For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ప్రియమైన వారిని ఇలా ఆట పట్టించండి.... వారి ఫేసులో రియాక్షన్లు చూడండి...

వారిని ఫూల్స్ ను చేశాక.. వారి ఫేసుల్లోని చిరు కోపం.. అమాయకత్వాన్ని చూస్తే ఆ మజాయే వేరు.

|

ఏప్రిల్ ఒకటో తేదీ మరి కొద్ది క్షణాల్లో రాబోతుంది. ఈరోజున చాలా మంది తమకు ఇష్టమైన వారిని, ప్రియమైన వారిని, స్నేహితులను బకరా చేసి ఆట పట్టించడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు అంటే నీ ముఖం మీద ఏదో నల్లగా ఉందని చెప్పడం.. వారు అది నిజమని నమ్మి వెంటనే అద్దంలో వెళ్లి చూసుకోవడం.. వెంటనే వారికి ఏప్రిల్ ఫూల్ చేయడం.. అమ్మో నీ కాళ్ల దగ్గర క్రోచ్ ఉంది అంటే అకస్మాత్తుగా భయపడి చూసుకునే కాలం ప్రస్తుతం లేదు.

April Fools Pranks For Boyfriend That Will Get You His Funniest Reactions

ఎందుకంటే పాతరోజుల మాదిరిగా కల్లబొల్లి కబుర్లు చెబితే నమ్మే రోజులు పోయాయి. పైగా తిరిగి మనకే రివర్స్ పంచ్ లు తగులుతుంటాయి. అందుకే ట్రెండ్ కు తగ్గట్టు మనం కూడా మన స్నేహితులను, బంధువులను ఫూల్స్ చేయడానికి అప్ డేట్ అవ్వాలి. అలా వారిని ఫూల్స్ ను చేశాక.. వారి ఫేసుల్లోని చిరు కోపం.. అమాయకత్వాన్ని చూస్తే ఆ మజాయే వేరు. అలా మీకు ఇష్టమైన వారికి బకరాలు చేసేందుకు గల లేటెస్ట్ టిప్స్ ఏంటో చూడండి....

ఫోన్ తోనే మొదలెట్టండి..

ఫోన్ తోనే మొదలెట్టండి..

ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ఎవరైనా సరే ఉదయాన్నే నిద్ర లేవగానే ఫోన్ ను తప్పకుండా చూస్తారు. కాబట్టి మీ ప్రియమైనవారిని, స్నేహితులను, బంధువులను ఫోన్ తోనే ఫూల్స్ చేయడం మొదలెట్టండి. ఇందుకోసం గూగుల్ లోకి వెళ్లి మంచి రిజల్యూషన్ ఉన్న ఒక క్రాక్ డ్ స్క్రీన్ ఇమేజ్ ను ఒకటి డౌన్ లోడ్ చేయండి. దాన్ని లాక్ స్క్రీన్ వాల్ పేపర్ గా సెట్ చేసేయండి. దాన్ని చూడగానే.. వారు ఒక్క క్షణం పాటు కంగారు పడిపోతారు. ఎందుకంటే తమ ఫోన్ స్క్రీన్ నిజంగానే పగిలిపోయిందా అని వారి మైండ్ బ్లాక్ అయి వారు షాకైపోతారు.

న్యూడ్ పిక్స్ కావాలా?

న్యూడ్ పిక్స్ కావాలా?

మీ బాయ్ ఫ్రెండ్ కు నా న్యూడ్ పిక్స్ చూడాలనుకుంటున్నావా అని అడుగుతూ ఒక కొంటె వాక్యాన్ని పంపండి. అతను అవును అని సమాధానం చెప్పగానే.. (అతను స్పష్టంగా రెడీ!) అన్నప్పుడు మాత్రమే అతనికి టన్నుల కొద్దీ లిప్ స్టిక్ షేడ్స్ పంపండి. దీంతో అతను ఆశ్చర్యపోతారు.

మీ ఇంటి బయటే..

మీ ఇంటి బయటే..

మీరు ఈరోజు అతను/ఆమెను ఆశ్చర్యపరచడానికి అకస్మాత్తుగా తనకు ఫోన్ చేసి చెప్పండి.. అదేంటి అని అడిగితే.. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సరదాగా నీకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు వచ్చానని చెప్పండి. అతను బయటకు వచ్చినప్పుడు లేదా మేడపై నుండి కిందికి వచ్చినప్పుడు, అతనికి మేసేజ్ చేయండి.. ‘ఏప్రిల్ ఫూల్‘ అని.

గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ గురించి..

గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ గురించి..

చాలా మంది వారి మాజీ ప్రియుడు/ప్రియురాలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వాటి గురించి మాట్లాడేందుకు అంతగా ఇష్టపడరు. అయితే మీరు అకస్మాత్తుగా మీ ఎక్స్ కలుస్తున్నారని తెలిసింది.. ఆమెను ఎలా.. ఎప్పుడు కలవబోతున్నారో నేను మీ ఫోన్ లో చూశానని గందరగోళ సమాధానాలు.. ప్రశ్నలు వేయండి. ఆ సమయంలో వారు ఆందోళనకు గురైతే ఇది ఒక జోక్ అని వారిని ఫూల్స్ చేయండి.

పేరేంట్స్ వస్తున్నారని..

పేరేంట్స్ వస్తున్నారని..

ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర అనుమతి తీసుకుని మిమ్మల్ని కలవడానికి మీ పేరెంట్స్ వస్తున్నారు అని చెప్పండి. అంతలో మీ ప్రియమైన వారు వెంటనే వారికి ఫోన్ చేయడమో లేదా రూమ్ ను శుభ్రపరచడం వంటివి చేస్తే.. అప్పుడు ఏప్రిల్ ఫూల్ అని ఆట పట్టించండి.

