Latest Updates
-
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే! -
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?
మద్యం తాగి శృంగారంలో పాల్గొంటే వచ్చే తీవ్రమైన సమస్యలు ఇవే.. జాగ్రత్త మరి!
చాలా మంది చెప్పుకోరు కానీ.. మద్యం తాగి శృంగారంలో ఎక్కువగా పాల్గొంటారు. శృంగార సామర్థ్యం పెంచుకోవడానికని, మద్యం సేవించి శృంగారంలో పాల్గొనే ఎక్కువ సేపు చేస్తామని ఆలోచనల కారణంగా మద్యం తాగి శృంగారంలో పాల్గొంటుంటారు. అయితే మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం వల్ల లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువగా ఉంటాయి. మద్యం తాగి శృంగారంలో పాల్గొంటే అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటి? మద్యం తాగి శృంగారంలో పాల్గొనచ్చా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మద్యం తాగి శృంగారం చేయడం వల్ల కలిగే నష్టాలు:
లైంగిక సామర్థ్యం తగ్గుతుంది
మద్యం తాగినప్పుడు మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల లైంగిక కోరిక తగ్గిపోతుంది. దీనివల్ల లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. స్ఖలనం కావడంలో తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వల్ల మీ అంగం మెత్తబడడంతో పాటు శృంగారంలో మీరు ఎలాంటి ప్రభావాన్ని సృష్టించలేరు.

అకాల స్ఖలనం
మద్యం తాగడం వల్ల మెదడు చాలా ప్రభావితం అవుతుంది. మద్యం తాగడం వలన ప్రేరణను నియంత్రిచే మెదడు భాగం క్షీణతకు గురవుతుంది. దీని వల్ల అకాల స్ఖలనం అవుతుంది. అసలు సమయం సందర్భం లేకుండా స్ఖలనం చేసుకునే ఛాన్సుంటుంది.
రక్త ప్రసరణ తగ్గుతుంది
మద్యం తాగినప్పుడు శరీరంలోని రక్త నాళాలు సంకోచానికి గురవుతాయి. దీని వల్ల లైంగిక అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీని కారణంగా లైంగిక ఉత్తేజం తగ్గిపోవడంతో పాటు లాంగిక అవయవాలు కూడా చురుగ్గా పని చేయవు. దీని వల్ల శృంగారంలో మీరు పాల్గొన్నా మీ భాగస్వామిని ఎలాంటి భావప్రాప్తిని ఇవ్వలేరు.
సంతానోత్పత్తి సామర్థ్యం..
చాలా మంది ఇటీవల కాలంలో సంతానలేమి కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటికి ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ.. మద్యం సేవించి శృంగారంలో పాల్గొనడం కూడా ఒక ముఖ్యమైన కారణం. మద్యం తాగడం వలన స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. దీని వల్ల సంతానం కలగకపోవడంతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయి.
విశ్వాసం కోల్పోతారు
శృంగారంలో పాల్గొనేటప్పుడు మద్యం తాగి పాల్గొనడం వలన.. సరైన భావప్రాప్తిని ఇవ్వలేరు. అలాగే మీ భాగస్వామి ముందు మీరు విశ్వాసాన్ని కోల్పోతారు. మీరు శృంగారానికి పనికిరారనే భావన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా మద్యం సేవించడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాలేయం దెబ్బతినడం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.



Click it and Unblock the Notifications