Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
నేటి ధన యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం మామూలుగా లేదు, జాక్ పాట్ పక్కా! -
అంగారక సంకష్ట చతుర్థి: ఈ రోజు ఉపవాసం ఉంటే కష్టాలన్నీ తీరిపోతాయా? చంద్రోదయ సమయాలు, పూజా విధానం ఇదే! -
2026 మే 5 గ్రహ సంచారం: మీ జాతకంలో కొత్త ఉత్తేజం.. ఆ మార్పులు మీ కోసమే!
న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ అల భాగ్యనగరంలో మొదలైందట...
న్యాచురల్ స్టార్ నాని భాగ్యనగరంలో అప్పటి తన ప్రియురాలు అంజనాతో కలిసి అల భాగ్యనగరంలో చక్కర్లు కొట్టేవారట.
న్యాచురల్ స్టార్ నాని ప్రేమ కథ కూడా అచ్చం ఓ సినిమా స్టోరీ లాగానే ఉంటుంది. రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లోనూ తన ప్రియురాలితో ప్రేమను మస్తుగా ఎంజాయ్ చేశాడట. అయితే తన ప్రేమ గురించి బయటి ప్రపంచానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడంట.

అయితే ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి అడగగా తను అప్పటికీ నిజం చెప్పలేదు. అయితే ఆ షో యాంకర్ కు నాని ప్రేమ విషయం గురించి మొత్తం తెలుసని, మీరు చెప్పకపోయినా.. నేను బయటికి లీక్ చేస్తా అని తనను కంగారు పెట్టింది.

అయితే ఆ సమయంలో నానికి ఏమి చేయాలో అర్థం కాలేదట. వెంటనే తేరుకుని ఆమెను అలాంటివి దయచేసి లీక్ చేయొద్దని కోరుకోవడంతో ఆమె అలాంటి పని చేయలేదంట.

అయితే సినిమా స్క్రీన్ పై ఎంతో న్యాచురల్ గా కనిపించే నాని తన నిజ జీవితంలోనూ అంతే న్యాచురల్ లవ్ ట్రాక్ నడిపాడంట. సో తన ప్రేమ కథ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందామా...

అంజనాతో అల భాగ్యనగరంలో..
న్యాచురల్ స్టార్ నాని భాగ్యనగరంలో అప్పటి తన ప్రియురాలు అంజనాతో కలిసి అల భాగ్యనగరంలో చక్కర్లు కొట్టేవారట. హీరో నాని ఆరోజుల్లో ఓ ప్రముఖ ఎఫ్ఎం ఛానెల్లో ఇంటర్న్ షిప్ చేసే సమయంలోనే అంజనాతో ప్రేమాయణం మొదలుపెట్టాడట. అదే సమయంలో అంజనాను పికప్ చేసుకోవడానికి నాని ఆ ఎఫ్ంఎం ఛానెల్ బయట గంటల కొద్దీ పడిగాపులు కాసేవాడట.

తొలుత స్నేహం..
నాని ఎప్పుడైతే హీరోగా నిలదిక్కుకుంటున్నాడో.. ఆ తొలి రోజుల్లోనే తన స్నేహితుడికి కజిన్ వరసైన అంజనా యలవర్తితో తొలుత స్నేహం చేశాడట. అయితే వారిద్దరికి పరిచయమైన తొలి రోజుల్లో ఒకరంటే ఒకరికి పడి చచ్చేంత ఇష్టమున్నా వారు ఆ ప్రస్తావనను ఎప్పుడూ బయటపెట్టుకోలేదట.

ఎలాంటి ట్విస్టులు లేవు..
నాని, అంజనాల ప్రేమలో మనకు ఎక్కడా కూడా సినిమాల్లో లాగా ఛేజింగులు, ఫైటింగులు వంటివి ఏమీ లేవు. అంతేకాదు ఎలాంటి ట్విస్టులు కూడా లేవు. ఎందుకంటే వీరి ప్రేమ కూడా చాలా న్యాచురల్ గా సాగిపోయింది.

సహజమైన ప్రేమ..
తమ ప్రేమ గురించి ఈ విషయాన్ని కేవలం వారి సన్నిహితులకు మాత్రం తెలుసట. ఈ హీరో సినిమాల్లో ఎన్ని పాత్రలు చేసినా.. నిజ జీవితంలో మాత్ర కేవలం సహజమైన రీతిలోనే ప్రేమ వ్యవహారం నడిపాడట.

2012లో వివాహం..
మన దేశంలో ఎవరి జీవితంలో అయినా మొదట ఒక అమ్మాయితో పరిచయం. తర్వాత స్నేహం, ప్రేమ అనేవి పూర్తయిన తర్వాతనే పెళ్లి వరకు వెళ్తుంది. ఇక వీరిద్దరి ప్రేమ విషయం పెద్దలకు తెలపడంతో వారి ఇరు కుటుంబాల్లో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. దీంతో వీరిద్దరూ కలిసి కుటుంబం, పెద్దలు, స్నేహితుల సమక్షంలో 2012లో వివాహం చేసుకున్నారు.

అప్పట్లో బాగా పాపులర్..
అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుండి అగ్ర హీరోగా ఎదిగిన న్యాచురల్ స్టార్ నాని తన స్నేహపూర్వమైన స్వభావంతో సినిమా రంగంలో ఎందరో మిత్రులను సంపాదించుకున్నారు. దీంతో ఆయన వివాహానికి ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అప్పట్లో నాని-అంజనా ఎంగేజ్ మెంట్ వీడియో మంచి పాపులర్ అయ్యింది. ఎందుకంటే అప్పట్లో ఎంగేజ్ మెంట్ వీడియోల కల్చర్ కు అంతగా ప్రాధాన్యత లేదు. అయితే ఈ వీడియో ద్వారా ఎంగేజ్ మెంట్ మంచి పాపులారిటీ వచ్చింది. అప్పట్లో ఈ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

2017లో అర్జున్ పుట్టుక..
ఈ రొమాంటిక్ కపుల్ ప్రేమకు కానుకగా 2017లో అర్జున్ జన్మించాడు. అందుకే ఇంతకుముందు తను నటించిన జెర్సీ సినిమాలో నాని పోషించిన పాత్రకు అర్జున్ అనే పేరు కూడా పెట్టారు.
ఈ హీరో తన కెరీర్ ను ఎంత న్యాచురల్ గా మొదలుపెట్టాడో.. తన ప్రేమ ప్రయాణాన్ని అంతే సహజంగా స్టార్ చేసి... సాఫీగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి ప్రేమికులు చాలా అరుదుగా ఉంటారు.



Click it and Unblock the Notifications