For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేడపైన మెడపై ముద్దాడుతుంటే వాళ్ల నాన్న చూశాడు, ఇంటికి రండి పెళ్లి చేస్తాం అన్నాడు #mystory201

ఒక రోజు నేను, తను వాళ్ల మేడపైన ఉన్నాం. తను వెనుకాల నుంచి నన్ను చేతులతో చుట్టేసి నా మెడను ముద్దాడుతున్నాడు. అతని స్పర్శకు నేను కూడా గాల్లో తేలిపోతున్నాను. అంతలో దినేశ్ వాళ్ల నాన్ను మేడపైకి వచ్చాడు.

|

ప్రేమ అనేది చాలా గొప్పగా ఉండాలి. ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతనికోసం చచ్చే వరకు కట్టుబడి ఉండాలి. నేను అయితే అలాగే ఉంటా. అలా ఉన్నోళ్లు మాత్రమే చరిత్రలో నిలుస్తారు. చరిత్రలో నిలవడం అంటే మనకు తెలిసిన పది మంది మనం చనిపోయాక కూడా మన గురించి మంచిగా మాట్లాడుకుంటారు. నేను అదే నమ్మాను.

నా స్నేహితులకు కూడా అదే చెప్పేదాన్ని. నా పేరు దివ్య. మాది శ్రీకాకుళం. నాకు చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన ఉండేది. పట్టుదల ఉండేది. అందుకే హైదరాబాద్‌ వచ్చాను. హైదరబాద్ వాతావరణానికి అవవాటు కాలేక కొన్నాళ్లు చాలా ఇబ్బందిపడ్డాను. ఇక్కడ ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతను నాకు అన్ని విషయాల్లో చాలా హెల్ఫ్ చేశాడు. మొదట ఉప్పల్ లో రూమ్ తీసుకుని ఉండేదాన్ని.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్

తర్వాత ఆ అబ్బాయి పరిచయం వల్ల నారాయణగూడలో మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక హాస్టల్ ఉండేందుకు అవకాశం వచ్చింది. హాస్టల్ కు దగ్గర్లోనే మా కోచింగ్ సెంటర్ ఉండేది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు నేను చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఆ అబ్బాయి కూడా మా ఇనిస్టిట్యూట్ లోనే కోచింగ్ తీసుకునేవాడు. అలా ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది.

తనకు ఆ ఉద్దేశం లేదు

తనకు ఆ ఉద్దేశం లేదు

అయితే ఒక రోజు అతను తన హద్దులు మీరుతున్నాడని అనిపించింది. నేను హాస్టల్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లేదాన్ని. అతను బైక్ పై ఎక్కు అని ఇబ్బంది పెట్టాడు. దీంతో నాకు కోపం వచ్చి మళ్లీ నాతో మాట్లాడొద్దు అని చెప్పాను. తర్వాత నాకే బాధగా అనిపించింది. అనవసరంగా అతనిపై కోప్పాడనుకున్నాను. తనకు ఏ ఉద్దేశం లేదని, కేవలం నేను నడుచుకుంటూ వస్తాన్నాననే హెల్ప్ చేద్దామనుకున్నాడని నేను అర్థం చేసుకున్నాను.

ఏయ్ దానిదేముందిలే

ఏయ్ దానిదేముందిలే

తను తర్వాత రెండు రోజులు కోచింగ్ సెంటర్ కు రాలేదు. నేను అతని రూమ్ దగ్గరకు వెళ్లాను. నన్ను చూడగానే అతని ముఖంలో చిరునవ్వు విరిసింది. సారీ చెప్పాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా దినేశ్... మళ్లీ ఎప్పుడు ఇలా చెయ్యను అన్నాను. ఏయ్ దానిదేముందిలే నేను ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్నా అన్నాడు.

ఇద్దరం బాగా క్లోజ్

ఇద్దరం బాగా క్లోజ్

ఆ అబ్బాయిది వికారాబాద్. మంచి ఇంటలిజెంట్. అతని టాలెంట్ కు కచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుందని నేను నమ్మేదాన్ని. అయితే అతని నుంచి ఏదో ఆశించి మాత్రం నేను అతనికి దగ్గర కాలేదు. కొన్నాళ్లకు వాళ్ల చెల్లి కూడా మా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యింది. ఆమె నేను బాగా క్లోజ్ అయ్యాం. తను వేరే హాస్టల్ లో ఉండేది.

ఆ అబ్బాయి కోసమే వెళ్లేదాన్ని

ఆ అబ్బాయి కోసమే వెళ్లేదాన్ని

తన చెల్లి ద్వారా నేను ఆ అబ్బాయి ఇంటికి కూడా నేరుగా వెళ్లే అవకాశం వచ్చింది. వాలింట్లో అందరికీ తన చెల్లి ఫ్రెండ్ గా మాత్రమే తెలుసు. కానీ నేను ఆ అబ్బాయి కోసమే వెళ్లేదాన్ని. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కొన్నాళ్లకే ప్రేమగా మారింది. ఇద్దరం తెలియకుండానే ప్రేమలో మునిగితేలాము.

