Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
పెళ్లికి ముందే వధూవరులిద్దరూ ఇలా చేస్తే... ఏ ప్రాబ్లమ్స్ ఉండవట!
పెళ్లికి ముందు ఈ మెడికల్ టెస్టులు కచ్చితంగా చేయించుకోవాలంట.
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే చాలా మందికి ఇలాంటి అవకాశం కేవలం ఒక్కసారే వస్తుంది. అందుకే మన దేశంలో ఒక పెళ్లి జరగాలంటే.. అటు ఏడుతరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతుంటారు పెద్దలు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కాబోయే వధూవరుల ఇద్దరి జాతకాలు కలిస్తేనే పెళ్లిళ్లు జరపాలని.. వీటిపై మీ కొత్త జీవితం యొక్క భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

అయితే ప్రస్తుత కాలంలో మాత్రం కాబోయే వధూవరులిద్దరికీ కొన్ని మెడికల్ టెస్టులను కచ్చితంగా చేయించాలంటున్నారు నిపుణులు. లేదంటే ఫ్యూచర్లో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. అయితే పెళ్లికి ముందు కపుల్స్ ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి.. ప్రతికూలాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

రాబోయే రోజుల్లో..
ప్రస్తుతం పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలు లేవని, మూఢం నడుస్తోందని, చాలా మంది వివాహాది కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. అంతేకాదు ఇలాంటి సమయంలో ఎలాంటి శుభకార్యం కూడా చేయరు. అయితే మరికొన్ని రోజుల్లో మాఘమాసం ముగిసి మంచి ముహుర్తాలు రానున్నాయి.

పెళ్లి ఏర్పాట్లు..
బ్రహ్మ ముహుర్తం, మంచి ఘడియలు రానున్న తరుణంలో చాలా మంది ఇప్పటినుండే తమ పిల్లల పెళ్లిళ్లకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ మాసం నుండి మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కాబోతోంది.

జాతకాలకు బదులు..
మన దేశంలో చాలా మంది పెళ్లికి ముందు వధూవరుల జాతకాలు కలిశాయో లేదో చూస్తుంటారు. వారు పుట్టిన తేదీ, నక్షత్రాన్ని బట్టి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ జాతకాలకు బదులు వధూవరులకు కొన్ని మెడికల్ టెస్టులు కచ్చితంగా చేయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

హెల్త్ ఫస్ట్..
పెళ్లికి ముందు జాతకాలు చూసినా.. చూడకున్నా.. ముఖ్యంగా వధూవరులిద్దరి ఆరోగ్యాలు బాగున్నాయా లేదా వివాహం తర్వాత వారు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా సాఫీగా సంసారం సాగిస్తారా అనేది ముందుగానే తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వైవాహిక జీవితం బాగుండాలంటే...
ప్రస్తుత కరోనా కాలంలో ఎవరి ఆరోగ్యం ఎలా ఉందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో పెళ్లికి ఈ రకమైన మెడికల్ టెస్టులు కచ్చితంగా చేయించాలని.. దీని వల్ల మీ ఫ్యూచర్ బాగుంటుందని, మీ వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరీక్షలు..
వివాహానికి ముందు వంధ్యత్వ పరీక్షను కచ్చితంగా చేయించాలట. దీని వల్ల మీలో స్మెర్మ్ కౌంట్ చేసి మీ పునరుత్పత్తి అవయవాలను పరిశీలించి, మీరు వివాహానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాలతో పాటు భవిష్యత్తులో మీకు పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో ముందే తెలుసుకోవచ్చట.

STD టెస్ట్..
పెళ్లికి ముందు యునైటెడ్ కింగ్ డమ్(UK) వంటి దేశాల్లో STD ఉందో లేదో ముందే టెస్టులు చేయించుకుని తెలుసుకుంటారట. ఎందుకంటే పెళ్లి తర్వాత వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయట.

రక్త పరీక్ష..
పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామితో పాటు మీరు కూడా రక్త పరీక్షను చేయించుకోవాలి. మీ బ్లడ్ గ్రూపును బట్టి మీకు పుట్టబోయే పిల్లలకు సమస్యలు వస్తాయా లేదా అనే విషయాలు తెలుసుకోవచ్చు.
అలాగే జన్యుపరంగా వచ్చే, వారసత్వం ప్రకారం, ఒక జనరేషన్ నుండి మరో జనరేషన్ వరకు వ్యాపిస్తుందో లేదో అనే విషయాలను నిర్ణయించుకోవాలట. హృద్రోగ జబ్బులు, క్యాన్సర్లు లాంటి వాటి గురించి తెలుసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. ఇంకా వీలైతే మీరు హెచ్ఐవి టెస్టులు చేయించుకుంటే మరీ మంచిది.



Click it and Unblock the Notifications