంచి జ్ఞాపకాలను ఇస్తే , ఒక్కోసారి ప్రశ్నార్ధకంగా కనిపిస్తాయి. కావున కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా ఆ ప్రయాణాన్ని ఉన్నతంగా మలచుకోవచ్చు.

ప్రేమలో కావొచ్చు, పెళ్ళైన తర్వాత కావొచ్చు ఒక్కోసారి భాగస్వామి తో కలిసి చేస్తున్న ప్రయాణాలు మరిచిపోలేని మధుర జ్ఞాపకాలని ఇస్తూ, జీవితాంతం సంబంధం సంతోషంగా కొనసాగేలా చేస్తుంది, కానీ ఒక్కోసారి ఆ ప్రయాణమే మీ సంబంధానికి చివరి మజిలీ కావొచ్చు.

ఒక ప్రయాణం మనిషిలోని పలు కోణాలను బయటకి తీయగలదు. ఒకరి గురించి పూర్తిగా తెలియాలి అంటే , వారితో కలిసి ఒక ప్రయాణం చేయాలని కూడా చెప్పబడినది. ప్రయాణం, ప్రజల సంస్కరణలను వడపోసి నిజమైన స్వభావాన్ని చూపిస్తుంది. ప్రయాణం మీలోని అనేక కోణాలను వెలికి తీయగలదు, తద్వారా మీ స్వభావాన్ని తెరచిన పుస్తకం చేయగలదు అని మరచిపోకండి.

Tips For Couples Traveling Together

కావున , ఇక్కడ మీరు మీ భాగస్వామి తో ఒక మంచి ప్రయాణం చేయాలని భావిస్తే ఈ చిట్కాలను పాటించండి.

1. మొదటి పర్యటన చిన్నది కావాలి:

1. మొదటి పర్యటన చిన్నది కావాలి:

మొదటి పర్యటనలో, గ్రీస్కు వెళ్లడం వలన 'n' సంఖ్యలో సమస్యలు పెరగడమే తప్ప ప్రయోజనం ఉండదు. ప్రయాణం ఏదైనా చిన్నదిగా ప్రారంభించండి. చిన్న పర్యటనలు ఉంటే ప్రయాణ ప్రారంభంలో సరదాగా ఉంటుంది. చిన్నపర్యటనలు మీ మద్య ఒక సర్దుబాటుతనాన్ని , అర్ధం చేసుకునే విధానాన్ని పెంపొందిస్తుంది. తద్వారా పెద్ద పర్యటనలకు అనువుగా మీ మద్య సంబంధం తయారవుతుంది. ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి ఎల్లప్పుడూ చిన్న ప్రయాణాలనే ఎంచుకోండి. అలాగని మరీ చిన్నవి కాదండోయ్.

2. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు:

2. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవద్దు:

మీ పర్యటనను తక్కువ అంచనాలతో ప్రణాళిక చేసుకోండి, మెరుగైన సమయాన్ని పొందడం మరియు పర్యటనలలో నిరాడంబరంగా ఉండటం వంటి వాటిని అధిగమించడానికి మీ ఆలోచనలు సహకరించగలగాలి. ఇది ప్రయాణ సమయంలో ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది మరియు ప్రయాణాన్నిఅందమైన జ్ఞాపకాలతో సుఖాంతం చేస్తుంది. జంట మద్య సంబంధం మరింత బలపడుతుంది.

3. ప్యాకింగ్ స్పేస్ వినియోగించుకోండి:

3. ప్యాకింగ్ స్పేస్ వినియోగించుకోండి:

వస్తువులు సర్ధుకునే విషయాల్లో ఒకరిపట్ల ఒకరు మర్యాద పూర్వకంగా మరియు ఇష్టపూర్వకంగా మెలుగవలసి ఉంటుంది. ఎక్కువ సామాగ్రి మీదే ఉండునట్లు చూసుకోకుండా, మీ బాగ్స్ లో వారికి కూడా కొంత స్పేస్ ఇవ్వడం చేయండి. దీనిలో మీరు వారిపై చూపుతున్న కేరింగ్ బయటపడుతుంది. ఇద్దరికీ సమాన హక్కులున్నాయని మనసులో అనుకోవడం కాదు, అలా నడుచుకోవడానికి కూడా ప్రయత్నించాలి. అవసరమైతే , కొన్ని త్యాగాలు కూడా తప్పవు మరి. సరైన అవగాహన లేకుండా ప్రవర్తిస్తే, ప్రయాణంలో ఘర్షణలే మిగులుతాయి.

