For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక తల్లి కూతురికి సెక్స్ గురించి చెబుతున్న మాటలు, 'సెక్స్ శారీరక అవసరం కాదు, అందుకు పరిష్కారం కాదు

సెక్స్ లో పాల్గొంటే ఇద్దరి మధ్య ప్రేమ పెరగాలి. అంతేగానీ ఒకవ్యక్తి సుఖం కోసం మరొక వ్యక్తితో పాల్గొనే ప్రక్రియ కాకూడదు. ఇద్దరూ అందులో లీనమై తేలిపోవాలి. కేవలం భర్తను సుఖం కోసం మొక్కుబడిగా అందులో పాల్గొనక

|

ఒక తల్లి తన కూతురికి సెక్స్ గురించి చెబుతున్న మాటలివి...మనలో చాలా మంది సెక్స్ గురించి మాట్లాడుకోవడం తప్పుగా భావిస్తారు. దాన్ని ఒక బూతు మాదిరిగా చూస్తారు. అసలు అది లేకుంటే సమస్త ప్రాణ కోటి మనుగడే ఉండదు. అలా అని దాని బహిరంగంగా చర్చించమని, విచ్చలవిడిగా అందులో పాల్గొనమని చెప్పడం లేదు. దానిపై అవగాహన ఏర్పరుచుకోవడం అందరికీ ఆవశ్యకం. దాని గురించి కనీస అవగాహన లేకుంటే అది ఒక భూతంలా కనిపిస్తుంది.

వాస్తవానికి తల్లిదండ్రులు ఈ అంశంపై వారి పిల్లలకు ఒక అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ ఏ తల్లిదండ్రులు అలా చెయ్యరు. దీంతో పిల్లలు స్వయంగా దాని గురించి తెలుసుకునే క్రమంలో ఒక్కోసారి తప్పుదోవపడుతుంటారు.

ప్రతి విషయాన్ని చెప్పాలనుకున్నా

ప్రతి విషయాన్ని చెప్పాలనుకున్నా

నా కూతురికి నేను జన్మనిచ్చిన రోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తనకు సమాజంలోని కుల్లుకుతంత్రాలతో పాటు ప్రతి విషయాన్ని చెప్పాలనుకున్నాను. తనకు సెక్స్ గురించి కూడా వివరించాలనుకున్నాను. చెడుదోవ పట్టకుండా ఉండేందుకు, సెక్స్ అంటే కేవలం కామం కాదు అని నా కూతురుకు తెలియజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను.

సెక్స్ కేవలం శారీరక అవసరం కాదు

సెక్స్ కేవలం శారీరక అవసరం కాదు

చాలా మంది సెక్స్ ను కేవలం శారీరక అవసరంగా భావిస్తారు. దానివల్ల మంచి సుఖం దక్కుతుందని అనుకుంటారు. అంతకు మించి ఇంకేమీ లేదనుకుంటారు. కానీ సెక్స్ కేవలం శారీరక సుఖం కోసం చేసుకునేది కాదు. రెండు తనువులు కలవడంతో రెండు మనస్సులు మరింత దగ్గర అవుతాయని గుర్తించాలి. ఈ విషయం సుదీర్ఘకాలంగా సెక్స్ చేసుకునేవారికి మాత్రమే తెలుస్తుంది.

ఒత్తిడిగా ఫీలవ్వకూడదు

ఒత్తిడిగా ఫీలవ్వకూడదు

చాలా మంది సెక్స్ ను ఒత్తిడిగా భావిస్తుంటారు. సెక్స్ లో పాల్గొనడం ఒక పనిగా భావిస్తారు. దాన్ని ఆస్వాదించాలి. రోజుకొక భంగిమలో అందులో పాల్గొని స్వర్గం చూడాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు అందులో ఏదో మొక్కుబడిగా పాల్గొంటూ ఉంటారు. మీరు కాస్త రిలాక్స్ అయ్యాకే అందులో పాల్గొనండి.

