Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఆంధ్రా అబ్బాయి.. రష్యన్ అమ్మాయి.. దేశాలు దాటిన ప్రేమ.. పెళ్లిదాకా వెళ్లిందా?
ఆంధ్రా అబ్బాయి.. రష్యా అమ్మాయి లవ్ మ్యారేజ్ స్టోరీ ఎలా స్టార్టయ్యిందో తెలుసా.
ప్రేమ, ప్యార్, ఇష్క్, ప్రీతి ఈ రెండక్షరాలకు ఎంతో పవర్ ఉంది. అందుకే ప్రేమలో పడిన వారు కులం, మతం, ప్రాంతం, ధనం, ఆస్తి, అంతస్తులేవీ చూడరంటారు.. ప్రేమలో ఉన్న వారికి ఎలాంటి హద్దులు ఉండవంటారు నిజమైన ప్రేమికులు.

ఒకప్పుడు మనం రెండు వేర్వేరు రాష్ట్రాల వ్యక్తుల మధ్య ప్రేమ గురించి చూశాం.. చూస్తున్నాం కూడా. అయితే ఇద్దరు వేర్వేరు దేశాలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమ సాధ్యమవుతుందా? వీరిలో ఒకరిది ఇండియా, అందులోనూ మన తెలుగబ్బాయి.

మరొకరేమో రష్యాకు చెందిన వ్యక్తి. మనోడికి రష్యన్ భాష రాదు.. తనకేమో తెలుగు భాష అస్సలే తెలీదు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి భాష ఏ మాత్రం అడ్డు రాలేదు. కేవలం వీరిద్దరి భావాలు.. మనోభావాలు కలిశాయి.. అంతే వీరి ప్రేమ కథ ప్రారంభమైంది. మరీ వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా లేదా మన తెలుగు సినిమాల్లో చూపించినట్టు ఎప్పటిలాగే నో చెప్పేశారా అనే ఆసక్తకిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రేమకేదీ అడ్డుకాదు..
కొందరేమో ప్రేమ గుడ్డిది అంటారు. మరొకందరేమో ప్రేమ గొప్పది అంటారు. నిజమైన ప్రేమికులు మాత్రం ప్రేమకు హద్దులు.. సరిహద్దులు ఏమీ ఉండవని చెబుతుంటారు. ఇలా ప్రేమలో పడిన ప్రతి ఒక్కరూ ప్రేమ గురించి కొత్త కొత్త నిర్వచనాలు చెబుతూ ఉంటారు.

అందమైన అమ్మాయితో..
ఇక అసలు విషయానికొస్తే.. విశాఖ జిల్లాకు చెందిన నరేష్ అనే యువకుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం రీత్యా ఓసారి రష్యా దేశానికి వెళ్లాడు. మనోడు ఆ దేశంలో అడుగుపెట్టిన వెంటనే అంతా కొత్తగా అనిపించింది. సరిగ్గా అదే సమయంలో తన కంపెనీలో పని చేసే అందమైన అమ్మాయితో పరిచయం అయ్యింది. తన పేరే ఇరీనా.

ప్రేమగా మారిపోయింది..
ఇంకేముంది మనోడు చూపించే ప్రేమకు రష్యన్ అమ్మాయి ఇరీనా ఫిదా అయిపోయింది. వారిద్దరి పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పటినుండి వారిద్దరూ పార్కులు, షాపింగ్, సినిమాలంటూ బాగా ఎంజాయ్ చేశారు. ఇదే సమయంలో వారిద్దరికీ తెలియకుండా వారి స్నేహం ప్రేమగా మారిపోయింది.

పెద్దలకు తెలియడంతో..
అయితే వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లోని తల్లిదండ్రులకు, ఇతర బంధువులకు తెలిసిపోయింది. ఇంకేముంది మన తెలుగు సినిమాల్లో చూపించినట్టుగానే.. మన కులం కాదు.. మతం కాదు.. అసలు మన దేశమే కాదంటూ నో చెప్పారు. అయితే వీరిద్దరి ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి.. మనోడు ముందుగా మనోళ్లను ఒప్పించాడు. ఆ తర్వాత రష్యన్ ఫ్యామిలీని మెప్పించాడు. అంతే రెండు కుటుంబసభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హిందూ సంప్రదాయంలో..
ఇంకేముంది మనోడి కల నిజమైంది. కానీ ఎంతైనా మగపెళ్లి వారు కదా.. మన హిందూ సంప్రదాయంలోనే పెళ్లి జరగాలని పట్టుబట్టారు. అందుకు ఇరీనా పేరేంట్స్ కూడా ఒప్పుకోవడంతో వీరి పెళ్లికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదు.

అంగరంగ వైభవంగా..
వీరిద్దరూ రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతుందని ముందే ఊహించారేమో. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్న వెంటనే.. మనోడు ఆఘామేఘాల మీద ఆంధ్రాకు తన ఫియాన్సీతో వచ్చేశాడు. చకచకా పెళ్లి ఏర్పాట్లను చేసేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ జిల్లాలో వివాహ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విశేషం ఏంటంటే.. వీరి పెళ్లికి రష్యా నుంచి చాలా మంది రిలేటివ్స్ వచ్చారు. అంతేకాదు ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు, ఇతర ప్రముఖులు వీరి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. ఇలా వీరి ప్రేమ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన కొద్ది రోజులకే రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ స్టార్ట్ అయ్యింది.



Click it and Unblock the Notifications