Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీ భాగస్వామికి మూడొస్తే ఇలా చేస్తారు.. ఓ లుక్కేయండి
సిగ్గు పడటం, తరచూ తాకడం, గిల్లడం లాంటివి చేస్తుంటారు. మీ భాగస్వామి ఇలాంటి పనులు చేస్తున్నా, వారి బాడీ లాంగ్వేజీ ఇలా ఉన్నా.. వారు మీతో శృంగారం చేయాలని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి.సంబంధం, మ్యారేజ్ అండ్ బియాండ్, శృంగ
భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండాలని, ఏ దాపరికాలు ఉంచుకోవద్దని, రహస్యాలు దాచొద్దని, ఏ పనీ వారికి తెలియకుండా చేయొద్దని ఇలా చాలా మంది చాలా చెబుతారు. అయితే అన్ని విషయాలను భాగస్వామితో మాటల్లో చెప్పలేం. మొహమాటం వల్లో, ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలో తెలియకపోవడం వల్లో మన భావాలను మాటల్లో వ్యక్తం చేయలేము. సంజ్ఞల ద్వారా, చేతల ద్వారా, పనుల ద్వారా, బాడీ లాంగ్వేజ్ ద్వారా వారి భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. శృంగారం విషయంలో ఈ పరిస్థితిని చాలా మంది ఎదుర్కొంటారు.

భాగస్వామితో శృంగారం చేయాలని ఉన్నా.. మాటల ద్వారా చెప్పేందుకు సిగ్గు పడుతుంటారు చాలా మంది మహిళలు. నోటి మాటల ద్వారా రొమాన్స్ కావాలని చెప్పకుండా చిలిపి పనులు చేస్తుంటారు. సిగ్గు పడటం, తరచూ తాకడం, గిల్లడం లాంటివి చేస్తుంటారు. మీ భాగస్వామి ఇలాంటి పనులు చేస్తున్నా, వారి బాడీ లాంగ్వేజీ ఇలా ఉన్నా.. వారు మీతో శృంగారం చేయాలని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. రొమాన్స్ ను కోరుకునే వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చేతులు పట్టుకుంటారు:
ఇద్దరు దంపతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం వెనక చాలా అర్థాలు ఉంటాయి. భార్యాభర్తలు ఒకరి చేతులను మరొకరు పట్టుకున్నారంటే ప్రేమను చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. రక్షణగా, మద్దతుగా ఉంటామని అనుకోవచ్చు. అలాగే శృంగారం కావాలనుకుంటున్నారని కూడా అర్షం చేసుకోవాలి.
మీ భార్య లేదా భర్త మీ చేతులు పట్టుకుని సుతారంగా నిమురుతున్నా, చేతులు పట్టుకుని కళ్లల్లోకి చూస్తున్నా, మెల్లిగా చేతులను నొక్కుతున్నా వారికి శృంగారం కావాలనిపిస్తుందని అర్థం చేసుకోవాలి. వారు మీలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని గుర్తించాలి.
మీ భాగస్వామి కూడా మీ చేతులను రొమాంటిక్ గా పట్టుకుని, మోహంతో కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తుంటే వారికి శృంగారం కావాలని అర్థం చేసుకుని వారికి కావాల్సింది ఇచ్చేయండి.

ప్రైవేటు పార్ట్స్ ను తాకడం:
ఇది చాలా మందికి తెలిసిన సంకేతిక భాషే. మీ భాగస్వామి మీ దగ్గరికి వచ్చి మీ ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతున్నా, తాకేందుకు ప్రయత్నిస్తున్నా, వారికి మీతో ఆ సుఖం కావాలని కోరుకుంటున్నారని అర్థం. మీరేదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వెనక నుండి వచ్చి హత్తుకుని సుతారంగా నిమురుతున్నా, మసాజ్ చేస్తున్నా వారికి మూడ్ వచ్చిందని, నెక్ట్స్ ఆ కార్యం మొదలు పెట్టాల్సిందేనని గుర్తించాలి.
మెడ, చెవుల వెనక, ఛాతీపై, పిరుదులపై, తొడల వద్ద చేతులు వేసినా, గిల్లుతున్నా వారికి శృంగారం కావాలని అర్థం. మీ భాగస్వామి అలాంటి పనులు చేస్తుంటే ఆలస్యం చేయకుండా రతి క్రీడలో మునిగిపోండి.

ఏకాంతంగా ఉండాలని కోరుకోవడం:
మీ భాగస్వామికి మూడ్ వచ్చిందంటే వారు మీతో ఒంటరిగా, ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. గదిలోకి పిలుస్తుంటారు. ఎవరూ లేనప్పుడు తాకుతుంటారు. వారు ఏకాంతం కావాలని కోరుకుంటుంటే, వారు మీతో చిలిపిగా ప్రవర్తిస్తుంటే వారికి మీ నుండి ఏదో కావాలని ఆశిస్తున్నారని అర్థం చేసుకొని మెలగండి.
ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, చెక్కిలి గింత, సున్నితమైన మసాజ్ లాంటివి చేస్తూ అసలు కార్యంలోకి అడుగు పెట్టండి.

ఎవరూ లేని చోటుకు వెళ్దామని అడుగుతుంటే:
ఇది ఎక్కువగా పెళ్లి కాని వ్యక్తుల వద్ద కనిపిస్తుంది. ఏటైనా దూరంగా లాంగ్ డ్రైవ్ కు, రొమాంటిక్ ప్లేస్ కు, హిల్ స్టేషన్ కు, ఊటీ, కొడైకెనాల్, షిమ్లా లాంటి చోట్లకు వెళ్దామని అడుగుతుంటే వారికి అదే కావాలనిపిస్తుందని అర్థం చేసుకోండి.



Click it and Unblock the Notifications