For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వినయ్ ని టెంప్ట్ చేసేదాన్ని, ఏ అమ్మాయైనా రెచ్చగొడితే టచ్ అయినా చేయాలనిపిస్తుంది కదా #mystory194

వినయ్ ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అతన్ని నేను చాలా టెంప్ట్ చేసేదాన్ని. అయినా అస్సలు లెక్కచేసేవాడు కాదు. వినయ్ ని టెంప్ట్ చేసేదాన్ని, ఏ అమ్మాయైనా రెచ్చగొడితే టచ్ చేయాలనిపిస్తుంది #mystory194

|

నా పేరు అను. నేను లోకల్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తుంటా. మా ఛానల్ లో నాకు ఎవరూ స్క్రిప్ట్ రాసివ్వరు. అంతా నేనే ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి లవర్స్ డే అప్పుడు మొత్తం లవ్ రిలేటడ్ ప్రోగామ్స్ చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా నేను కొన్ని లవ్ స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పాను.

అవన్నీ నావే అన్నట్లుగా చెప్పాను

అవన్నీ నావే అన్నట్లుగా చెప్పాను

ఆ స్టోరీస్ కూడా మొత్తం నావే అన్నట్లుగా చెప్పాను. మాది లోకల్ ఛానల్ అయినా కూడా టీఆర్పీ ఒక రేంజ్ లో వచ్చింది. అదే వీడియోలను యూట్యూబ్ లో పెడితే వ్యూస్, కామెంట్స్ లెక్కలేనన్నీ వచ్చాయి. అలా నేను ఫేమస్ యాంకర్ అయిపోయాను. అయినా నేను ఇప్పటికీ అదే లోకల్ ఛానల్ లోనే పని చేస్తుంటాను.

ల‌వ్ సైన్ బుక్ దొరికింది

ల‌వ్ సైన్ బుక్ దొరికింది

ఒక రోజు నేను వైజాగ్ కి ట్రైన్ లో వెళ్తుంటే నాకు ల‌వ్ సైన్ బుక్ దొరికింది. ఆ బుక్ ఒక అబ్బాయిదని నాకు అర్థమైంది. కానీ అతను ట్రెయిన్‌లోనే మ‌ర‌చిపోయాడనుకుంటా. తర్వాత నేను ఆ పుస్తకాన్ని నా ఫ్రెండ్స్ కు ఇచ్చేశాను. నా బర్త్ డే రోజు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు.

నాకే గిఫ్ట్ గా ఇచ్చాడు

నాకే గిఫ్ట్ గా ఇచ్చాడు

ఓపెన్ చేసి చూస్తే అది లవ్ సైన్ బుక్. నేను గీతకు ఆ బుక్ ఇచ్చాను. గీత మధుకు ఇచ్చింది. మధు నా బర్త్ డేకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి తనకు తెలియకపోవడంతో మళ్లీ ఆ బుక్ ను నాకే గిఫ్ట్ గా ఇచ్చాడు.

పుస్త‌కంతో ఏదో రిలేష‌న్

పుస్త‌కంతో ఏదో రిలేష‌న్

ఇలా ఆ బుక్ నేను వద్దనుకున్నాగానీ నా ద‌గ్గ‌రికి మ‌ళ్లీ మళ్లీ చేరేది. నేను విధిని బ‌లంగా న‌మ్ముతాను. నాకు ఆ పుస్త‌కంతో ఏదో రిలేష‌న్ ఉంద‌ని న‌మ్మాను. ఆ పుస్త‌కం ఓపెన్ చేశాను. అందులో చివరలో ఒక ఫోటో ఉంది. కింద పేరు కూడా ఉంది. అతని పేరు వినయ్. చాలా హ్యాండ్ సమ్ గా కనిపించాడు ఫొటోలో.

నాలో ఏదో తెలియని కొత్త ఎనర్జీ

నాలో ఏదో తెలియని కొత్త ఎనర్జీ

వినయ్ ఫొటోను చూడ‌గానే నాలో ఏదో తెలియని కొత్త ఎనర్జీ వచ్చింది. ఇక ఆ రోజు అన్నీ నేను అనుకున్నట్లుగానే జరిగాయి. దాంతో నేను ప్రతిరోజు ఉదయమే ఆ బుక్ ఓపెన్ చేసి అందులో వినయ్ ఫొటో చూసేవాణ్ని.

ప్రతి పని జరిగిపోయేది

ప్రతి పని జరిగిపోయేది

నాకు బీటెక్ లో చాలా బ్యాక్ లాగ్స్ ఉండేవి. వాటన్నింటిలోనూ నేను పాసయ్యాను. నేను అప్ప‌టి వ‌ర‌కు పాస్ కానీ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయాను. నేను అనుకున్న ప్రతి పని జరిగిపోయేది. దాంతో వినయ్ నా ల‌క్కీ అని పర్సన్ అని బ‌లంగా న‌మ్మాను. అత‌న్ని చూడకుండానే అతని ప్రేమ‌లో ప‌డ్డాను.

