For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో ఈ రహస్యాల గురించి మీకు తెలుసా...

|

మనలో ప్రతి ఒక్కరి లైఫ్ లో కొన్ని సీక్రెట్స్(Secrets) ఉంటాయి. ఇలాంటి రహస్యాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. అయితే తాము ప్రాణానికి ప్రాణంగా నమ్మే వారితో.. ముఖ్యంగా తమ భాగస్వాములతో ఇలాంటి సీక్రెట్లను చాలా మంది షేర్ చేసుకుంటూ ఉంటారు.

కొందరేమో తమ మనసులోని అన్ని సీక్రెట్లను దాచుకుంటూ ఉంటారు. అయితే కొన్ని సీక్రెట్లను ఎదుటివారితో షేర్ చేసుకోవడం వల్ల మనకు మంచే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సీక్రెట్లు షేర్ చేసుకోవడం వల్ల హ్యాపీగా ఉండటం.. మనసులో భారమంతా పోయినంత ఫీలింగును కలిగిస్తుంది.

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. సీక్రెట్ల విషయానికొస్తే.. శృంగార రహస్యాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇలాంటి విషయాలు మీరు మీ పార్ట్నర్ ను లేదా ఎదుటి వ్యక్తికి మరింత సన్నిహితంగా మారేందుకు, భార్యభర్తల మధ్య సంబంధం బలపడేందుకు సహాయపడతాయి. ఈ సందర్భంగా శృంగారం గురించి తమ భాగస్వామితో షేర్ చేసుకోవాలనుకునే సీక్రెట్లు ఏంటనే ఆసక్తిరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మహిళలు మగాళ్లలో ఎక్కువగా ఏం గమనిస్తారో తెలుసా...

రకరకాల సీక్రెట్స్..

రకరకాల సీక్రెట్స్..

మనలో చాలా మంది మగవారు చాలా విషయాల్లో ప్రాక్టికల్ గా ఉంటారని అనుకుంటారు. అయితే శృంగారం విషయంలో మాత్రం మగవారు ఊహల లోకలో విహరిస్తూ ఉంటారట. శృంగారంలో రతి మన్మథుడిలా రెచ్చిపోతున్నట్టు.. నీలి చిత్రాల్లో చూసినట్టు అలాంటి యాంగిల్స్ లో తాము కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు రకరకాల కలలు కంటూ ఉంటారు. వాటిలో కొన్ని సీక్రెట్లను పార్ట్నర్ తో పంచుకుంటారు.

సూపర్ హీరోలా..

సూపర్ హీరోలా..

యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్క మగాడికి శృంగారంలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు ఆ కార్యంలో పాల్గొందామా అని తహతహలాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా మంది పురుషులు శృంగారంలో సూపర్ హీరో కావాలని కోరుకుంటారు. వారు మిమ్మల్ని కలయికలో సుఖపెట్టినప్పుడే.. వారు సూపర్ హీరోగా భావిస్తారు. కాబట్టి మీరు మీ భాగస్వామితో ఆ కార్యంలో ఆస్వాదిస్తూ ఉంటే.. దీన్ని మీ మనసులో ఉంచుకోకుండా.. మీ వారితో షేర్ చేసుకుంటే.. వారు మిమ్మల్ని మరింత ప్రేమిస్తారని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువగా వెయిట్ చేయరు..

ఎక్కువగా వెయిట్ చేయరు..

మగవారు ఆ కార్యం విషయానికొస్తే.. పడకగదిలో ఎక్కువసేపు వేచి ఉండటం అనేది అస్సలు ఇష్టపడరు. కాబట్టి మీ పార్ట్నర్ ఆ కార్యానికి సంబంధించి ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ తను మిమ్మల్ని ఉద్వేగానికి గురి చేయలేకపోతే.. ఆ విషయం తనతో షేర్ చేసుకోకండి. అయితే పరోక్షంగా వాటిని చెప్పేందుకు ప్రయత్నించండి. లేదంటే తనలో మూడ్ పెరిగేలా తనను ప్రోత్సహించండి.

పెద్దలు చేసే పెళ్లిలో ముఖ్య ప్రయోజనాలు.. నష్టాలివే...!

కొత్తగా కోరుకుంటూ..

కొత్తగా కోరుకుంటూ..

చాలా మంది మగవారు శృంగారం విషయంలో ప్రతిరోజూ కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ కోరికలను అందరూ తమ భాగస్ామితో షేర్ చేసుకోరు. కానీ మీకు కూడా అలాంటి కోరికలు ఉంటే బాగుండు అని భావిస్తారు. ఒకవేళ మీకు కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటే.. మీరిద్దరూ కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. స్వర్గపు అంచుల దాకా అనుభూతిని పొందొచ్చు.

అలా చేస్తూ.. ఆనందాన్ని..

అలా చేస్తూ.. ఆనందాన్ని..

చాలా మంది మగాళ్లు శృంగారాన్ని ఎల్లప్పుడూ ఒకే రకంగా చేయాలని అస్సలు అనుకోరు. అందుకే ఎక్కువగా సున్నితంగా ప్రయత్నించినా.. కొన్నిసార్లు నొప్పిలోనే ఆ కార్యంలో ఆనందంగా ఫీలవుతారు. అందుకే కొన్నిసార్లు కలయికను హార్డ్ గా ట్రై చేస్తారు. మరికొన్ని సార్లు మీ అనుమతి లేకుండానే.. మీకు ఇష్టం లేకపోయినా వేగంగా ఆ కార్యంలో పాల్గొంటూ ఉంటారు. ఇదంతా వారిలో ఎప్పటినుంచో పేరుకుపోయిన కోరికలకు కారణమని చెప్పొచ్చు.

మీ కలల గురించి..

మీ కలల గురించి..

చాలా మంది కపుల్స్ ఆ కార్యం గురించి ఎన్ని కలలు కన్నప్పటికీ.. వారి కలల గురించి తమలోనే దాచుకుంటారు. తాము తమ పార్ట్నర్ తో ఎక్కువ టైమ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. అందుకే ప్రాక్టికల్ గా ఆ కార్యాన్ని ప్రారంభించేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల రొమాన్స్ చేయడానికి కొంత సమయం ఎక్కువ పడుతుంది. ఈ టైములోనే వారికి కావాల్సిన ఆనందాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు పురుషులు రాత్రైనా.. పగలైనా.. శృంగారాన్ని బాగా ఆస్వాదించాలని కోరుకుంటారు. ముఖ్యంగా బాగా పని చేసి అలసిపోయాక.. పార్ట్నర్ తో పడకగదిలో సేద తీరేందుకు దీన్ని ఒక వాహకంగా ఉపయోగించుకుంటారు.

ఇద్దరు దగ్గరవ్వాలని..

ఇద్దరు దగ్గరవ్వాలని..

చాలా మంది మగవారు తమ శరీరాన్ని తాము ఎంతగానో ప్రేమిస్తారు. అయితే వారి శరీరాన్ని చూసి మీరెలా ప్రవర్తిస్తారో.. అనే విషయాలను తెలుసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా ఆ కార్యంలో పాల్గొన్నప్పుడు మిమ్మల్ని సుఖపెడుతున్నామా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలని ఆరాటపడతారట. ఇలా మీరిద్దరూ మీ మనసులోని భావాలను షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని భావిస్తారట.

English summary

Bedroom Secrets Every Woman Must Know in Telugu

Here are the bedroom secrets every woman must know in Telugu. Take a look