For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సంబంధ బాంధవ్యాల్లో సంతోషం అనేది భ్రమ మాత్రమే ఎందుకు అవుతుందో మీకు తెలుసా ?

సంబంధ బాంధవ్యాల్లో సంతోషం అనేది భ్రమ మాత్రమే ఎందుకు అవుతుందో మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

" ప్రతిరోజూ ఆహారం కోసం ఎలా అయితే మనమందరం పాకులాడుతామో అలానే సంతోషం కోసం కూడా విపరీతంగా తపిస్తాం. "

మనం పుట్టినప్పటి నుండి ఆనందం అనేది అతిముఖ్యమైన విషయంగా మనం భావిస్తాం. అంతే కాకుండా చచ్చేంత వరకు కూడా ఆనందంగా ఉండాలనే మనం భావిస్తాం, ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఒక సంబంధ బాంధవ్యంలో చాలామంది ప్రేమ కంటే కూడా ఆనందాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ప్రేమ కోసం ఎక్కువగా పరిగెడితే అనార్యోగం బారిన పడతారు. ఆనందం వెనుక ఎక్కవగా పరుగుపెడితే బాధపడాల్సి వస్తుంది.

మనం దేని కోసం వెతుకుతున్నాం ? అసలు మనం ఎందుకు ఇలా పాకులాడుతున్నాం ?

ఆనందం, సంతోషం ఇవన్నీ ఒక భ్రమ మాత్రమే. సంబంధ బాంధవ్యాల్లో మనం కోరుకొనే వారిలో ఇవన్నీ ఉంటే బాగుణ్ణు అని మనకు అనిపిస్తూ ఉంటుంది.

WHY HAPPINESS IS AN ILLUSION IN RELATIONSHIPS?

సంతోషం కారణం గానే, కలిసి ఉంటారని మనం అందరం అనుకుంటూ ఉంటాం. ఆనందం అనేది పరిస్థితులను బాగు పరుస్తుంది అనే భ్రమలో మనం బ్రతుకుతూ ఉంటాం. వివిధ సందర్భాల్లో కలిగే ఆనందాల వల్ల మాత్రమే సంబంధ బాంధవ్యాలు నిలబడ్డాయి అని మీరు అనుకోకండి. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఆనందం అని మనం అనుకొనే భ్రమతో పాటు మరెన్నో రకాల వివిధకారణాలు సంబంధ బాంధవ్యాలను నిలపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మీకు భావాలకు సంబంధించి ఈ రకమైన భావం మీకు అస్సలు కలగకపోయి ఉండవచ్చు. ఉదాహరణకు సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు కలిసి ఉన్నాము అనే భావనను అస్సలు కలిగించదు.

సంబంధబాంధవ్యంలో ఉన్నప్పుడు ఆనందాన్ని చంపేసే వివిధ రకాల కారణాలు :

ఆకాంక్ష :

ఆకాంక్ష :

మనం చూసే ప్రతి ఒక్క సంబంధ బాంధవ్యంలో వివిధరకాల ఆకాంక్షలు వాటితో ముడి పడి ఉంటాయి. అలానే ప్రతి ఒక్కరి దగ్గర నుండి సంతోషాన్ని ఆశించడం జరుగుతుంది. కానీ, దాని వెనుకే అంచనాలు అనే భారం కూడా మోయవలసి ఉంటుంది. ఈ కారణాల వల్లనే సంతోషం అనేది ఒక భ్రమలా మారిపోతుంది. ఆనందంలో అనేది ఒకానొక క్షణంలో కలిగే భావన. అది ఎప్పటికీ అలానే ఉండిపోదు.

మన భాగస్వామి అంచనాలను అందుకోవడం కోసమై విపరీతంగా కష్టపడి వారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ, మనం ఆనందంగా ఉండటం మరచిపోతాం. దీనివల్లనే ఎప్పటికీ మనం సంతోషాన్ని అందుకోలేము. కానీ, అది ఎప్పుడు మనతోనే ఉంది అని కల కంటూ ఉంటాం.

అభద్రతా భావం :

అభద్రతా భావం :

వివిధరకాల పద్దతుల ద్వారా సంతోషాన్ని శాసించి మనతోనే ఉంచుకోవాలి అని భావిస్తాం. ఇది చాలా తప్పు సంప్రదాయం. సంతోషం కోసం పరితపించే సమయంలో అది మన అభద్రతా భావాలను బయటపెడతాయి. సంబంధ బాంధవ్యాల సమయంలో సంతోషం కోసం మన అభద్రతా భావాలకు మనమే బానిస అవుతాం. దీని వల్ల అదంతా భ్రమలా మిగిలిపోతుంది.

సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు అభద్రతా భావం వల్ల కలిగే భావనాల వల్ల సంతోషం అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే, సంబంధ బాంధవ్యంలో ఉంటామో, అప్పుడు అభద్రతా భావాలూ విపరీతంగా మన ఆలోచనలతో అడ్డుకుంటాయి. దీని వల్ల జంటలు విపరీతమైన ఒడుదొడుకులు ఎదురుకోవాల్సి వస్తుంది. సంబంధ బాంధవ్యంలో ఉండే ఆనందాన్ని అభద్రతా భావం చంపేస్తుంది.

మీ భాగస్వామి పై మీరు నమ్మకం ఉంచడమే ఒక సంబంధ బాంధవ్యంలో బలమైన పునాది. దీనిని దృష్టిలో ఉంచుకొనే ముందుకు వెళ్ళాలి. కానీ, ఎప్పుడైతే ఒక రహస్య అజెండాతో ముందుకు వెళ్తారో, మీరు కోరుకున్నదే కావాలని పట్టుబడతారో, అటువంటప్పుడు అభద్రతా భావం తలెత్తుతుంది.

రాజీ పడటం :

రాజీ పడటం :

ఒక సంబంధ బాంధవ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత భాగస్వామి కోసం రాజి పడుతుంటాం. ఇది తప్పు అనే భావన మీలో ఎప్పుడైతే మొదలవుతుందో, ఇక అప్పటి నుండి మీలో ఆనందం అనే భావన కొద్ది కొద్దిగా తగ్గిపోతుంది. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఇలా మీకు తెలియకుండానే ఒక విధమైన పరిస్థితులకు లోనవుతారో, అప్పుడు మిమ్మల్ని మీరు చంపుకోవడంతో సమానం.

చాలామంది సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు రాజీ పడాలి అని చెబుతూ ఉంటారు. కానీ, మీరు నమ్మవల్సింది ఏమిటంటే, రాజీ పడటం వల్ల సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు మీకు మీ భాగస్వామికి ఉండాల్సిన సంతోషం తుడిచిపెట్టుకుపోతోంది. మీరు ఎప్పుడైతే ఒక సంబంధ బాంధవ్యంలోకి అడుగుపెట్టినప్పుడు మీకు నచ్చినట్లు మీరు ఉండలేకపోతున్నారో, అటువంటప్పుడు మీరు కోరుకొనే ఆనందం మీకు దక్కదు. అందుకు కారణం మీరే అని గుర్తించండి.

సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు గుర్తించడమే నిజమైన ఆనందం. అంతేకాని, కొంచెం మీకు నచ్చకపోయినా వ్యవహరించడం, మరికొంతసేపు మీకు నచ్చినట్లు వ్యవహరించడం కాదు.

సంబంధ బాంధవ్యం అంటే అర్ధం రాజీ పడటం కాదు. ఆనందాన్ని ప్రతిక్షణం మీరు ఆ సమయంలో ఆస్వాదించాలి. మీకు ఎలా ఇష్టం అయితే అలా ఉండాలి. మీరు ఇంతకముందు ఎలా ఉండేవారో అలానే ఇప్పుడు, భవిష్యత్తులో ఉండగలగాలి.

సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే, మీరు ఈ నిజాన్ని మారుద్దాం అని ప్రయత్నిస్తారో, అటువంటప్పుడు మీరు కోరుకొనే సంతోషం మొత్తం ఒక భ్రమలా మారిపోతుంది. ఒక లైబ్రెరీలో పుస్తకాలు మొత్తం ఉన్నా మీరు కోరుకొనే పేజీ దొరకని సందర్భంలా మీ జీవితం ఉంటుంది.