ప్ర‌తిసారి క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించేదాన్ని

ప్ర‌తిసారి క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించేదాన్ని

ఒక రోజు నేను వినయ్ ని ప్రత్యక్షంగా చూశాను. నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నేను అత‌న్ని చూసిన ప్ర‌తిసారి క‌లుసుకోవాల‌ని ప్ర‌య‌త్నించేదాన్ని. కానీ వినయ్ మిస్ అయ్యేవాడు. ఒకసారి నేను వినయ్ ని క‌లుసుకుని నాకు జ‌రిగిన అనుభ‌వాలు మొత్తం చెప్పి ఐ లవ్యూ చెప్పాను. నేను కూడా చాలా అందంగా ఉంటాను.

కత్తిలాంటి అమ్మాయి ఐ లవ్యూ చెబితే

కత్తిలాంటి అమ్మాయి ఐ లవ్యూ చెబితే

నాలాంటి కత్తిలాంటి అమ్మాయి ఐ లవ్యూ చెబితే ఏ అబ్బాయి అయినా ఒప్పుకుంటాడని నా ధీమా. కానీ వినయ్ నా ప్రేమను ఒప్పుకోలేదు. నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. కానీ వినయ్ దానికి పూర్తి భిన్నం. ఇద్దరం అప్పుడప్పుడు కాఫీ షాప్ లలో కలిసేవాళ్లం. వినయ్ ని పెళ్లి చేసుకుంటే నా జీవితాంతం హ్యాపీగా ఉంటానని, నేను అనుకునే ప్రతి పని జరుగుతుందని నా నమ్మకం.

నీ జీవితం నాతోనే రాసిపెట్టి ఉంది

నీ జీవితం నాతోనే రాసిపెట్టి ఉంది

వినయ్ ఎంసీఏ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లే ప్ర‌య‌త్నాలు చేసేవాడు. కానీ వినయ్ ఏదో ఒక కారణంతో అమెరికా వెళ్లలేకపోయేవాడు. నీ జీవితం నాతోనే రాసిపెట్టి ఉందని అందుకే నువ్వు అమెరికా వెళ్లలేకపోతున్నావని నేను వినయ్ తో చెప్పేదాన్ని. కానీ అతను అస్సలు నా మాటలు నమ్మేవాడు కాదు.

చాలా టెంప్ట్ చేసేదాన్ని

చాలా టెంప్ట్ చేసేదాన్ని

వినయ్ ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని అతన్ని నేను చాలా టెంప్ట్ చేసేదాన్ని. అయినా అస్సలు లెక్కచేసేవాడు కాదు. ఏ అమ్మాయి అయినా అంతగా రెచ్చగొడితే కనీసం టచ్ అయినా చేయాలని అబ్బాయికి అనిపిస్తుంది కానీ తను మాత్రం నావైపు కూడా చూసేవాడు కాదు. కానీ నాతో మాట్లాడేవాడు.

అందంగా ఉంటావు... చాలా తెలివైన దానివి

అందంగా ఉంటావు... చాలా తెలివైన దానివి

అను నీకు నాకు సూట్ కాదు. నువ్వు అందంగా ఉంటావు... చాలా తెలివైన దానివి కానీ నీ మనసత్వం వేరు.. నా మనసత్వం వేరు.. మనం పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఇబ్బందులుపడాల్సి వస్తుందని చెప్పాడు. చివరకు వినయ్ కి మరో అమ్మాయితో పెళ్లి కుదిరింది. వినయ్ నాకు కూడా వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు. పెళ్లికి కచ్చితంగా రమ్మని చెప్పాడు.

నీ పెళ్లి నాతోనే జరగాలి

నీ పెళ్లి నాతోనే జరగాలి

చాలా బాధేసింది. ఆ రోజు ఉదయమే లవ్ సైన్ బుక్ తీసుకుని అందులో వినయ్ ఫొటో చూసి నీ పెళ్లి నాతోనే జరగాలి అని కోరుకున్నాను. తర్వాత పెళ్లికి రెడీ అయి వెళ్లాను. మరికొన్ని క్షణాల్లో వినయ్ కి పెళ్లి. నాకు మాత్రం గుండె నిండా దుఖం. కట్ చేస్తే పెళ్లి పీటలపై నేను కూర్చొన్నా. ఇదెలా సాధ్యం అయ్యిందని అనుకుంటున్నారా?

వినయ్ ని చాలా టెంప్ట్ చేసేదాన్ని, ఏ అమ్మాయి అయినా రెచ్చగొడితే టచ్ అయినా చేయాలనిపిస్తుంది కదా #mystory194

పెళ్లి కూతురు లేచిపోయిందటా! అందుకే వినయ్ తప్పని పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టాడు. ఇలా ఉంటుంది మరి.. విధి అంటే. అందుకే నేను విధినే నమ్ముతాను... రోజూ ఉదయం వినయ్ ని చూస్తాను. ఇప్పటికీ వినయ్ ని ఉదయమే చూస్తే నేను అనుకున్న పనులన్నీ పూర్తి అవుతుంటాయి.

English summary

we only get what is decided for us by the destiny

we only get what is decided for us by the destiny
Story first published:Tuesday, July 10, 2018, 12:05 [IST]
Desktop Bottom Promotion