For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పడకగదిలో ఈ వాస్తు చిట్కాలను ఫాలో అయితే.. ‘ఆ’కార్యంతో పాటు అన్నింటా విజయాలే...!

|

మన దేశంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాతన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు చాలా మంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతారు. వాస్తు శాస్త్రాల ప్రకారమే ఇళ్లను నిర్మించుకుంటారు.

అప్పుడే తమ ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని.. ప్రశాంతమైన వాతావరణం గడపొచ్చని.. తమ వైవాహిక జీవితం కూడా మెరుగుపడుతుందని భావిస్తారు. ఇదిలా ఉండగా.. వివాహ జీవితంలో దీర్ఘకాలిక బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి, ముఖ్యంగా పడకగదిలో మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెంచుకోవడానికి కొన్ని వాస్తు చిట్కాలను కచ్చితంగా ఫాలో అవ్వాలని పండితులు చెబుతున్నారు.

ఎందుకంటే ఎలాంటి ఆరోగ్యకరమైన సంబంధానికైనా ప్రేమ, సంరక్షణ మరియు గౌరవం అనేది కీలకం. ఇవన్నీ తమ బంధంలోనే ఉంటేనే ఆ సంబంధం సంతోషకరంగా.. సాఫీగా సాగుతుందని వారి నమ్మకం. ఈ సందర్భంగా పడకగదిలో వాస్తు శాస్త్రం ప్రకారం ఎలాంటి చిట్కాలు పాటించాలి.. ముఖ్యంగా కొత్త జంటలు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

స్త్రీలు తెలియకుండా చేసే 'ఈ' తప్పులతో మగాళ్లకు దూరమవుతారట...!

పడకగది పరిమాణం..

పడకగది పరిమాణం..

మన చేతికి ఉండే ఐదు వేళ్లు ఒకే రకంగా ఉండవు. అలాగే మనం నివసించే ఇల్లు.. అందులోని పడకగది కూడా సరైన సైజులో ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంట్లో పెద్దగా ఉండే స్థలాన్ని హాలుకు కేటాయిస్తూ ఉంటారు చాలా మంది. ఇక వాస్తుశాస్త్రం ప్రకారం, ఇంటి పెద్దకు సంబంధించిన గది కచ్చితంగా నైరుతి మూలలో ఉండాలి. అలాగే ఇంటి మధ్యలో బెడ్ రూమ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేసుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలా చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయట.

ప్రతికూల ప్రభావం..

ప్రతికూల ప్రభావం..

మన ఇంట్లో నైరుతి మూలలో పెద్ద గదిని కలిగి ఉండటం దాదాపు అసాధ్యం. కాబట్టి ఉన్నంతలో మీరు అతి పెద్ద గదిని ఎంపిక చేసుకుని ఆ గదిలో దక్షిణానికి లేదా పశ్చిమ గోడకు బెడ్ ఉండేలా చూసుకోవాలి. గదిలో నిద్రిస్తున్న జంట తలభాగం దక్షిణంగా లేదా పశ్చిమoగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ కాళ్ళ భాగం ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండేలా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. అయితే గదిలో ఏ మూలకు కూడా బెడ్ ని ఆపాదించవద్దు. అలా చేస్తే మీకు ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి.

బాత్ రూమ్ డోర్..

బాత్ రూమ్ డోర్..

పడకగదిలో బాత్రూమ్ ఉత్తరం లేదా పశ్చిమం వైపున ఉండాలి. ఒక వేళ గది మార్చినా లేక స్నానపు తొట్టి దిక్కుని మారుస్తున్నా మీరు కేటాయింపులు చేయవలసి వస్తే, అది అదే దిశలో జరుగుతుందని నిర్ధారించుకోండి. బాత్రూమ్ నేరుగా మంచానికి ఎదురుగా ఉండరాదు, అది అనేక ప్రతికూల ప్రభావాలను తెస్తుంది. బాత్రూం తలుపు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మూసే ఉంచండి.

మీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే...

రెండు తలుపులు వద్దు..

రెండు తలుపులు వద్దు..

దక్షిణం దిక్కున కాకుండా , మాస్టర్ బెడ్ రూమ్ కి ఏ ఇతరదిక్కుకైనా తలుపు ఉండేలా ఎంచుకోవాలి. తూర్పు లేదా ఉత్తరం గోడలు ప్రత్యేకంగా కిటికీలకు సరిపోతాయి. వాస్తు ప్రకారం బాత్రూమ్ కి ఒకే తలుపు ఉండేలా చూసుకోవాలి. రెండు తలుపులు ఉండేలా తీసుకోరాదు. దీని కారణంగా ఒకే తలుపు తెరుచుకోవడం, మూయడం జరుగుతుంది. తద్వారా శబ్ధాలకు తావుండదు. వివాహిత జంటలు మాత్రమే మాస్టర్ బెడ్ రూమ్ లో ఉండటం మంచిది. మాస్టర్ బెడ్రూంకి భారీ కర్టెన్లు ఉంచరాదు.

