For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా చేస్తే మీ భాగస్వామి మైండ్ సెట్ ఈజీగా మార్చొచ్చు...

మీ ప్రియుడిని సులభంగా నవ్వించేందుకు గల మార్గాలేంటో చూసేయ్యండి.

|

ఈ లోకంలో ఏ ఇద్దరు వ్యక్తుల సంబంధంలో అయినా చిన్న చిన్న గొడవలు, వాదనలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అయితే కొందరి జీవితాల్లో ఇవి చిలికి చిలికి గాలివానలా మారి తీవ్రమైన సమస్యలుగా మారిపోతుంటాయి.

https://telugu.boldsky.com/relationship/love-and-romance/tips-for-dealing-with-a-know-it-all-coworker-in-telugu-026436.html

అయితే వీటిని పెద్దగా పట్టించుకోకుండా.. దీనికి గల కారణాలేంటో తెలుసుకుంటే.. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే.. ఆ రిలేషన్ సాఫీగా సాగిపోతుంది. అయితే కొందరు ఇలాంటి సమయంలో క్షమాపణ చెప్పడం లేదా పార్ట్ నర్ ను నవ్వించడానికి ప్రయత్నిస్తారు.

https://telugu.boldsky.com/relationship/love-and-romance/tips-for-dealing-with-a-know-it-all-coworker-in-telugu-026436.html

అలా చేయడం వల్ల సమస్యలకు పరిష్కారం లభించదు.. కానీ భాగస్వామిని బాగా ఉత్సాహపరచొచ్చు. అలాంటి సమయంలో భాగస్వామిని చిరునవ్వుతో ప్రోత్సహించేందుకు సహాయపడుతుంది.. ఈ సందర్భంగా మీ భాగస్వామిని ఉత్సాహపరచే మార్గాలేంటో చూసెయ్యండి మరి...

'నేను బాస్ తో క్లోజ్ గా ఉన్నానని... కొలీగ్స్ నా గురించి..''నేను బాస్ తో క్లోజ్ గా ఉన్నానని... కొలీగ్స్ నా గురించి..'

మీ పార్ట్ నర్ మాటలను వినండి..

మీ పార్ట్ నర్ మాటలను వినండి..

మీ భాగస్వామి ఏదైనా విషయం గురించి ఆందోళన చెందటం లేదా బాధపడుతున్నారని మీకు అనిపిస్తే.. మీరు వారి సమస్యలను వినడం చాలా ముఖ్యం. మీ అభిప్రాయాలు మరియు సలహాలను ఇవ్వడానికి బదులుగా, వారు చెప్పేది వింటున్నారని నిర్ధారించుకోండి. ఎందుకంటే చాలా మంది తాము విచారంగా ఉన్నప్పుడు, తమ సమస్యలను ఎవరైనా వినాలని కోరుకుంటారు. ముఖ్యంగా తమ మనసులో మాటల్ని భాగస్వామితో పంచుకోవాలని కోరుకుంటారు. అలా చేయడం వల్ల వారు మంచి అనుభూతి పొందుతారు.

తప్పులను ఎత్తి చూపడం..

తప్పులను ఎత్తి చూపడం..

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అయితే వారి తప్పును అదే పనిగా వేలెత్తి చూపే పని లేదు. కానీ మీ భాగస్వామి మూడ్ బాగోలేకున్నప్పుడు, మీరు వారి తప్పులను ఎత్తి చూపడం వంటివి చేయకూడదు. అలా చేస్తే మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత దిగజారిపోవచ్చు. మీ భాగస్వామి మనస్తాపం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తను విచారంగా ఉన్నప్పుడు మీ పార్ట్ నర్ చేసిన తప్పులను ఎత్తిచూపకుండా.. వాటిని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పడం ఉత్తమం. దీని వల్ల వారు ఎంతో సంతోషిస్తారు.

భాగస్వామిని ఓదార్చండి..

భాగస్వామిని ఓదార్చండి..

మీ భాగస్వామి మంచి అనుభూతి పొందాలంటే, మీరు కొన్ని పనులు చేయాలి. ఉదాహరణకు మీరు తనకు ఇష్టమైన ప్రదర్శన ఇవ్వొచ్చు. మెల్లగా మసాజ్ లేదా ట్యూన్ ఇవ్వొచ్చు. ఒకవేళ తను అందుకు ఆసక్తి చూపకపోతే, మీరు కొన్ని మంచి జ్ణాపకాలను గుర్తు తెచ్చే ప్రయత్నం చేయొచ్చు. మీరు మీ భాగస్వామిని గట్టిగా హత్తుకోవచ్చు. ఒకవేళ మీరు తనకు దూరంగా ఉంటే, మీరు కాల్స్ లేదా మెసెజ్ ల ద్వారా మధురమైన విషయాలు మాట్లాడటానికి ప్రయత్నించొచ్చు.