కాస్త ఎక్కువగా ఉప్పు..

కాస్త ఎక్కువగా ఉప్పు..

మీరు ఈరోజు చేసే వంటలో కేవలం కాస్త ఎక్కువగా ఉప్పు వేసి ప్రత్యేకంగా ఉడికించినట్లు చెప్పండి. లేదంటే వారు తాగే నీటిలో కాస్త ఉప్పు కలిపి ఇవ్వండి. లేదా కాఫీలో చక్కెరకు బదులు చిటికెడు ఉప్పు కలిపి ఇవ్వండి.

వారి ఫోన్ లో సమయాన్ని..

వారి ఫోన్ లో సమయాన్ని..

మీకు ఇష్టమైన వారి ఫోన్ ను తీసుకుని, వారికి తెలియకుండా వారి ఫోన్ లో సమయాన్ని సుమారు అరగంట ముందుకు లేదా వెనక్కు సెట్ చేయండి. అలాగే అలారం కూడా సెట్ చేసేయండి.

ఫోన్ లోని స్నేహితుడి పేరును..

ఫోన్ లోని స్నేహితుడి పేరును..

మీరు బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ లోని స్నేహితుడు లేదా స్నేహితురాలి ఫోన్ నెంబర్ ను బ్యాంకు పేరుగా మార్చండి. అతని క్రెడిట్ లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన మీకు ఇప్పటికే తెలిసి ఉంటాయి కాబట్టి ఆ స్నేహితుడి ఫోన్ నుండి అతనికి ఓ మెసెజ్ పంపండి. 'XXXతేదీన XX మీ ఖాతాలో XXXX డబ్బు డెబిట్ చేయబడిందని మెసెజ్ పంపండి.

గ్లిట్టర్ బాంబ్...

గ్లిట్టర్ బాంబ్...

మీ స్నేహితులు లేదా సన్నిహితులు ఉండే చోట ఒక గ్లిట్టర్ బాంబు కవర్ ఉంచండి. ఎవరైనా దాని గురించి అడిగితే అందులో స్వీట్ ఉందని చెప్పండి. అప్పుడు వారు అది ఓపెన్ చేసిన వెంటనే గ్లిట్టర్ (మించు) బాంబుతో దాడి చేసేలా సిద్ధం చేసి పెట్టండి.

సోప్ బార్ పై నెయిల్ పాలిష్ తో..

సోప్ బార్ పై నెయిల్ పాలిష్ తో..

ఇది అందరికీ సులభంగా మరియు సరదాగా ఉంటుంది. మీకు ఇష్టమైన నెయిల్ పాలిష్ యొక్క రంగును మీ సబ్బును నింపేయండి. దీనిని ఎవ్వరూ ముందుగానే ఊహించరు. అయితే దీని గురించి ఎవరైనా అడిగితే, ఇది చాలా సులభమని.. వారిని బకరాలు చేయండి.

కేకలు వేయండి..

కేకలు వేయండి..

మీరు ఇంట్లో అకస్మాత్తుగా కేకలు వేయండి.. కోపంగా మారండి.. మీరు లావుగా మారిపోయారని చెప్పండి. వారు లేదు అస్సలు లేదు అని చెప్పినప్పుడు, అప్పుడు వారికి సరదాకు చేశానని చెప్పండి. ఇదంతా అబద్ధమని!

మీ ప్రియుడు/ప్రియురాలి ఫోన్ లో..

మీ ప్రియుడు/ప్రియురాలి ఫోన్ లో..

మీరు మీ స్నేహితుడు లేదా స్నేహితురాలితో చాట్ చేయండి. (మీ ఫోన్ లో అతను/ఆమె పేరుతో ఒక వ్యక్తి మార్చడం ద్వారా) అప్పుడు మీరు ప్రియుడు/ప్రియురాలి చాటింగ్ చూశారని నిర్ధారించుకోండి. అప్పుడు అసలైన డ్రామా ఆరంభించండి. మీ ప్రియుడు లేదా ప్రియురాలు ఫోన్ లాక్కునేందుకు ఇదొక చిలిపి పని.

సరదాగా మరిచిపోతున్నట్లు..

సరదాగా మరిచిపోతున్నట్లు..

మీరు సరదాగా వంట చేసే ఏదైనా పదార్థాన్ని వేయడం మానేయండి. మీరు పని చేసే కంపెనీ పేరు ఏంటి? మనం ఎంత కాలంగా కలసి ఉంటున్నాం. ఇలాంటి విషయాలను వారు నమ్మేంత వరకు సాధారణంగా నటించండి. ఇది వారిని తీవ్రంగా భయపెడుతుంది. అప్పుడు మీ నవ్వును ఆపుకోవడానికి మీరు తీవ్రంగా ప్రయత్నించాలి.

రింగ్ టోన్ ను...

రింగ్ టోన్ ను...

మీకు ఇష్టమైన వారి ఫోన్ తీసుకుని వారి రింగ్ టోన్ ఉల్లాసంగా ఉండే పాటగా మార్చేయండి. అతను ఎవరైనా స్నేహితులు లేదా బంధువులతో లేదా సహోద్యోగులతో ఉన్న సమయంలో అతనికి ఫోన్ చేయండి. అప్పుడు వారు కచ్చితంగా ఇబ్బందికరంగా మరియు ఆశ్చర్యకరంగా ఫీలవుతారు.

English summary

April Fool's Pranks For Boyfriend That Will Get You His Funniest Reactions

Here we talking about april fool's pranks for boyfriend that will get you his funniest reactions. Take a look
Desktop Bottom Promotion