నా మెడను ముద్దాడుతున్నాడు

నా మెడను ముద్దాడుతున్నాడు

ఒక రోజు నేను, తను వాళ్ల మేడపైన ఉన్నాం. తను వెనుకాల నుంచి నన్ను చేతులతో చుట్టేసి నా మెడను ముద్దాడుతున్నాడు. అతని స్పర్శకు నేను కూడా గాల్లో తేలిపోతున్నాను. అంతలో దినేశ్ వాళ్ల నాన్ను మేడపైకి వచ్చాడు. మమ్మల్ని చూశాడు. అంతే క్షణాల్లో నేను అక్కడి నుంచి రావడం, దినేశ్ ను హైదరాబాద్ నుంచి ఊరికి తీసుకెళ్లడం జరిగింది.

కిరోసిన్ పోసుకుని చస్తాం

కిరోసిన్ పోసుకుని చస్తాం

మా ఇద్దరినీ కలవకుండా వాళ్ల నాన్న అడ్డుకున్నాడు. కనీసం అతనితో ఫోన్లో కూడా మాట్లాడకుండా చేశాడు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తే మేమందరం కిరోసిన్ పోసుకుని చస్తాం అని బెదిరించడంతో అతను కూడా బాధతోనే నాకు దూరం అయ్యాడు.

ఎవ్వరూ ఒప్పుకోలేదు

ఎవ్వరూ ఒప్పుకోలేదు

తర్వాత అతను నన్ను పెళ్లాడతానని మా ఇంట్లో వాలింట్లో చెప్పాడు. ఎవ్వరూ ఒప్పుకోలేదు. మా ఇద్దరి కులాలు వేరని అడ్డు చెప్పారు. దినేశ్ నాన్న అతణ్ని కొట్టాడు కూడా. నా వల్ల అతను చాలా డిస్ట్రబ్ అయ్యాడు. అంత ఇంటలిజెంట్ ను తీసుకెళ్లి వాళ్ల నాన్న ఊర్లో ఇంట్లో కూర్చొబెట్టాడని నాకు బాధేసింది. నా వల్ల అతని జీవితం నాశనం కాకూడదని అనుకున్నాను. అతనికి దూరంగా ఉండాలనుకున్నాను.

వైభవంగా పెళ్లి చేస్తాం

వైభవంగా పెళ్లి చేస్తాం

కానీ ఒక రోజు సాయంత్రం ఆరు గంటలకు అతను కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చాడు. తర్వాత ఇద్దరం యాదగిరిగుట్టపై పెళ్లి చేసుకున్నాం. తర్వాత వాళ్ల నాన్న ఫోన్ చేసి ఇద్దరినీ ఇంటికి రమ్మన్నాడు. మళ్లీ మీ ఇద్దరికీ వైభవంగా పెళ్లి చేస్తాం అని నమ్మించాడు. ఇద్దరం వెళితే దినేశ్ ను కొట్టాడు. నన్ను వాళ్ల బంధువులంతా ఎలా అంటే అలా మాట్లాడారు. కొందరు కొట్టారు. మధ్యలో విడిపించడానికి వచ్చిన దినేశ్ చెల్లెలిని కొట్టారు.

ఊర్లో జనం నానా రకంగా తిట్టారు

ఊర్లో జనం నానా రకంగా తిట్టారు

నా జీవితం ఇలా అవుతుందని నేను అనుకోలేదు. తర్వాత శ్రీకాకుళం వెళ్లిపోయాను. మా అమ్మానాన్న కూడా నన్ను తిట్టారు. తర్వాత నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాను. పోలీసులిద్దరినీ విచారించారు. మేమిద్దరం మాత్రం కలిసే ఉండాలని అనుకుంటున్నామని చెప్పాం. మా అమ్మనాన్నను ఊర్లో జనం నానా రకంగా తిట్టారు. దీంతో నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. పోలీసుల వల్ల నేను, దినేశ్ కలిశాం.

నా ప్రేమలో స్వార్థం లేదు

నా ప్రేమలో స్వార్థం లేదు

సరిగ్గా ఏడాది కష్టాలు పడ్డాం. ఒక రోజు తిని మరో రోజు తినక ఇలా ఇబ్బందులుపడ్డాం. తర్వాత ఇద్దరికీ సర్కార్ కొలువులు వచ్చాయి. ఇప్పుడు మేమిద్దరమే అందరికీ ఆదర్శమయ్యాం. మన నిస్వార్థంగా ఏ పని చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు, జీవితాన్ని ఆనందమయం చేస్తాడు ఇదే నేను నమ్మిన సిద్దాంతం. అదే ఎప్పటికైనా ఎవరినైనా రక్షిస్తుంది. నా ప్రేమలో స్వార్థం లేదు. నేను దినేశ్ మంచితనాన్ని మాత్రమే ప్రేమించాను. అతని ఆస్తిపాస్తులు నాకు అవసరం లేదు.

చచ్చే వరకు కట్టుబడి ఉంటే

చచ్చే వరకు కట్టుబడి ఉంటే

మన ప్రేమ అనేది గొప్పగా ఉంటే.. ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతనికోసమే చచ్చే వరకు కట్టుబడి ఉంటే ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు. అది ఏ విషయంలోనైనా సరే. ఒకణ్ని ముంచాలి, ఒకణ్ని మోసం చేయాలి.. బదలాం చేయాలని చేస్తే నువ్వే నాశనం అయిపోతావు. నేను నమ్మిన సిద్దాంతం కోసమే కట్టుబడి ఉంటా.

English summary

when i tried to think back i couldnt exactly remember what i liked about him

when i tried to think back i couldnt exactly remember what i liked about him
Story first published:Tuesday, July 31, 2018, 14:47 [IST]
Desktop Bottom Promotion