Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చాణక్య నీతి : ఈ లక్షణాలుండే వారిని అస్సలు వదులుకోకండి...
చాణక్యుని చిట్కాల ప్రకారం ఈ నియమాలను పాటిస్తే సంబంధం మరింత బలంగా మారుతుందట. అవేంటో చూసేయండి మరి.
చాణక్య పేరు వినగానే మౌర్య సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది. అందులోని చంద్రగుప్త రాజుకు అత్యంత ప్రీతిపాత్రుడిగా చాణక్యుడు పేరు తెచ్చుకున్నాడు. మన సమాజ నిర్మాణంలోనూ.. భారతదేశ చరిత్రలోనూ కౌటిల్యుడు(చాణక్యుడు) ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలిసిందే. ఆచార్య చాణక్య వేదం సారాన్ని ఒంటబట్టించుకుని అర్థశాస్త్రం పేరిట రాజనీతి శాస్త్రాన్ని కూడా రచించాడు.

ఇందులో పరిపాలనకు సంబంధించి పది భాగాలున్నాయి. అలాగే సంబంధాల గురించి ఆచార్య చాణక్య అనేక వివరాలను వెల్లడించాడు. సొంత వారితో ఎలా నడుచుకోవాలో చెబుతూ ఎప్పుడూ హద్దులు దాటకూడదని కూడా వివరించాడు.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే సాధారణంగా పురుషులలో చాలా మంది తమ భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ఆమె తెలివితేటల కంటే అందాన్నే ఎక్కువగా చూస్తుంటారు. కానీ చాణక్యుడు ఇలాంటి వారిని అస్సలు పెళ్లి చేసుకోవద్దని సూచించాడు.

అలాగే మీ జీవితంలోకి వచ్చి మహిళలు అబద్ధాలు చెబుతుంటే, అదీ ముఖ్యంగా భర్తల విషయంలో అబద్ధాలు చెప్పే వారిని అస్సలు నమ్మవద్దని హెచ్చరించాడు. ఎందుకంటే ఇలాంటి వారు కుటుంబాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉందని తెలిపాడు.

చాణక్యుని ప్రకారం, నిరంతరం జీవిత భాగస్వామి గురించి ఆలోచిస్తూ.. ఆపదొచ్చినా.. ఆనందమొచ్చినా.. ప్రతి క్షణంలోనూ భర్త వెన్నంటే ఉండి నిజమైన ప్రేమను పంచుకునే భాగస్వామిని గుర్తించి వివాహం చేసుకోవాలి.

మంచి సేవకుడు..
ఆచార్య చాణక్యుని ప్రకారం, ఏదైనా ముఖ్యమైన పనిని చేసేటప్పుడు ఒక మంచి సేవకుడిని గుర్తించాలి. ఎందుకంటే సేవకులు వారి మంచి లక్షణాల వల్ల ఎన్నుకోబడతారు. అతను మంచి పని చేయగలిగితే అతని విశ్వాసం మాత్రమే బలపడుతుంది. అయితే అతను తప్పుడు పనులు చేస్తే అతడు మంచి సేవకుడు కాదని అర్థం.

ఇబ్బందుల్లో ఉన్న సమయంలో..
క్లిష్ట సమయాల్లోనే సోదర, సోదరీమణులు గుర్తించబడతారని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే ఆనందకరమైన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా మీకు మద్దతు ఇస్తారు. అయితే మీకు ఏదైనా ఆపద కలిగినప్పుడు మాత్రం చాలా మంది సొంతవాళ్లు మొహం చాటేస్తారు. అందువల్ల మీకు ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉంటారో వారిని మాత్రమే గుర్తంచుకోవాలి. ఎందుకంటే సహకారం, మమకారం ఉన్నచోటే బంధుత్వం, ప్రేమ, ఆప్యాయత, శ్రేయస్సు ఉంటుంది.

నిజమైన స్నేహితులు..
మీరు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మాత్రమే నిజమైన స్నేహితుడు గుర్తించబడతాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే స్నేహితుడే నిజమైన స్నేహితుడు అని పిలవడానికి అర్హుడు. అలాగే, మీరు బాగున్నప్పుడు మీతో బాగా కలిసిమెలసి తిరిగి, మీరు విచారంగా ఉన్నప్పుడు, విలువల గురించి మాట్లాడి మీ నుండి దూరమయ్యే స్నేహితుడు, నిజమైన స్నేహితుడు కాదని గుర్తుంచుకోవాలి.

జీవిత భాగస్వామి గురించి..
మీతో సంపద నిండుగా ఉన్నప్పుడు కాకుండా.. మీతో సంపద లేనప్పుడు మీ జీవిత భాగస్వామిని గుర్తించాలని చాణక్య సూచించాడు. ఏ సమయం వచ్చినా, జీవిత భాగస్వామి మీతో ఉంటే, మీ కష్టాలు ఎంత పెద్దవైనా ఇట్టే తొలగిపోతాయని చెప్పాడు. అయితే మీ జీవిత భాగస్వామి క్లిష్ట సమయాల్లో మీకు సరైన మార్గదర్శకత్వం ఇచ్చి మీతో సమన్వయంగా పని చేస్తే అలాంటి భాగస్వామిని మీరు నిజమైన భాగస్వామిగా భావించాలి.



Click it and Unblock the Notifications