Most Read :నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడుMost Read :నా భర్తకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పడు కావాలంటాడు, తనకు సుఖం దక్కితే చాలు, నా గురించి పట్టించుకోడు

ప్రేమ ఉండాలి

ప్రేమ ఉండాలి

సెక్స్ లో పాల్గొంటే ఇద్దరి మధ్య ప్రేమ పెరగాలి. అంతేగానీ ఒకవ్యక్తి సుఖం కోసం మరొక వ్యక్తితో పాల్గొనే ప్రక్రియ కాకూడదు. ఇద్దరూ అందులో లీనమై తేలిపోవాలి. కేవలం భర్తను సుఖం కోసం మొక్కుబడిగా అందులో పాల్గొనకూడదు. ఇద్దరూ ప్రేమగా చేసుకోవాల్సిన పవిత్ర కార్యం అది.

బంధం గట్టిపడాలి

బంధం గట్టిపడాలి

సెక్స్ వల్ల భార్యాభర్తల బంధం గట్టిపడాలి అంతేగానీ అవసరం కోసం అందులో పాల్గొనకూడదు. చాలా మంది భర్తలు కేవలం తమ సంత్రుప్తి కోసమే అందులో పాల్గొంటూ ఉంటారు. భార్య అభిప్రాయాల్ని ఆ విషయంలో అస్సలు పట్టించుకోరు. అలాగని ఆడవారు కూడా మగవారిని ఈ విషయంలో ప్రశ్నించకుండా అలాగే జీవితాంతం భరించకూడదు. ప్రతి అమ్మాయి భర్తతో తను పడే వేదన గురించి నిర్భయంగా అతనితోనే చెప్పాలి.

వద్దు అని చెప్పేయండి

వద్దు అని చెప్పేయండి

భర్త లేదా బాయ్ ఫ్రెండ్ సెక్స్ విషయంలో ఇబ్బందిపెడితే ముఖం మీదే చెప్పేయాలి. నాకు ఈ సమయంలో సెక్స్ లో పాల్గొనాలని లేదు. దయజేసి ఇప్పుడు వద్దు అని చెప్పాలి. అంతేగానీ మొహమాటానికి వెళ్లి అందులో పాల్గొనకూడదు.

సెక్స్ పరిష్కారం కాదు

సెక్స్ పరిష్కారం కాదు

చాలా సమస్యలకు పరిష్కారం సెక్స్ కాదు. ఒత్తిడి నుంచి లేదా వ్యక్తిగత సమస్యల్ని తాత్కాలిక ఉపశమనం కోసం కొందరు సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు. తాత్కాలిక ఉపశమనం కోసం అందులో పాల్గొనకండి. సెక్స్ అనేది ఇద్దరి మధ్య జరిగే పవిత్రమైన కార్యం. దాన్ని అలా ఉపయోగించుకోకండి.

Most Read :రాత్రంతా ఆమే గుర్తొచ్చింది, నిద్ర రాలేదు, తెల్లవారుజామున ఫోన్ చేస్తే వెళ్లా, షాక్ అయ్యాను#mystory402Most Read :రాత్రంతా ఆమే గుర్తొచ్చింది, నిద్ర రాలేదు, తెల్లవారుజామున ఫోన్ చేస్తే వెళ్లా, షాక్ అయ్యాను#mystory402

చర్చించడానికి భయపడకండి

చర్చించడానికి భయపడకండి

సెక్స్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని మీ భాగస్వామితో చర్చించండి. అస్సలు భయపడకండి. భయపడితే మీరే నష్టపోతారు. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్స్ కు సంబంధించిన విషయాలపై అపోహలు ఏర్పరుచుకోవొద్దు. ప్రతి తల్లి తన కూతురితో ఇలాంటి విషయాలన్నీ చర్చించాలి. అప్పుడే ప్రతి కూతురికి అన్ని విషయాలు తెలుస్తాయి. లేదంటే తను ఈ విషయాలు తెలుసుకునేందుకు వేరే మార్గాలు వెతుకుతుంది. ఆ క్రమంలో చెడుదోవ పట్టే అవకాశం ఉంది.

English summary

Aware before going forward to sex! Mother's Emotional Letter to Her Daughter

Sex is a normal, healthy part of life when you choose it freely. Making clear decisions about things like sex when you are a teenager is a challenge. You will make mistakes. Sex is not something to be ..
Desktop Bottom Promotion