Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
వింతలకే వింత... విమానంతో వివాహమాడనున్న ఆ మహిళ... మీరు విన్నది నిజమే...
ఈ ప్రపంచంలో చాలా మంది చాలా వస్తువులను ఇష్టపడతారు. వాటికి ప్రాణం లేకపోయినా.. వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటారు. వారి పర్మిషన్ లేకుండా ఎవరైనా వాటిని తాకితే తెగ కోపం తెచ్చుకుంటారు.
ఈ కాలంలో ఎవరైనా అమ్మాయి ఎవరితో అయినా ప్రేమలో పడిందంటే... చాలా మంది ఏమనుకుంటారు.. ఏ అందమైన యువకుడినో.. లేదా తన చిన్ననాటి చెలికాడినో.. అని అనుకుంటారు. ఈ మధ్యన కొంత విచిత్రంగా అమ్మాయిలతో అమ్మాయిలు కూడా ప్రేమలో పడటం..

పెళ్లిళ్లు చేసుకోవడం వంటి వాటి గురించి కూడా మీరు వినే ఉంటారు. అయితే జర్మనీకి చెందిన ఓ అమ్మాయి మాత్రం విమానంతో ప్రేమలో పడిందట.. అది వింత అనుకుంటే.. అదే విమానంతో వివాహం చేసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అంతేకాదు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా చెప్పి ఒప్పించిందంట.. ఇంతకీ తను విమానంతో ప్రేమలో ఎలా పడింది... ఎందుకు ఆ విమానంతో వివాహం చేసుకోవాలనుకుంటుందో కూడా కారణాలు కూడా చెప్పింది. ఆ వివరాలేంటో మీరు చూడండి...

ఆరేళ్ల క్రితమే..
బెర్లిన్ కు చెందిన మిచెల్ కోబ్కే 2014లో బోయింగ్ 737 విమానాన్ని చూసింది. అంతే అప్పటి నుండి తన మనసంతా దానిపైనే ఉండిపోయిందట. తొలి చూపులోనే అది తెగ నచ్చిందట.అంతే అప్పటి నుండి ఆ విమానంతో ప్రేమలో పడిపోయిందట..

ఊహాల్లో తేలుతూ..
అప్పటినుండి నిత్యం ఆ విమానం గురించి ఊహాల్లో తేలియాడుతూ ఉండేదట. అంతేకాదు దానికి ‘స్కాట్జ్ (డార్లింగ్)‘ అని ముద్దు పేరు కూడా పెట్టేసిందట.

2019లో తొలి ముద్దు..
ఇక 2019 సంవత్సరంలో 40 టన్నులు ఉన్న జెట్ ను తొలిసారిగా ముద్దు పెట్టుకున్నట్లు తెలిపింది. అలా ఆ విమానంపై తనకు ఎంత ప్రేమ ఉందో చెప్పే ప్రయత్నం చేసింది. అంతేకాదు విమానాన్ని ముద్దు పెట్టుకున్న క్షణాన్ని తన జీవితంలో మరచిపోలేను అంటోంది.

ఇలాంటి క్షణాల్ని..
తన జీవితంలో ఇలాంటి క్షణాల్ని శాశ్వతం చేసుకునేందుకు ఆ విమానాన్ని వివాహం చేసుకోనున్నట్లు చెప్పుకొచ్చింది. తొలుత ఈ విమానంతో పెళ్లి విషయం చెప్పగా తన తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారట. అయితే ఆ తర్వాత వారు ఈ నిర్ణయాన్ని స్వాగతించారట.

నెదర్లాండ్ లో పెళ్లి..
ఈ సంవత్సరం మార్చి నెల 18వ తేదీన తన కలల జెట్ బోయింగ్ 737 నెదర్లాండ్ దేశంలో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విమానాన్ని ఆరేళ్లుగా ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నట్లు కూడా వివరించింది. అంతే కాదండోయ్ ఎప్పుడూ వైట్ డ్రెస్ వేసుకునే ఆమె.. పెళ్లి రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటుందట.

తనని చూడగానే...
అంతేకాదు ‘తనతో గత ఆరేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్లు చెప్పింది. ఎయిర్ పోర్టులో ఎప్పుడూ ఈ జెట్ ను కేవలం కిటికి దగ్గర నుంచే కలుసుకునే దాన్ని.. దీంతో ఉన్నంత సేపు నాకు సమయం అనేదే తెలియదు.. ఈ జెట్ యొక్క వింగ్స్, వింగ్లేట్స్, థ్రస్టర్లను చూడగానే ఆకర్షితులిరాలిని అయ్యాను‘‘ అని తెలిపింది.

దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే..
ఈ ప్రపంచంలో చాలా మంది చాలా వస్తువులను ఇష్టపడతారు. వాటికి ప్రాణం లేకపోయినా.. వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటారు. వారి పర్మిషన్ లేకుండా ఎవరైనా వాటిని తాకితే తెగ కోపం తెచ్చుకుంటారు. అయితే వస్తువులను తమ భాగస్వామిగా ఊహించుకోవడం అనే దానిని ఓ వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు.

అబ్జెక్టోఫీలియా వ్యాధి..
అబ్జెక్టోఫీలియా వ్యాధి (ఆబ్జెక్టు సెక్సువాలిటీ) అనే ఓ డిజార్డర్ తో ఆ అమ్మాయి బాధపడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ స్థితిలో ఉన్న వారంతా వస్తువులను చూస్తూ.. వాటితో రొమాన్స్ చేయాలని భావిస్తారట.



Click it and Unblock the Notifications
