‘నాకేమో 25.. తనకేమో 28.. ఫేస్ బుక్ లో పరిచయంతో...’

ఒక నిజమైన ఫేస్ బుక్ ప్రేమ కథ గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే అప్పుడప్పుడు అత్యవసరం అయితే ఆఫీసుకు వెళ్లేవాడిని. అలా డైలీ నేను ఇంట్లోనే కంప్యూటర్ తో కాలక్షేపం చేస్తుండేవాడిని.

A Facebook True Love Story in Telugu

నేను కూడా అందరిలాగా డెయిలీ సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండింగ్, వైరల్, ఫన్నీ వీడియోలు, పోస్టులు చూస్తుండేవాడిని. అయితే అప్పుడప్పుడు నా ప్రొఫైల్ అకౌంట్ నుండి నాకు నచ్చిన ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తూ ఉండేవాడిని.

A Facebook True Love Story in Telugu

అలాగే నాకు రోజూ కొన్ని పదుల సంఖ్యలో ఎఫ్ బి రిక్వస్టులు వస్తూ ఉండేవి. అందులో కొందరు తెలిసినవారు.. కొందరు తెలియని వారు కూడా ఉండేవారు. అయితే ఓ రోజు సడెన్ గా నాకు 'హాయ్' అని మెసెజ్ పెట్టింది.

మొదట్లో పట్టించుకోలేదు..

మొదట్లో పట్టించుకోలేదు..

అయితే ఇదంతా నా స్నేహితుల్లో ఎవరో ఒకరు నన్ను ఆట పట్టించడానికి చేస్తున్నారని అనుకున్నాను. ఎందుకంటే కాలేజీ చదివే రోజుల్లో నేను, మా ఫ్రెండ్స్ ఇలాగే మా ఫ్రెండ్స్ ను ఆటపట్టించేవాళ్లం. అంతేకాదు, నేను కూడా మా స్నేహితులతో చాట్ చేసేవాడిని.

రెండోసారి కూడా..

రెండోసారి కూడా..

అయితే మరుసటిరోజు మళ్లీ నాకు ‘హాయ్' అని మెసెజ్ వచ్చింది. అయితే ఎవరో తెలుసుకుందాం అని నేను ఈసారి రిప్లై ఇచ్చా. అంతే అలా స్టార్ట్ అయిన మా పరిచయం కొద్ది రోజుల్లోనే బ్రేకుల్లేని బైకులా దూసుకెళ్లింది. నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. తొలిరోజుల్లో బాగానే మాట్లాడుకున్నాం. తను ఒక ప్రొఫైల్ ఫొటో పెట్టలేదు కానీ, నా ప్రొఫైల్ మొత్తం చూసేసింది. నా ఫొటోలను తను సేవ్ చేసుకుని.. ఎడిట్ చేసి నాకే వాట్సాప్ చేసేది.

ఫోన్లలో మాట్లాడుకోవడం..

ఫోన్లలో మాట్లాడుకోవడం..

ఆ తర్వాత ఒకసారి సడెన్ గా తను కాల్ కూడా చేసింది. ఎందుకో తన గొంతు వినగానే నాకు భలే నచ్చేసింది. అచ్చం శ్రియా ఘోషాల్ అంత తియ్యగా ఉంది తన వాయిస్. తన మాటతీరు కూడా చాలా బాగుంది. అంతే తన మాటలతో నన్ను మైమరచిపోయేలా చేసింది. మొత్తానికి తనకు నేను బాగా నచ్చానని తెలిసిపోయింది. నాకు కూడా తనంటే బాగా ఇష్టం పెరిగింది.

ప్రపోజ్ చేసేశా..

ప్రపోజ్ చేసేశా..

ఆ తర్వాత ఒకరోజు బయట కలుసుకోవాలని ఫిక్సయ్యాం. అలా కలుసుకున్న వెంటనే తనకు అందమైన గిఫ్టుతో ప్రపోజ్ చేసేశాను. పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పాను. అయితే తను ఏమి సమాధానం ఇవ్వలేదు. తను ఎస్ అనిందా లేదా నో అనిందా అనేది అర్థం కాలేదు. అయితే చివరిగా వెళ్లేటప్పుడు మాత్రం ‘ఇంకా టైం ఉంది' అని చెప్పింది.

నాకు తొందరెక్కువ..

నాకు తొందరెక్కువ..

అయితే నాకేమో తొందరెక్కువ. నేను ఆగలేకపోయాను. ఏ విషయమైనా ఇప్పుడే చెప్పమని తొందరపెట్టాను. అంతే తను చాలా బాధపడింది. నాకేమో ఏమి అర్థం కాలేదు. మా అమ్మ కన్న తననే ఎక్కువ అని చెప్పా. అర్థం చేసుకుంటాదనుకున్నా. కానీ రిప్లై ఇవ్వకుండా వెళ్లిపోయింది.

ఫేస్ బుక్ లోనూ రిప్లై లేదు..

ఫేస్ బుక్ లోనూ రిప్లై లేదు..

అప్పటి నుండి ఫేస్ బుక్ లో కూడా రిప్లై ఇవ్వలేదు. కానీ తను ప్రతిరోజూ ఆన్ లైన్ లో ఉంటోంది. ఫోన్ చేస్తే రిప్లయ్ ఇవ్వడం నా ప్రేమ తనకి అర్థం కాలేదని తెలుసుకున్నా. అయితే ఓ రోజు మళ్లీ సడన్ గా మెసెజ్ చేసింది. అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. అందుకే నేను నిన్ను కలవలేదు అని చెప్పింది. అంతేకాదు ఆ సమయంలో ఏం చెప్పాలో తెలియక వెళ్లిపోయానని చెప్పింది.

వయసులో పెద్దదని..

వయసులో పెద్దదని..

అయితే తను నా కంటే వయసులో మూడేళ్లు పెద్దదని చెప్పి షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే నేను ఇంత చిన్న విషయం గురించి ఆందోళన చెందుతున్నావా? నాకెలాంటి అభ్యంతరం లేదని చెప్పాను. ఎందుకంటే మన సమాజంలో, సినిమాల్లో ఎంతోమంది తమ కంటే ఎక్కువ లేదా తక్కువ వయసు ఉండేవారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా అని చెప్పేశా. అంతెందుకు రాముడి కన్నా సీత కూడా పెద్దది అని రామాయణం గుర్తు చేశా.

ప్రేమకు గ్రీన్ సిగ్నల్..

ప్రేమకు గ్రీన్ సిగ్నల్..

మొత్తానికి తను కన్విన్స్ అయ్యింది. మా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత మా ఇద్దరి కుటుంబ పెద్దలు మా ప్రేమ పెళ్లికి ఎలాంటి షరతులు పెట్టకుండా ఒప్పుకున్నారు. అంతే కొద్దిరోజుల్లోనే మాకు పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు' అని ఓ యువకుడు తన ఫేస్ బుక్ ప్రేమ కథ గురించి వివరించాడు.

Story first published: Thursday, July 1, 2021, 17:29 [IST]
Desktop Bottom Promotion