For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రతిక్రీడను రఫ్ గా ప్రయత్నించాలంటే.. ముందు వీటి గురించి తెలుసుకోవాలట...!

|

మనలో చాలా మందికి రోటీన్ గా ఆ కార్యంలో పాల్గొనడం అంటే చాలా బోర్ కొడుతుంది. అయితే ఇటీవలి కాలంలో కొందరు జంటలు రతి క్రీడను చాలా భిన్నంగా ట్రై చేయాలనుకుంటున్నారట.

దీని వల్ల తమ లైంగిక జీవితంలో మరింత మజా పెరుగుతుందని చాలా మంది కపుల్స్ భావిస్తున్నారట. దీనికి సినిమాల ప్రభావమో.. లేదా ఇంకేదో కారణమై ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎవరికైతే రెగ్యులర్ గా కలయికలో పాల్గొంటున్నారో.. ఎవరైతే రోటీన్ అని ఫీలవుతారో.. అలాంటి వారే ఇలాంటి విభిన్నమైన పద్ధతులను ప్రయత్నిస్తున్నారట. అయితే అలా చేయాలనుకునేవారు ఈ పద్ధతుల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.. ఆ ఆసక్తికరమైన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Zodiac signs: రాశిచక్రాన్ని బట్టి తమ లైఫ్ లో ఇలాంటి భాగస్వామి కావాలని కోరుకుంటారట...!

ఇద్దరికీ ఇష్టమైతేనే..

ఇద్దరికీ ఇష్టమైతేనే..

రతి క్రీడలో కొత్తగా లేదా ఏదైనా విభిన్నమైన పద్ధతిని ప్రయత్నించాలంటే ముందుగా కపుల్స్ ఇద్దరూ దీన్ని ఇష్టపడాలట. ఇందులో భాగంగానే కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి, లేదా సంకేళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టేసి రకరకాలుగా ట్రై చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మీ మాటలు చాలా సున్నితంగా ఉండాలట.

పూర్తి అవగాహన..

పూర్తి అవగాహన..

అయితే ఇలా రఫ్ గా రతిక్రీడలో పాల్గొనే వారు కొన్ని పద్ధతులు కచ్చితంగా పాటించాలట. అలా చేసినప్పుడే వారు ఆ కార్యంలో అంతులేని ఆనందాన్ని, స్వర్గపు అంచుల దాకా వెళ్లిన అనుభూతిని పొందుతారు. ముందుగా ఇందులో ఏ మాత్రం సున్నితత్వం ఉండదని తెలుసుకోవాలి. వీటిని ట్రై చేసే ముందు మీరిద్దరూ పూర్తి అవగాహనతో ఉండాలి. అప్పుడే రతిక్రీడ రఫ్ గా ఉన్నా.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

మానసికంగా సిద్ధంగా..

మానసికంగా సిద్ధంగా..

మరోవైపు రతిక్రీడను రఫ్ గా ప్రయత్నించాలనుకునే వారు మానసికంగా కూడా సిద్ధంగా ఉండాలి. మీరు సరైన నాలెడ్జ్ తో మరియు ఏకాభిప్రాయ పద్ధతులతో ఆ కార్యంలో ఆనందాన్ని పొందొచ్చు. అప్పుడు కలిగే నొప్పి కూడా హాయిగా అనిపిస్తుంది.

బాధ పెట్టకూడదు..

బాధ పెట్టకూడదు..

కొందరు కపుల్స్ సాధారణంగా డర్టీ టాక్ చేస్తుంటారు. ఇది వారికి పడకగదిలో చేరిన వెంటనే అలవాటైపోతుంది. అయితే దీని వల్ల భాగస్వామి మూడ్ చెడిపోతుందట. మీరు మాట్లాడే బూతులతో ఎదుటివారు బాధపడకుండా ఉండాలట.

ప్రేమలో పడిన కొత్తలో అవి కోల్పోవాల్సిందేనా? మీకూ ఇలా జరిగిందా?

ఎప్పటికప్పుడు..

ఎప్పటికప్పుడు..

మీరు రతిక్రీడలో రఫ్ గా ప్రయత్నించే సమయంలో మీ భాగస్వామి ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవాలి. వారికి ఏ క్షణంలో అయినా అసౌకర్యంగా అనిపిస్తే.. మీరు వెంటనే అక్కడితో ఆగిపోవాలి. కాదని మీరు బలవంతం చేస్తే పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి.

ఒకరికొకరు..

ఒకరికొకరు..

మీరిద్దరూ లైంగిక క్రీడలో రఫ్ నెస్ కోసం ప్రయత్నించే ముందే వాటి గురించి వివరంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. మీకు ఎలాంటి లైంగిక అవసరాలున్నాయి. మీరిద్దరూ ఎలాంటి లైంగిక కార్యాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారో.. ఒకరినొకరు ముందుగా మాట్లాడుకుని తెలుసుకోండి. మీ లైంగిక కోరికలు, ఫీలింగ్స్, అవసరాలన్నీ మీ ఇద్దరికీ ఒకే విధంగా ఉండాలి. అప్పుడే మీరు ఆ కార్యాన్ని ఆనందంగా పూర్తి చేస్తారు.

పార్ట్ నర్ కు ఇష్టమైతే..

పార్ట్ నర్ కు ఇష్టమైతే..

ఇలాంటి కార్యాల గురించి మీ పార్ట్ నర్ కు ఇష్టమైతే చాలు.. మీరు ఎవ్వరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఇలాంటి పద్ధతులను ప్రయత్నించిన వారితో మాట్లాడొచ్చు. వారి అనుభవాల గురించి అడిగి తెలుసుకోవచ్చు. దీని వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది.

కొరడాలతో కొట్టడం..

కొరడాలతో కొట్టడం..

రతి క్రీడలో రఫ్ నెస్ లో భాగంగా కొరడాలతో కొట్టడం వంటివి కూడా ప్రయత్నిస్తుంటారు కొందరు. అయితే మీరు కూడా ఇలాంటివి ట్రై చేయాలనుకుంటే.. వీటిని ఎలా అనుసరించాలో అనే సమాచారాన్ని ఆన్ లైన్లో అన్వేషించండి. మీరిద్దరూ కలిసి ఇలాంటి వాటిని చూడటం వల్ల.. ఎంతో మజాను అనుభవిస్తారు.

English summary

Basic Ground Relationship Rules That Strengthen Your Bond

Here we are talking about the basic ground relationship rules that strengthen your bond. Have a look