For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రైల్ లో ఎవ్వరూ చేయని ఎంజాయ్ నేను ఆ అమ్మాయితో చేశాను - My Story #92

కిస్ చేస్తున్నప్పుడు బాగా సహకరించింది. రాత్రంతా తన బాడీలో ప్రతి పార్ట్ ని టచ్ చేశాను. ప్రతి పార్ట్ ని కిస్ చేశాను. అసలు ఆమెను ముద్దుపెట్టుకుంటుంటూ ప్రపంచాన్ని మొత్తం మరిచిపోయాను.

By Bharath
|

ఆ అమ్మాయి పేరు మాత్రమే తెలుసు. మిగతా వివరాలు ఏమి తెలియదు. కానీ ఆమెతో గడిపిన ఆ ఒక్కరోజును మాత్రం జీవితంలో ఎప్పటికీ మరిచిపోను. చూడగానే ఎవరినైనా ఆకట్టుకునే అందం ఆమె సొంతం. తనను మొదటిసారి చూసినప్పుడే ఫ్లాట్ అయిపోయాను.

భువనేశ్వర్ బయల్దేరాను

భువనేశ్వర్ బయల్దేరాను

నేను సికింద్రాబాద్ నుంచి ట్రైన్ లో భువనేశ్వర్ బయల్దేరాను. ముందే రిజర్వేషన్ చేయించుకున్నా కూడా నాకు టాప్ సీట్ దొరికింది. పైన పడుకునే బెడ్ దొరికింది. నాకు అపోజిట్ గా మరో సీటు ఉంది. ఆ బెడ్ ఖాళీగా ఉంది. కొద్ది సేపటి తర్వాత ఖాజీపేట జంక్షన్ వచ్చింది. అక్కడ ఒక అమ్మాయి ఎక్కింది.

ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడింది

ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడింది

లగేజీ మొత్తం కింద పెట్టేసింది. సీటు చాలా పైన ఉండడంతో ఎక్కడానికి కాస్త ఇబ్బంది పడింది. ట్రైన్ లో ఒక వరుసలో మూడు బెడ్స్ మరో వరుసలో మూడు బెడ్స్ ఉంటాయి కదా. అందులో మాది పై నుంచి ఫస్ట్ అన్నమాట.

హెల్ప్ చేశాను

హెల్ప్ చేశాను

తను పైకి ఎక్కడానికి నేనే హెల్ప్ చేశాను. సాయం చేశాను కదా నాతో బాగా మాట్లాడుతుందనుకున్నాను. కానీ అస్సలు మాట్లాడలేదు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు.

మేరే లియే

మేరే లియే

తర్వాత వరంగల్ స్టాప్ వచ్చింది. నేను కిందకు దిగి నీళ్ల బాటిల్ తెచ్చుకుందామనుకున్నాను. అప్పుడు ఆ అమ్మాయి మేరే లియే ఏక్ పానీ బాటిల్ లావో అంటూ పైసలు ఇచ్చింది.

మేరా నామ్ అమ్రిత

మేరా నామ్ అమ్రిత

తెలుగమ్మాయి కాదని అర్థం అయ్యింది. టీకే.. టీకే అంటూ పైసలు తీసుకుని పానీ బాటిల్ తీసుకుని ఇచ్చాను. ఆప్ కా నామ్ క్యా ( నీ పేరు ఏమిటి) అన్నాను. మేరా నామ్ అమ్రిత అంది. తర్వాత మా కన్వర్వేజన్ మొత్తం నాకు వచ్చిరాని హిందీలో ఆమెకు బాగా వచ్చే ఇంగ్లిష్ లో జరిగింది.

యూట్యూబ్ ఓపెన్ చేసి

యూట్యూబ్ ఓపెన్ చేసి

మీ కోసం తెలుగులో చెబుతున్నాను. మీది ఒడిశా అని అడిగాను. మాది వెస్ట్ బెంగాళ్ అయితే మేము భువనేశ్వర్ లో సెటిల్ అయ్యాం అంది. ఇంకా డిటేల్స్ అడిగిలోపే టాఫిక్ మార్చింది. మీ అయ్య ఏం చేస్తడు.. మీ అమ్మ ఏం చేస్తది అని అడుగుదామనుకున్నాను. కానీ అంతలోపే తను మొబైల్ లో యూట్యూబ్ ఓపెన్ చేసి ఒరియా సాంగ్స్ పెట్టుకుని వినడం స్టార్ట్ చేసింది.

