For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లైన వారి కంటే.. సింగిల్ గా ఉంటేనే ఎక్కువ ఆనందంగా ఉంటారట...! ఎందుకో తెలుసా..?

పెళ్లైన వారి కంటే సింగిల్ గా ఉండే వారి లైఫ్ ఎందుకు బెటర్ గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

|

మన దేశంలో ఆడవారికి 18 ఏళ్లు నిండి పాతికేళ్లు దాటాయంటే చాలు పెళ్లి అయిపోవాలని భావిస్తుంటారు చాలా మంది. అదేవిధంగా మగవారికి 25 ఏళ్ల నుండి 30 సంవత్సరాలలోపు పెళ్లి కాలేదంటే చాలు వారిలో ఏదో లోపం ఉన్నట్టుగా చూస్తుంటారు.

Benefits of Being Single better Understood by Married People

అందుకే చాలా మంది పేరేంట్స్ తమ పిల్లల చదువులు, లైఫ్ సెటిల్ కాకముందే పెళ్లి సంబంధాల కోసం తెగ అన్వేషిస్తూ ఉంటారు. మరికొందరైతే బాల్యవివాహాలకు సైతం సిద్ధపడతారు.

Benefits of Being Single better Understood by Married People

ఇంకా కొందరైతే ఆడపిల్లల చదువులు పూర్తి కాకముందే... పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ఇక పాతికేళ్లు దాటాయంటే చాలు బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులు తెలిసినవారంతా పెళ్లి చేసుకోమని తెగ ఇబ్బంది పెడుతుంటారు.

Benefits of Being Single better Understood by Married People

మాకు తెలిసిన అమ్మాయి అక్కడుంది.. ఫలానా అబ్బాయితో మాట్లాడమని ఉచిత సలహాలు ఇస్తూనే ఉంటారు. అయితే ఇప్పటికీ సింగిల్ ఉండేవారందరికీ ఓ గుడ్ న్యూస్. అదేంటంటే.. ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో.. వారి కంటే సింగిల్ గా ఉన్నవారే ఎక్కువ హ్యాపీగా ఉంటారట. అంతేకాదు సింగిల్ గా ఉండేవారు జీవితాన్ని చివరివరకూ చాలా ఆనందంగా కొనసాగిస్తారట. ఈ విషయం ఇటీవల జరిగిన ఓ పరిశోధనలో తేలిందట. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మూడేళ్లుగా ప్రేమ... మూడు ముళ్లు పడేదెప్పుడో... పెళ్లి దగ్గరకొచ్చేసరికి...మూడేళ్లుగా ప్రేమ... మూడు ముళ్లు పడేదెప్పుడో... పెళ్లి దగ్గరకొచ్చేసరికి...

పెళ్లి అపొహల గురించి..

పెళ్లి అపొహల గురించి..

లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కి చెందిన బిహేవియర్ సైన్స్ ప్రొఫెసర్ పౌల్ డోలన్ పెళ్లి చేసుకున్న వారి కంటే సింగిల్ గా ఉండేవారు ఆడవారైనా.. మగవారైనా జీవితం చివరివరకూ చాలా హ్యాపీగా ఉంటారట.

పెళ్లి తర్వాత..

పెళ్లి తర్వాత..

ఆ ప్రొఫెసర్ రాసిన హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ : ఎస్కేపింగ్ ద మిత్స్ పర్ఫెక్ట్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకంలో పెళ్లికి సంబంధించిన అపొహల గురించి.. పెళ్లి తర్వాత జీవితంలో ఎదురయ్యే ప్రభావాల గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఇటీవలే ఈ విషయంపై తన అభిప్రాయాన్ని కూడా పంచుకున్నారు.

ఆనందం ఉండదని..

ఆనందం ఉండదని..

పెళ్లి చేసుకున్న వ్యక్తులు ఆనందంగా ఉండాలంటే.. తమ పార్ట్ నర్ తో కేవలం పడకగదిలో ఉండి వారితో మాట్లాడుతూనే ఉండాలని అలా జరగకపోతే వారిలో హ్యాపీ అనేదే ఉండదని వెల్లడించారు. అదే పెళ్లి అయిన వారితో కంపేర్ చేస్తే పెళ్లి కాని వారికి ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవట.

చాలా బాధగా..

చాలా బాధగా..

అదే విధంగా పెళ్లి చేసుకున్న వారు తమ పడకగదిలో తమ పార్ట్ నర్ లేకపోయినా కూడా హ్యాపీగా ఫీలవ్వరు. ఎందుకంటే తమ పార్ట్ నర్ తమ గదిలో లేకపోతే వారు ఏదో కోల్పోయినట్టుగా.. చాలా బాధగా ఫీలవుతారట.

ఇవి అలవాటు చేసుకుంటే అమ్మాయిని ‘ఆ' విషయంలో అవలీలగా ఆకట్టుకోవచ్చు...!ఇవి అలవాటు చేసుకుంటే అమ్మాయిని ‘ఆ' విషయంలో అవలీలగా ఆకట్టుకోవచ్చు...!

మగవారికి కొంత హ్యాపీ..

మగవారికి కొంత హ్యాపీ..

అయితే ఈ బాధ ఎక్కువగా ఆడవారికి ఎక్కువగా ఉంటుందట. మగవారికి మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత కొంత ఆనందం లభిస్తుందని చెప్పారు. అదే పెళ్లి చేసుకున్న ఆడవారు మాత్రం తమ ఆనందాన్ని కోల్పోతున్నారు.

ఒత్తిడి తట్టుకోలేరు..

ఒత్తిడి తట్టుకోలేరు..

పెళ్లి చేసుకున్న వారికి మొదటి మూడు రోజులు లేదా మూడు నెలలు బాగున్నప్పటికీ.. ఆ తర్వాత నుండి అసలైన పరీక్ష మొదలవుతుంది. భార్య బాధ్యత.. పిల్లలు పుట్టాక ఖర్చులు ఇతర సమస్యలు, ఒత్తిడి పెరిగిపోతాయి. దీన్ని వారు తట్టుకోలేరట.

ఫ్యామిలీ లైఫ్..

ఫ్యామిలీ లైఫ్..

అప్పటిదాకా ఒంటరిగా హాయిగా ఎంజాయ్ చేసిన వారికి, అకస్మాత్తుగా ఫ్యామిలీ లైఫ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ గురించి వారికి పెద్దగా తెలియకపోవడం ఒక ఎత్తు అయితే.. అత్త,మామయ్యలు, పిల్లలు, బంధువుల నుండి ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో తెలీదు.

ఎక్కడికి వెళ్లాలన్నా..

ఎక్కడికి వెళ్లాలన్నా..

సింగిల్ గా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఎప్పుడైనా.. ఎలాగైనా హాయిగా వెళ్లొచ్చు. అది సినిమా అయినా.. జర్నీ అయినా.. ఇంకేదైనా.. అదే పెళ్లి అయినప్పుడు మాత్రం వీటన్నింటికీ బ్రేక్ చెప్పాల్సిందే. ఎక్కడికి వెళ్లాలన్న జంటగా వెళ్లాల్సి వస్తుంది. ప్రతి దానికీ ఒక టైం అంటూ మెయింటెయిన్ చేయాలి.

English summary

Benefits of Being Single better Understood by Married People

Here are the benefits of being single better understood by married people. Read on
Story first published:Thursday, February 18, 2021, 17:15 [IST]
Desktop Bottom Promotion