For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Valentine Day Special : ప్రేమించాను.. పెళ్లాడాను.. పెద్దల మనసులూ గెలిచేశాను... కానీ...

|

నా పేరు రాజారావు. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం. మేమిద్దరం ఒకే ఊరి వారు కావడం వల్ల మా ఇద్దరికీ చిన్నప్పటి నుండే పరిచయం ఉండేది.

అలా మా ఇద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అతి కొద్ది కాలంలోనే నేను తను నేను బెస్ట్ ఫ్రెండ్ గా మారిపోయాం. మా ఊళ్లో నా ఫ్రెండ్ కు ఏ సమస్య వచ్చినా నాకు చేతనైనంత సహాయం చేసేవాడిని.

అలా నాకు తెలియకుండానే వాళ్ల ఫ్యామిలీకి నేను అండగా ఉండేవాడిని. అయితే అలా ఒకరోజు తన చెల్లిని చూశాను. అప్పుడే కొత్తగా తనతో పరిచయం ఏర్పడింది.

తొలి పరిచయంలో మా ఇద్దరి మధ్య కనీసం స్నేహం కూడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే నేను వాళ్ల ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా ఉండే వాడినో.. అప్పుడే మా ఇద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త స్నేహంగా మారింది. అంతేకాదు.. మా ఇద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది కూడా...

నాకు తెలియని ఎన్నో విషయాలు

నాకు తెలియని ఎన్నో విషయాలు

అప్పటి నుండి తన గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు, అనేక కోణాలు తెలుసుకున్నాను. అప్పటికే నేను పార్ట్ టైమ్ జాబ్ చేస్తుండేవాడిని. నాకున్న పరిచయాల ద్వారా తను ఎంత మంచిదో.. తనకు ఎంత అద్భుతమైన వ్యక్తిత్వమో నాకు పూర్తిగా తెలిసిపోయింది.

నన్నే అడిగేది...

నన్నే అడిగేది...

అలా మా ఇద్దరం ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటున్న క్రమంలో తన పదో తరగతి పూర్తయ్యింది. అప్పటికే నేను తన కన్నా సీనియర్. నాకు మ్యాథ్స్ సబ్జెక్టు బాగా వచ్చు. దీంతో నేను తనకు క్లాసులు కూడా చెప్పేవాడిని. అలా మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలిసేలోపే తను పదో తరగతి పూర్తయ్యింది. ఆ తర్వాత తను ఇంటర్మీడియట్లో కూడా చేరడం చకచకా జరిగిపోయింది. ఇక అప్పటి నుండి తనకు ఏ డౌట్ వచ్చినా నన్నే అడిగేది.

ఒకరితో ఒకరు ఎంతో సమయం

ఒకరితో ఒకరు ఎంతో సమయం

అలా ప్రతిరోజూ మేమిద్దరం ఒకరితో ఒకరు ఎంతో సమయం గడిపేవాళ్లం. రోజులు గడిచేకొద్దీ తన ప్రేమలో పడిపోయానని నాకు అర్థమైంది. అయితే తను నన్ను ప్రేమిస్తుందా లేదా అనే విషయం చెప్పడానికి చాలా భయపడేవాడిని.

నా కళ్ల ముందు

నా కళ్ల ముందు

అయితే తొలిసారిగా ప్రేమలో పడినప్పుడు మనసులో కలిగే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నా కళ్ల ముందు ఒక అందమైన కొత్త రంగుల లోకం వాలినట్టు అనిపించేది. తనకు కూడా అలానే అనిపించేదట. అయితే ఆ విషయం తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే నా మనసులోని ప్రేమను తనకు చెప్పడానికి ఎంతో భయపడ్డాను. అలాగని మౌనంగా ఉంటే నా ప్రేమలో విజయం సాధించలేనని అర్థమైంది.

 ప్రేమ గురించి చెప్పేశా...

ప్రేమ గురించి చెప్పేశా...

అది 2008వ సంవత్సరం. ఓ రోజు సాయంత్రం మేమిద్దరం రెగ్యులర్ గా కలుసుకునే చోటుకు వెళ్లాం. అప్పుడు తనతో నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో తనకు కూడా అర్థమయ్యింది. కానీ తను మాత్రం బయటపడలేదు. అయినా కూడా నా మనసులోని మాటను.. తనపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసేశా. అయితే తను మాత్రం ఎస్ ఆర్ నో ఏదీ చెప్పలేదు. కొంత టైం అడిగింది. అయితే రెండు మూడు రోజుల్లోనే నాకు తన నుండి సానుకూల సమాధానం వచ్చేసింది.