రంగాబోతి.. రంగాబోతి

రంగాబోతి.. రంగాబోతి

ఏ రంగాబోతి.. రంగాబోతి అనే పాట పెట్టింది. నేను ఈ పాట విన్నాను. ఇది ఖుషీ సినిమాలో ఉంది అన్నాను. అయితే అది ఒరియా పాట అట. కొద్ది సేపు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. తన మొబైలో ఛార్జింగ్ అయిపోవడంతో నా మొబైల్ లో సాంగ్స్ పెట్టాను.

ఒకే బెడ్ పైకి మారాం

ఒకే బెడ్ పైకి మారాం

తర్వాత ఇద్దరం ఒకే బెడ్ పైకి మారాం. నా బెడ్ పై కూర్చొని తన చెవిలో ఒక ఇయర్ ఫోన్. నా చెవిలో ఇక ఇయర్ ఫోన్ పెట్టుకుని వింటున్నాం. అప్పుడు తను టచ్ అవుతుంటే ఆ చలికాలంలో నాలో వేడి పుడుతుంది.

చాలా పోష్ గా ఉంది

చాలా పోష్ గా ఉంది

అమ్మాయి చాలా పోష్ గా ఉంది. లూజ్ హెయిర్ తో.. బ్లాక్ టీ షర్ట్ వేసుకుని, జీన్స్ ప్యాంట్ వేసి నా మతి పోగొట్టింది. తన హెయిర్ నాకు టచ్ అవుతూ ఉంది. నాలో ఎక్కడలేని ఆనందం కలుగుతోంది.

ఆ పిల్ల మాత్రం పేరు తప్పా ఇంకేమి చెప్పలేదు

ఆ పిల్ల మాత్రం పేరు తప్పా ఇంకేమి చెప్పలేదు

ఆ పిల్ల మాత్రం పేరు తప్పా ఇంకేమి చెప్పలేదు. నేను ఏమన్నా అడుదామంటే యూట్యూబ్ లో ఏదో ఒక పాట పెట్టి అది చూడమని చెబుతుంది. తర్వాత వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మదిర స్టేషన్లు వచ్చాయి. అప్పుడప్పుడు ట్రైన్ లోకి వచ్చే టీ తాగుతూ, స్నాక్స్ తింటూ యూట్యూబ్ చూస్తూ ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం

విజయవాడ జంక్షన్

విజయవాడ జంక్షన్

ఆ తర్వాత విజయవాడ జంక్షన్ వచ్చింది. అక్కడ ట్రైన్ చాలా సేపు ఆగుతుంది. ఇద్దరం కిందకు దిగి ఫ్లాట్ ఫామ్ పై నిలబడి భోజనం చేశాం. అమ్రిత అంత వరకు నా పేరు కూడా అడగలేదు. విజయవాడలో నా పేరు అడిగింది. నా పేరు విష్ణు అని చెప్పాను.

ఇద్దరి మనస్సులు ఏకం అయ్యాయి

ఇద్దరి మనస్సులు ఏకం అయ్యాయి

విజయవాడ నుంచి ఏలూరుకు వచ్చేలోపు ఇద్దరి మనస్సులు ఏకం అయ్యాయి. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వచ్చేలోపు తనువులు రెండు టచ్ అయ్యాయి. రాజమండ్రికి వచ్చేలోపు రాత్రంతా తనతో ఎంజాయ్ చెయ్యాలనే కోరిక నా మనస్సులో కలిగింది.

తన బెడ్ ఖాళీగానే ఉంది

తన బెడ్ ఖాళీగానే ఉంది

ఇద్దరి మనసులు కలిశాయి. నేను తనకు ఎంత దగ్గరకు వెళ్లినా నన్ను ఏమి అనడం లేదు. తన బెడ్ ఖాళీగానే ఉంది. ఇద్దరం నా బెడ్ పైనే కూర్చొని యూ ట్యూబ్ చూస్తూనే ఉన్నాం. సామళ్లకోట జంక్షన్, తుని, అనాకపల్లి ఎప్పుడు వెళ్లిపోయాయో కూడా తెలియదు.

