For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్లయిన అమ్మాయినీ ప్రేమించొచ్చు, ఒకడితో కాపురం చేసొచ్చినా..#mystory395

చాలా రోజులు ఆలోచించాను. ఒకప్పుడు ఈ అమ్మాయినే కదా నేను చేసుకోవాలనుకుంది. వాలింట్లో వాళ్లు చేసిన తప్పుకు ఆమె జీవితం బలి అయ్యింది. ఒకప్పుడు తనని నన్ను పెళ్లి చేసుకుంటావా అని కాళ్లుపట్టుకుని బతిమిలాడుకోవా

|

నేను డిగ్రీ చదివేటప్పుడు ఎన్సీసీలో ఉండేవాణ్ని. తరుచు క్యాంప్ లకు వెళ్లవాణ్ని. అయితే నాకు క్యాంప్ ల్లో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మేమిద్దరం ఎన్ సీసీలో ఫుల్ యాక్టివ్ గా ఉండేవాళ్లం.

true love never dies

ఆ అమ్మాయితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. నాకు తనపై చాలా ప్రేమ ఉండేది. ఆ విషయం తనకు చెబుదామంటే నాకు భయం వేసేది. తనను చూస్తే అలాగే చూస్తూ ఉండాలనిపించేది. చాలా అందంగా, చాలా స్ట్రాంగ్ గా ఉండేది తను.

తనకు నచ్చకుంటే

తనకు నచ్చకుంటే

కానీ నా ప్రేమను తనకు చెబితే తనకు నచ్చకుంటే మా ఫ్రెండ్ షిప్ కూడా చెడిపోతుందని భయం వేసింది. అందుకే చెప్పలేదు. అయితే నేను డిగ్రీ ఫైనలియర్ లో ఉన్నప్పుడే తనకు పెళ్లయ్యింది.

ఇష్టం లేకున్నా

ఇష్టం లేకున్నా

తనకు ఇష్టం లేకున్నా కూడా మేనమామకిచ్చి పెళ్లిచేశారు ఆమె పెద్దలు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనికి విడాకులు ఇచ్చేసింది. తర్వాత కొన్ని రోజులకు నన్ను కలిసింది.

నిన్ను పెళ్లి చేసుకుంటా

నిన్ను పెళ్లి చేసుకుంటా

కథంతా చెప్పింది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తనంటే చెప్పలేనంత ప్రేమ. అలా అని ఎవరితో నో కాపురం చేసిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటామని మనస్సులో కాస్త ఆందోళన.

కాళ్లుపట్టుకుని బతిమిలాడుకోవాలనుకున్నా

కాళ్లుపట్టుకుని బతిమిలాడుకోవాలనుకున్నా

చాలా రోజులు ఆలోచించాను. ఒకప్పుడు ఈ అమ్మాయినే కదా నేను చేసుకోవాలనుకుంది. వాలింట్లో వాళ్లు చేసిన తప్పుకు ఆమె జీవితం బలి అయ్యింది. ఒకప్పుడు తనని నన్ను పెళ్లి చేసుకుంటావా అని కాళ్లుపట్టుకుని బతిమిలాడుకోవాలనుకున్నాను.

Most Read :నా భర్త రాత్రి ఆ పని చేసేటప్పుడు వద్దన్నా వినడు, అందరి ముందు నటిస్తాడు, అసలు రూపం అది #mystory394Most Read :నా భర్త రాత్రి ఆ పని చేసేటప్పుడు వద్దన్నా వినడు, అందరి ముందు నటిస్తాడు, అసలు రూపం అది #mystory394

నన్ను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంటే

నన్ను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంటే

ఇప్పుడు ఆ అమ్మాయే నా దగ్గరకు వచ్చి నా కాళ్లు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకొమ్మని అడుగుతుంటే ఎందుకు చేసుకోలేకపోతున్నాను. ఇదేనా నాకు ఆమెపై ఉన్న ప్రేమ. ఇంతేనా నా ప్రేమ అని నాలో నేను మదనపడ్డాను.

తననే పెళ్లి చేసుకున్నాను

తననే పెళ్లి చేసుకున్నాను

ఫైనల్ గా తననే పెళ్లి చేసుకున్నాను. నిజంతా తను నా దేవత. కనీసం తనకు శోభనం కూడా జరగకుండానే అతనికి విడాకులు ఇచ్చిందనే విషయం తను నాకు చాలా రోజుల వరకు చెప్పలేదు.

ఆల్రెడి వేరే వాడి దగ్గర

ఆల్రెడి వేరే వాడి దగ్గర

నేను తనని పెళ్లి చేసుకోవడానికి ఆ విషయం కూడా అడ్డొచ్చింది. తను ఆల్రెడి వేరే వాడి దగ్గర పడుకుని వచ్చిందిగా తనను ఏం చేసుకుంటాం అనుకున్నాను మనస్సులో. కానీ నేను ఆలోచించి చాలా తప్పని తర్వాత అర్థమైంది.

నాలాగా మనస్సులో ఏవేవో పెట్టుకుని

నాలాగా మనస్సులో ఏవేవో పెట్టుకుని

మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లయిన తర్వాత మన దగ్గరకు వస్తే ఎన్నో అనుమానాలు మనస్సులో ఉంచుకుని మాట్లాడుతాం. నిజంగా మనం ప్రేమిస్తే తను ఏం చేసినా సరే పెద్ద మనస్సుతో స్వాగతిస్తాం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయితో నాలాగా మనస్సులో ఏవేవో అనుమానాలు పెట్టుకుని మాట్లాడకండి అని నా సూచన.

Most Read :తను ఎక్కడంటే అక్కడ గట్టిగా నొక్కాడు, నొప్పితో అల్లాడిపోయా, పెళ్లికి ముందే అందులో పాల్గొందామన్నాడుMost Read :తను ఎక్కడంటే అక్కడ గట్టిగా నొక్కాడు, నొప్పితో అల్లాడిపోయా, పెళ్లికి ముందే అందులో పాల్గొందామన్నాడు

English summary

true love never dies

true love never dies
Desktop Bottom Promotion