గ్యాడ్జెట్లు వాడొద్దు..

గ్యాడ్జెట్లు వాడొద్దు..

ప్రస్తుత ఆధునిక కాలంలో గ్యాడ్జెట్లు బాగా ఎక్కువైపోయాయి. స్మార్ట్ టీవి, స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లేనిదే రోజు గడవడం చాలా కష్టంగా మారింది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మీ పడకగదిలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. ఒకవేళ టి‌వి ఉంటే.. అది ఆగ్నేయం వైపు ఉండేలా చూసుకోవాలి. హీటర్లు, కూలర్లు ఏవైనా వాటిని సరైన ఎత్తులో అమర్చుకోవాలి. అప్పుడే మీరిద్దరూ ఏకాంతంగా ఎంజాయ్ చేయగలరు.

బెడ్ రూమ్ లో మేకప్ వద్దు..

బెడ్ రూమ్ లో మేకప్ వద్దు..

బెడ్ రూమ్ లో కనీసం ఒక అద్దమైనా అనివార్యంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన మహిళ అద్దం బెడ్ రూమ్ లో ఉండరాదు, పడకగదిలో మేకప్ కూడా చేసుకోరాదు. ఒక వేళ బెడ్రూంలో అద్దం ఉంచాల్సిన పరిస్తితి వస్తే, మీ శరీరంలో ఏ భాగం అద్దంలో కనపడుటం లేదని నిర్ధారించుకోండి. మీరు మంచంపై నిద్రిస్తున్నప్పుడు ముఖ్యంగా మీరు అద్దంలో కనపడరాదు. కావున మీ డ్రెస్సింగ్ టేబుల్లో ఒక అద్దం ఉందో లేదో నిర్ధారించుకోండి. అలాగే ఉత్తరం లేదా తూర్పు దిక్కున అద్దం ఉందని నిర్ధారించుకోండి.

అనేక కలహాలు..

అనేక కలహాలు..

మీ ఇంట్లోని ఆగ్నేయ విభాగంలో ఒక బెడ్ రూమ్ ఉండటం వల్ల భార్యభర్తల మధ్య అనేక కలహాలు వస్తాయి. అంతేకాదు అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ ఇద్దరి మధ్య ప్రతిరోజూ గొడవలు వస్తూనే ఉంటాయి.

ఈవైపున వద్దు..

ఈవైపున వద్దు..

ఏ ఇంట్లో ఈశాన్యం వైపు దేవతలకు కేటాయించబడిన స్థలంగా పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి వైపున మీరు పడకగది నిర్మాణ ఆలోచనను విరమించుకోవడం మంచిది. ఒకవేళ మీరు ఈశాన్యం వైపున మాస్టర్ బెడ్రూం కలిగి ఉంటే.. అలాంటి జంటలకు అనేక ప్రతికూల పభావాలు ఎదురై

తద్వారా ఆరోగ్య, ఆర్ధిక సంబందిత సమస్యలతో ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ వైపున ఎట్టి పరిస్థితుల్లో బెడ్ రూమ్ ఏర్పాటు చేసుకోవద్దు.

ఆ ఫొటోలు వాడొద్దు..

ఆ ఫొటోలు వాడొద్దు..

ప్రస్తుత కాలంలో గోడలపై రంగులు వాడటం సర్వసాధారణమైపోయింది. అయితే వాస్తు ప్రకారం రోజ్, యాష్, బ్లూ, చాక్లెట్ లేదా గ్రీన్ కలర్లను సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్లో లేదా ఆరెంజ్ రంగుల జోలికి అస్సలు వెళ్లొద్దు. అలాగే దక్షిణాన లేదా పశ్చిమ గోడలకు మెజ్జనైన్ నేలను కలిగి ఉండటం అనేది మంచి ఆలోచన అని గుర్తుంచుకోండి. గోడల మీద అందమైన, ఆహ్లాదకరమైన పెయింటింగ్ వేయాలని కూడా మీరు భావిస్తారు. ఇది అనుకూలతను ప్రసరింపచేస్తుంది మరియు గదిలోకి ప్రవేశించే వ్యక్తి మంచి అనుభూతికి లోనవుతారు. అయితే, మీరు ప్రతికూల లేదా హింసాత్మక ఫోటోలు మరియు దేవుడి ఫోటోలను మరియు విగ్రహాలను పడకగదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకండి. దీని వల్ల కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి.

English summary

Bedroom Vastu tips Improve Your Love Life in Telugu

Check out the important bedroom vastu tips to improve your love life. Read on.
Story first published: Monday, August 9, 2021, 17:23 [IST]