4. భాగస్వామ్యం బాధ్యత:

4. భాగస్వామ్యం బాధ్యత:

ప్రయాణంలో అతి ముఖ్యమైనది , ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుని ఉండుట. వారి యొక్క బలాలు, బలహీనతలు రెండూ అవగాహనలో ఉండాలి. బలహీనతలను ఎత్తి చూపకుండా, భాద్యతగా నడుచుకోవడం ద్వారా మీ ప్రవర్తన ఎలాంటిదో మీ భాగస్వామికి పూర్తిగా అర్ధమవుతుంది. మరియు మీరు ప్రతి విషయంలోనూ భాగస్వామ్యాన్ని ప్రదర్శించాలి. అనగా మొబైల్ మాప్స్ ద్వారా దారి కనుక్కోవడం ఒకరి వంతు అయితే , మరొకరు స్థానిక స్థలాలను పరిశోధించడానికి పూనుకోవాలి. ఇలా భాద్యతలను పంచుకోవడం ద్వారా సంబంధాలు మెరుగుపడుతాయి.

5.మీ ఖర్చులను నిర్వహించండి:

5.మీ ఖర్చులను నిర్వహించండి:

ప్రయాణించే ముందు బడ్జెట్లో ఖర్చులు మరియు ప్రణాళిక గురించి చర్చ జరుపుకోవడం మంచిది, తద్వారా డబ్బుకు సంబంధించిన గొడవలు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ముఖ్యంగా ఒకరి పై ఒకరికి నమ్మకం ఉండాలి. ఈ డబ్బుని వినియోగించుటలోనే మీరేంటో సగం తెలిసిపోతుంది, కావున పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.

6. సహనం కలిగిఉండడం :

6. సహనం కలిగిఉండడం :

ప్రయాణం ఒక్కోసారి తీవ్ర పరిమాణాలకు దారితీసి ఇద్దరిమద్య అనేక విభేధాలు కూడా సృష్టించవచ్చు. కావున ఒకరి పట్ల ఒకరు సహనం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. మీ అసహనం కారణంగా పరిస్థితులు చేయి దాటిపోయేలా ప్రవర్తించవద్దు. ఒక్కోసారి చిన్ని విషయాలలోనే సహనం కోల్పోయేలా ప్రవర్తించి, పరిస్థితులు దాటిపోయాక భాధ పడే రోజులు వస్తుంటాయి. కావున ప్రయాణం గందరగోళంగా ఉండకూడదు అని భావిస్తే, ఖచ్చితంగా ఓర్పు సహనం ఉండాల్సిందే. తద్వారా ఆనందకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతారు.

7. పరిస్థితులకు అనుగుణంగా:

7. పరిస్థితులకు అనుగుణంగా:

ఒక జంటగా, మీరు ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ఒకరి కై ఒకరు ఎదురుచూసేలా ఉండాలని గుర్తుంచుకోవాలి. అలాంటి ప్రేమ మీదైతే , పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుని ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఏ సంఘటన అయినా కాలం మీద ఆధారపడి వస్తుంది, ఆయా సందర్భాలలో నడుచుకునే విధానమే వ్యక్తులను చదువగలిగే కొలమానం. ఈ విషయం మర్చిపోవద్దు.

8. యుద్దాలు చేయకండి, ఇది వార్ జోన్ కాదు

8. యుద్దాలు చేయకండి, ఇది వార్ జోన్ కాదు

కొంతమంది ప్రయాణాల్లో నిరాశ, నిస్పృహలను ప్రదర్శిస్తూ చిన్న, పెద్ద విషయాలతో సంబంధం లేకుండా ప్రతి అంశానికి కాలు దువ్వుతుంటారు. అనవసరమైన వ్యర్ధవాదనలతో కాలం వెళ్ళదీస్తుంటారు. కానీ మీ భాగస్వామికి ఒక మంచిరోజు బహుమతిగా ఇవ్వాలని మీ మనసులో ఉంటే, అలాంటి యుద్ద భావాలని అణిచివేయండి. లేనిచో నిరాశ, నిస్పృహలతో సంబంధం విచ్ఛిన్నమయ్యే అవకాశాలు లేకపోలేదు.

కావున ఈ అంశాలను మనసులో ఉంచుకుని ప్రయాణానికి సిద్దంకండి. ఒక్కోసారి చిన్నవిగా భావించిన అంశాలు కూడా పెద్ద పెద్ద ప్రశ్నలనే మిగులుస్తాయి. మీ ప్రయాణం ప్రశ్నార్ధకంగా మారకుండా చూసుకోండి. ఒక్కోసారి ప్రయాణాలు జీవితాన్ని సైతం మలుపులు తిప్పగలవు , అవి పూల మార్గమూ కావొచ్చు లేదా గతుకుల రోడ్డూ కావొచ్చు.

English summary

Tips For Couples Traveling Together

Couples who travel together, end up with a love that never stops pouring for each other. On the other hand, couples also end up losing each other while traveling, as coping with each other becomes extremely difficult. It is said, "when you really want to know someone, you must take a trip with them in order to know who they exactly are". Traveling removes the filter version of people and shows the true nature and this is because traveling takes you through a lot of processes.
Story first published:Friday, March 23, 2018, 13:05 [IST]
Desktop Bottom Promotion