ఆలుమగలు ఆ విషయంలో అస్సలు రాజీ పడకూడదట...!ఆలుమగలు ఆ విషయంలో అస్సలు రాజీ పడకూడదట...!

రుచికరమైన పదార్థాలు..

రుచికరమైన పదార్థాలు..

మనం తినే ఆహారం కూడా మన మూడ్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీ భాగస్వామి మూడ్ ను మార్చేందుకు మీరు మానసిక స్థితిని పెంచే కొన్ని రుచికరమైన ఆహారాలను తయారు చేయాలి. ముఖ్యంగా మీ భాగస్వామికి ఏ ఆహారం ఇష్టమో.. ఆ రెసిపీని రెడీ చేయాలి. ఇందుకోసం మీ తల్లి లేదా ఇంటర్నెట్, యూట్యూబ్ నుండి కొన్ని వంటకాల వివరాలను తెలుసుకోవాలి. ఒకవేళ మీకు అంత ఓపిక లేకపోతే, మీరు మంచి ఆహారాన్ని ఆర్డర్ చేయొచ్చు. దీంతో మీ భాగస్వామి మీపై ఉన్న అభిప్రాయాలను పాజిటివ్ గా మార్చుకుంటాడు.

లాంగ్ డ్రైవ్..

లాంగ్ డ్రైవ్..

మీరు మీ భాగస్వామితో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లడం లేదా నడవటం వంటిది చేసినప్పుడు ఎంతో మంచి అనుభూతి కలుగుతుంది. మీ భాగస్వామిని లాంగ్ డ్రైవ్ కు తీసుకెళితే.. మీరు తనలో ఉత్సాహాన్ని చూడొచ్చు. ఇది మీ భాగస్వామి మూడ్ ను కచ్చితంగా మారుస్తుందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీరు అలా వెళ్లడానికి కుదరకపోతే, అప్పుడు ఇద్దరూ కలిసి చిన్నగా వాకింగ్ చేయొచ్చు. అయితే ఇందులో మీ భాగస్వామి మంచి అనుభూతి చెందాలంటే, మీరు మీ భాగస్వామిని సమీపంలోని పార్కుకు లేదా ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లొచ్చు.

విజయాల జాబితా..

విజయాల జాబితా..

మీ భాగస్వామి సాధించిన విజయాల జాబితా గురించి తనతో ప్రస్తావిస్తే..వారు బాగా ఉత్సాహపడతారు. దీంతో మీరు తన శక్తి, సామర్థ్యాలను విశ్వసించేలా చేయొచ్చు. ఇది మీ భాగస్వామికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీరు తనతో ఉన్నట్టే అనిపిస్తుంది. అంతేకాదు మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

భాగస్వామిని ప్రేరేపించండి..

భాగస్వామిని ప్రేరేపించండి..

జీవితంలో ఏమి సాధించాలన్నా ప్రేరణ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి లక్ష్యాలను, ఆశయాలను మీ భాగస్వామి సాధించాలంటే, మీరు వారికి సహాయంగా ఉండాలి. ముఖ్యంగా వారు ఏదైనా సమయంలో నిరాశకు గురైనప్పుడు, మీ భాగస్వామికి లక్ష్యాలు, ఆశయాలను ఎందుకు సాధించాలో వివరించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి సాధారణంగానే వస్తుంటాయి. వాటిని కొన్ని అందంగా మారగలవు. మరికొన్ని వికారంగా మారగలవు. కాబట్టి ఇద్దరి మధ్య ప్రేమ, సాన్నిహిత్యం ఉంటే అన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి.

English summary

Beautiful Ways In Which You Can Cheer Up Your Partner During Tough Times

What would you do when you find your partner upset and sad over something? Leaving your partner all by himself/herself can be the wrong thing to do. Therefore, we are here with some ways that can help you in cheering him/her.
Story first published:Saturday, May 15, 2021, 14:40 [IST]
Desktop Bottom Promotion