Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
Relationship Tips: పెళ్లయ్యాక మీరు సుఖంగా ఉన్నారా? సంతోషం, సంతృప్తి ఉందో లేదో ఇలా తెలుసుకోండి
మీరు పెళ్లయ్యాక సుఖంగా ఉన్నారా, భాగస్వామితో సంతోషం లభిస్తుందా, జీవితంలో సాఫీగా సాగుతుందో లేదో ఈ సంకేతాలు చెప్పేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వివాహం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడే పవిత్ర బంధం. ఇది ఒకరికొకరు ఆనందం, ప్రేమ, మద్దతునివ్వడం. అయితే కొన్ని సార్లు పెళ్లి బంధంలో ఉండటం అనుకున్నంత సంతోషంగా ఏమీ ఉండదు. వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయమని, పెళ్లి చేసుకుని సంతోషం లేమని అనే వారు చాలా మందే ఉంటారు.

మీరు పెళ్లయ్యాక సుఖంగా ఉన్నారా, భాగస్వామితో సంతోషం లభిస్తుందా, జీవితంలో సాఫీగా సాగుతుందో లేదో ఈ సంకేతాలు చెప్పేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కమ్యూనికేషన్:
ఏ సంబంధానికైనా కమ్యూనికేషన్ చాలా కీలకం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం బాగుండాలంటే కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. మనసులో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా మీ భావాలను భాగస్వామితో తెలియజేస్తే అపార్థాలు లేకుండా సాఫీగా సాగుతుంది.
భార్యాభర్తలు ఇద్దరూ ఏ విషయాలు దాచిపెట్టకుండా, తమ భావోద్వేగాలు, ఆలోచనలను పంచుకోగలిగే పరిస్థితి ఉంటే ఆ బంధం సాఫీగా సాగుతున్నట్లే.

అనుకూలత:
సంతోషకరమైన వివాహంలో అనుకూలత కూడా చాలా ముఖ్యం. జంటలు ఒకే విధమైన విలువలు, ఆసక్తులు, లక్ష్యాలను కలిగి ఉండాలి. జంటలు ఒకరితో ఒకరు అనుకూలంగా లేకపోతే, అది విభేదాలకు దారితీస్తుంది.
ఇది వివాహంలో ఉద్రిక్తతను, అసంతృప్తిని కలిగిస్తుంది. అయితే ఇద్దరు వ్యక్తులు సరిగ్గా ఒకేలా ఉండరని గమనించడం ముఖ్యం. కాబట్టి కొన్ని తేడాలు సాధారణమైనవే. మీ ఇద్దరి మధ్య అనుకూలత లేకపోతే ఆ సంబంధంలో కలహాలు మొదలవుతున్నట్లు గమనించాలి.

సాన్నిహిత్యం:
భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉండాలి. కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం, శారీరక ఆప్యాయత, భావోద్వేగ సాన్నిహిత్యం, బంధానికి ముఖ్యమైనవి.
వైవాహిక జీవితంలో శారీరక సాన్నిహిత్యం లోపిస్తే, మీ బంధంలో ఏదో మార్చుకోవాల్సి ఉందని గుర్తించాలి. మాటలు, చేతల ద్వారా సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి.

గౌరవం:
ప్రతి బంధంలో గౌరవం కీలకం. వివాహ బంధంలోనూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇద్దరు భాగస్వాములు ఒకరినొరు గౌరవించుకుంటేనే ఆ బంధం బలంగా మారుతుంది. ఒక భాగస్వామి మరొకరి భావాలను, అవసరాలను, భావోద్వేగాలను విస్మరిస్తే అది అసంతృప్తి, నిరాశకు దారి తీస్తుంది. దీని వల్ల సంబంధం సాఫీగా సాగదు.

మద్దతు:
సంతోషకరమైన వివాహంలో మద్దతు కీలకం. భాగస్వాములు ఇద్దరూ ఒకరికి ఒకరు ఎప్పుడూ మద్దతు ఇచ్చుకోవాలి. కష్ట సమయంలో కూడా మీ భాగస్వామికి మద్దతుగా నిలవాలి. అప్పుడే అది నిజమైన బంధం అనిపించుకుంటుంది.



Click it and Unblock the Notifications