నా మనస్సు ఊరికే ఉండడం లేదు

నా మనస్సు ఊరికే ఉండడం లేదు

తర్వాత విశాఖపట్నం జంక్షన్ వచ్చింది. ఇక ఆలస్యం చేస్తే భువనేశ్వర్ కూడా వస్తుంది. అంత అందమైన అమ్మాయి అలా నా పక్కన కూర్చొని నాతో ఊసులాడుతుంటే నా మనస్సు ఊరికే ఉండడం లేదు.

 ఇద్దరం ఒకే బ్లాంకెట్ కప్పుకున్నాం

ఇద్దరం ఒకే బ్లాంకెట్ కప్పుకున్నాం

ఏదో ఒకటి చెయ్యమంటుంది. చలి కాస్త ఎక్కువైంది. తన బ్యాగ్ లో నుంచి బ్లాంకెట్ తీసింది. నాకు కూడా బ్లాంకెట్ ఉంది. కానీ నేను కావాలనే బయటకు తీయలేదు. ఇద్దరం ఒకే బ్లాంకెట్ కప్పుకున్నాం.

తన బాడీ టచ్ అవుతుంటూనే

తన బాడీ టచ్ అవుతుంటూనే

బ్లాంకెట్ కన్నా తన బాడీ టచ్ అవుతుంటే నా బాడీలో వేడి పుడుతుంది. కొద్ది సేపటికి లైట్స్ మొత్తం ఆప్ అయ్యాయి. దొరికింది ఛాన్స్ అనుకుని ఇంకా ఎక్కువ టచ్ చేశాను. అయినా ఏమి అనలేదు. చాలా ధైర్యం చేసి కిస్ పెట్టుకున్నా. యూట్యూబ్ లో మంచి రొమాన్స్ సీన్స్ ప్లే అవుతున్నాయి.

కిస్ చేస్తున్నప్పుడు బాగా సహకరించింది

కిస్ చేస్తున్నప్పుడు బాగా సహకరించింది

కిస్ చేస్తున్నప్పుడు బాగా సహకరించింది. రాత్రంతా తన బాడీలో ప్రతి పార్ట్ ని టచ్ చేశాను. ప్రతి పార్ట్ ని కిస్ చేశాను. అసలు ఆమెను ముద్దుపెట్టుకుంటుంటూ ప్రపంచాన్ని మొత్తం మరిచిపోయాను.

తనివితీరా ముద్దుపెట్టకున్నాను

తనివితీరా ముద్దుపెట్టకున్నాను

విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం వరకు ఒక్క క్షణం కూడా వేస్ట్ చెయ్యకుండా తనివితీరా ముద్దుపెట్టకున్నాను. ఇంకా ఏవేవో చేశాను. తర్వాత తనకు నిద్ర వస్తుందని చెప్పి తన బెడ్ పైకి వెళ్లింది. నేను కూడా నిద్రపోయాను.

ఇప్పటి ట్రైన్ ఎక్కినప్పుడల్లా

ఇప్పటి ట్రైన్ ఎక్కినప్పుడల్లా

బరంపూర్, చాట్ పూర్, బల్గోన్, ఖుద్ర రోడ్ ఎప్పుడు వెళ్లిపోయాయో తెలియదు. భువనేశ్వర్ కూడా వచ్చింది. అందరూ దిగిపోయారు. నన్ను ఎవరో లేపితే లేచాను. ఆ పిల్ల కనపడలేదు. అంతా వెతికాను. ఒక్క ఆచూకీ కూడా దొరకలేదు. కానీ ఇప్పటి ట్రైన్ ఎక్కినప్పుడల్లా అమిత్రనే గుర్తొస్తూ ఉంటుంది.

English summary

we then shared a long kiss she hugged me again

we then shared a long kiss she hugged me again
Story first published:Friday, February 16, 2018, 15:47 [IST]
Desktop Bottom Promotion