కష్టపడటం :

కష్టపడటం :

సంతోషాన్ని సంపాదించుకోవడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు భ్రమలో బ్రతికే సమయంలో కష్టాన్ని దాచి, బంధాన్ని బలపరుచుకోవాలని చాలామంది భావిస్తారు. కానీ, అందరు మరచిపోయే అంశం ఏమిటంటే, బంధాలు వాటంతట అవే అలా పెనవేసుకుంటూ పోతాయి, అలానే ఉండిపోతాయి. మీరు ఎప్పుడైతే మీ భాగస్వామికి మీరు చేస్తున్నది అంతా చూపించి మెప్పించాలని భావిస్తారో అది సరైన పద్దతి కాదని, అటువంటప్పుడు మీ నిజమైన నిబద్ధతను అనుమానించాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి.

 సంతోషం అనేది కష్టపడి సంపాదించుకోవాలి.

సంతోషం అనేది కష్టపడి సంపాదించుకోవాలి.

సంతోషం అనేది కష్టపడి సంపాదించుకోవాలి. కానీ, అది పుట్టినప్పటి నుండి మనతోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సంబంధ బాంధవ్యాలు సంతోషానికి తయారీ కర్మాగారాలు ఏమి కాదు. కానీ, మనం అనుకుంటే, అది ఎప్పుడు మనతోనే ఉంటుంది. కానీ, చాలామంది అర్ధం చేసుకోని విషయం ఏమిటంటే, ప్రతి సంబంధ బాంధవ్యంలో ఎప్పుడైతే సంతోషం కోసం ప్రయత్నిస్తామో, అప్పుడు అది త్వరగా దూరం అయ్యే అవకాశం ఉంది.

అటువంటప్పుడు మనకు దొరికేదంతా కేవలం భ్రమ మాత్రమే.

అటువంటప్పుడు మనకు దొరికేదంతా కేవలం భ్రమ మాత్రమే.

అటువంటప్పుడు మనకు దొరికేదంతా కేవలం భ్రమ మాత్రమే. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు చాలామంది సంతోషాన్ని వ్యక్తపరచాలని ప్రయత్నిస్తుంటారు. కానీ, లోలోపల వారికి కూడా తెలుసు బయట ప్రపంచానికి వారు భ్రమ మాత్రమే కల్పిస్తున్నారని. సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో సంతోషం బలవుతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తుల ముందు తమ మధ్య ఎదో ఘాడమైన ప్రేమ ఉందని నటిస్తేనే సంతోషంగా ఉంటాము అని భావిస్తూ ఉంటాము. కానీ, ఇందులో ఎంతమాత్రం నిజం లేదు.

సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు సంతోషం ఉండాలంటే,

సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు సంతోషం ఉండాలంటే,

సంబంధ బాంధవ్యంలో ఉన్నప్పుడు సంతోషం ఉండాలంటే, మీరు మీరుగానే ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మీ భాగస్వామిని కూడా వారిలానే ఉండమని చెప్పండి. వారిని కూడా గౌరవించండి. సంబంధ బాంధవ్యం కోసం అస్సలు రాజీ పడకండి. కానీ, మీరు ఎలా ఉన్నారు అనే విషయాన్ని మీ భాగస్వామికి అర్ధం అయ్యేలా చెప్పండి. అలానే, మీ భాగస్వామిని కూడా అర్ధం చేసుకోండి.

మీ సంబంధ బాంధవ్యం బాగా ఉండేలా ప్రయత్నించండి.

మీ సంబంధ బాంధవ్యం బాగా ఉండేలా ప్రయత్నించండి.

మీ సంబంధ బాంధవ్యం బాగా ఉండేలా ప్రయత్నించండి. ఆనందం అనే దాని పై అలా తేలియాడుతూ ఉంటారా ? లేదా మీ భాగస్వామి తో సంబంధ బాంధవ్యం లో ఉన్నప్పుడు ఆనందాన్ని ముంచేస్తారా అనేది మీ ఇష్టం.

మిమ్మల్ని మీరు అర్ధం చేసుకున్నప్పుడు మీ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆనందం అనేది ఎప్పటికీ భ్రమలా ఉండదు. అప్పుడు మీరు ఆనందాన్ని, సంతోషాన్ని నిజంగా ఆస్వాదించవచ్చు.

English summary

WHY HAPPINESS IS AN ILLUSION IN RELATIONSHIPS?

WHY HAPPINESS IS AN ILLUSION IN RELATIONSHIPS,In a relationship, happiness is most seeked rather than love and happiness is an illusion. Read the full article to know why happiness is an illusion.
Story first published:Tuesday, April 3, 2018, 17:28 [IST]
Desktop Bottom Promotion