మాటల్లో చెప్పలేనంత ఆనందం..

మాటల్లో చెప్పలేనంత ఆనందం..

ఇంకేముంది అప్పటివరకూ నా మనసులో తన పట్ల ఉన్న ఫీలింగ్స్ కు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. మాటల్లో చెప్పలేనంత ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

మా ప్రేమ ప్రయాణానికి అనుకోకుండా..

మా ప్రేమ ప్రయాణానికి అనుకోకుండా..

అలా అప్పుడే మొదలైన మా ప్రేమ ప్రయాణానికి అనుకోకుండా పెద్ద అవాంతరమే వచ్చి పడింది. తన అన్నయ్య నాకు క్లోజ్ ఫ్రెండ్. పైగా మా ఇద్దరిదీ వేర్వేరు కులాలు. అయినా ధైర్యం చేసి నేను మా ఇంట్లో.. తను వాళ్ల ఇంట్లో మా ప్రేమ విషయం గురించి చెప్పేశాం. అచ్చం సినిమాల్లో మాదిరిగానే మా ఇంట్లో.. వాళ్ల ఇంట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు. వారు నో చెప్పినప్పటికీ మేము మా ప్రేమను కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అంతలోపే భవిష్యత్తుపై తనకు నేను నమ్మకం కలిగేలా చేశాను. అప్పటికే నేను 'ఈనాడు' లో రిపోర్టర్ గా పని చేస్తున్నాను.

2011లో ఏడడుగుల బంధంతో...

2011లో ఏడడుగుల బంధంతో...

మా ఇంట్లో వాళ్లు, తన తల్లిదండ్రులు మా ప్రేమలో నిజాయితీని గుర్తించలేకపోయారు. అలా మూడేళ్లు ప్రేమించుకున్న మేము 2011లో ఏడడుగులు బంధంతో కొత్త లైఫ్ స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాం. అంతే తను ఇంటర్ మధ్యలోనే నాతో కలిసి జీవితం పంచుకోవాడానికి సిద్ధపడింది. అంతే మా ప్రేమ ప్రయణాన్ని పెళ్లి పట్టాలు ఎక్కించాలని డిసైడ్ అయ్యాను. ఆ వెంటనే నేను స్నేహితుల సహాయంతో వాళ్ల ఇంటికి నేరుగా వెళ్లాను. అప్పటికే నా కోసం రెడీ అయ్యి ఉన్న తను వచ్చి బైక్ ఎక్కేసింది. అక్కడి నుండి పట్టణం వెళ్లిన మేము పెళ్లి చేసుకోకుండా.. ఓ వారం రోజులు పాటు ఇరు కుటుంబాల నుండి ఏమైనా రెస్పాండ్ వస్తుందేమో అని ఎదురుచూశాం.

MLA కూడా మద్దతు..

MLA కూడా మద్దతు..

అప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ఇక చేసేదేమీ లేక గుడిలో దేవుడి ఎదుట పూజారి మంత్రాలతో, స్నేహితుల సమక్షంలో ఒక్కటయ్యాం. మా పెళ్లికి మా MLA కూడా మద్దతుగా నిలిచారు.

కులాలు కాదు.. ప్రేమే ముఖ్యం..

కులాలు కాదు.. ప్రేమే ముఖ్యం..

అలా ఒక్కటైన మా ఇద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వారిద్దరితో కలిసి మేము హాయిగా జీవిస్తున్నాం. కొన్నాళ్ళకు మా ఇంట్లో వాళ్ళు మా ప్రేమను అంగీకరించినా, తన పేరెంట్స్ మాత్రం ససేమీరా అన్నారు. అయితే అకస్మాత్తుగా ఇటీవలే వారి కుటుంబం నుండి రెస్పాన్స్ వచ్చింది. మా ప్రేమలోని నిజాయితీని గుర్తించి.. వారి కుటుంబ సభ్యులుగా గుర్తించారు. లేటుగానైనా.. కులాలు కాదు.. ప్రేమే ముఖ్యమని తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది..

మీరు కూడా ఎవరినైనా నిజాయితీగా ప్రేమిస్తే ఎవ్వరికి భయపడకండి.. పెద్దలు ఎప్పటికైనా ప్రేమను ఒప్పుకుంటారు.. అందుకు నా ప్రేమ కథే ఉదాహరణ..

ఇట్లు

మీ మహంతి రాజారావు

English summary

A True Love Story about Rajasiri in Vizayanagarm

Here we are talking about the a true love story about Rajasiri in Vizayanagaram. Read on
Story first published: Sunday, February 14, 2021, 8:00 [IST]