Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
సెక్స్ చేసిన వెంటనే పడుకుంటారు, మగవారికి ఉండే కొన్ని చెడ్డ అలవాట్లు, ఆడవారికి అస్సలు నచ్చవు
చాలా మంది మగవారు ఏదైనా పనిలో బిజీగా ఉంటే అవతలి వ్యక్తులు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోరు. కానీ భార్యలు మాత్రం తాము చెప్పే ప్రతి మాటను భర్త వినాలని కోరుకుంటారు. మగవారు బిజీలో ఉన్నప్పుడు ఆడవారు చెప
ప్రతి మగాడికి కొన్ని రకాల చెడ్డ అలవాట్లు ఉంటాయి. చెడ్డవంటే మరీ అంత దారుణమైన విషయాలేమీ కాదు. సాధారణంగా అబ్బాయిలంతా కొన్ని పనులు వారికి తెలియకుండానే రోటిన్ గా చేసేస్తుంటారు. అయితే ఆ పనులన్నీ అమ్మాయిలకు చాలా కోపం తెప్పిస్తాయి. మరి అబ్బాయిలు చేసే ఆ పనులు ఏమిటో మీరు తెలుసుకోండి.

అప్పటికప్పడు నిర్ణయాలు
మహిళలు ప్రతిదీ ప్రణాళిక వేసుకుని అవసరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పురుషులు మాత్రం ఆన్ ద స్పాట్ లో డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది మహిళలకు అస్సలు నచ్చదు. భర్త సడెన్ గా రాత్రికిరాత్రి మనం టూర్ కు వెళ్తున్నాం బట్టలు సర్దు అంటాడు. ఇలాంటి సర్ ప్రైజ్ వెకేషన్స్ ఆడవారికి అస్సలు నచ్చవు.

ఎంప్టీ క్యాన్స్
మగాళ్లు రెగ్యులర్ గా చేసే పని మరొకటుంది. చెత్తనుగానీ, తాగిపారేసిన బాటిల్స్ ను గానీ ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు. సాధారణంగా మగవారికి పనికిరాని బాటిల్స్ డస్ట్ బిన్ లో వేయాలనే ఆలోచన అస్సలు రాదు. ఎందుకంటే చాలా మంది మగవారి కాలేజీ రోజుల నుంచే బాటిల్స్ ను విసిరిపారేయడం అలవాటై ఉంటుంది.

సెక్స్ చేసిన వెంటనే పడుకుంటారు
సెక్స్ పూర్తయిన తర్వాత భర్త తనతో కాసేపు మాట్లాడాలని, తనను ప్రేమగా దగ్గకు తీసుకోవాలని ఆడవారు కోరుకుంటారని కొన్ని సర్వేల్లో తేలింది. అయితే మగవారు మాత్రం సెక్స్ పూర్తియిన వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఈ విషయంలో ఆడవారికి మగవారిపై చాలా కోసం వస్తుంది.

అస్సలు వినరు
చాలా మంది మగవారు ఏదైనా పనిలో బిజీగా ఉంటే అవతలి వ్యక్తులు చెప్పే మాటల్ని అస్సలు పట్టించుకోరు. కానీ భార్యలు మాత్రం తాము చెప్పే ప్రతి మాటను భర్త వినాలని కోరుకుంటారు.

ఇందాక ఏం చెప్పావు
మగవారు బిజీలో ఉన్నప్పుడు ఆడవారు చెప్పే మాటలు వినకుండా ఆ పనిలో నిమగ్నమైపోతారు. మళ్లీ తర్వాత ఇందాక ఏం చెప్పావు మళ్లీ చెప్పు అని మగవారు ఆడవారిని అడుగుతుంటారు. దీంతో అమ్మాయిలకు చిర్రెత్తుకు వస్తుంది.

సెల్ ఫోన్ అడిక్షన్
మగవారు ఎప్పుడూ ఫోన్ పట్టుకుని ఉండడం ఆడవారికి నచ్చదు. అమ్మాయి తాము పక్కన ఉన్నప్పుడు అబ్బాయి ధ్యాసంతా తనపైనే ఉండాలనుకుంటుంది. అలాకాకుండా ఫోన్ ఏదో చూసుకుంటూ నొక్కుకుంటే ఉంటే తనకు మండుతుంది.

టాయిలెట్ సీట్ ను తెరిచి ఉంచడం
చాలా ఇళ్లలో ఆడవారు టాయ్ లెట్ ఉపయోగించిన తర్వాత దానిపై ఉండే మూతను మూసేస్తారు. కానీ మగవారు మాత్రం టాయ్ లెట్ కు వెళ్లిన తర్వాత దాన్ని అలాగే తెరిచి బయటకు వస్తారు.
ఈ విషయంలో ఆడవారికి మగవారిపై చాలా కోపం వస్తూ ఉంటుంది. నీకు ఎన్ని సార్లు చెప్పినా దాన్ని మూయనే మూయవంటూ ప్రతి భార్య భర్తతో గొడవపడుతూనే ఉంటుంది.

స్నేహం
మగవారికి చాలా మందితో స్నేహం చేస్తుంటారు. వీడు పనికొస్తాడా.. వాడు మనకు పనికొస్తాడా అని ఆలోచించరు. ఎవరు బాగా మాట్లాడితే వాడితో అన్నీ చెప్పేస్తుంటారు. క్లోజ్ గా ఉంటారు. కానీ ఆడవారికి తమ భర్త అలా ఎవరితో పడితే వారితో స్నేహం చెయ్యడం అస్సలు ఇష్టం ఉండదు.

ఒక డ్రెస్ వేసుకోవాలని అనుకోరు
మగవారు ప్రత్యేకంగా ఒక డ్రెస్ వేసుకోవాలని అనుకోరు. ఆ సమయానికి ఏది వేసుకోవాలని అనిపిస్తే అది వేసుకుంటూ ఉంటారు. కానీ ఆడవారికి ఇది అస్సలు నచ్చదు. అమ్మాయి తనను కలవడానికి అబ్బాయి వస్తున్నాడంటే అతను చాలా డీసెంట్ గా రెడీ అయి రావాలని కోరుకుంటుంది. కానీ అబ్బాయిలు చాలా క్యాజ్ వల్ గా వెళ్లి కలుస్తుంటారు.

గోళ్లను కత్తిరించుకునేటప్పుడు
మగవారు గోళ్లను కత్తిరించుకునేటప్పుడుగానీ, గడ్డం గీసుకునేటప్పుడు, ట్రిమ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించరు. కత్తిరించుకున్న గోళ్లు, వెంట్రుకలు ఇంట్లో ఎక్కడ అక్కడే పడుతుంటాయి. వాటిని చూస్తే ఆడవారికి చిర్రెత్తుకు వస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారావా.. ఇంట్లో ఒకచోట కూర్చొని కత్తిరించుకోమని చెప్పా కదా అంటూ భర్తపై భార్య మండిపడుతూ ఉంటుంది.

ఆడవారికి నచ్చనివి ఇవే
ఇవండీ మగవారు చేసే కొన్ని పనుల్లో ఆడవారికి నచ్చనివి. పురుషులు ఇవన్నీ కూడా చాలా క్యాజ్ వల్ గా చేసేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి సిల్లీ విషయాలను ఏ మగాడు కూడా సీరియస్ గా తీసుకోడు. అందుకే ఆడవారు ఎన్నిసార్లు ఈ విషయాల గురించి మగవారికి చెప్పినా వినరు.



Click it and Unblock the Notifications
